వారణాసి గ్లింప్స్ ఇంట్లో కూర్చొని మన ల్యాప్‌టాప్‌లోనూ చేయొచ్చన్న యూజర్.. క్లాస్ పీకిన బాహుబలి ప్రొడ్యూసర్

రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమా గ్లింప్స్ వీడియోపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ వీడియో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో తయారు చేశారన్న కామెంట్లను తిప్పికొట్టాడు.

Published on: Feb 4, 2026, 19:26:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 'వారణాసి'. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ గతేడాది విడుదలై సంచలనం సృష్టించింది. అయితే ఆ వీడియోలోని అద్భుతమైన విజువల్స్ చూసి కొందరు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించారని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించాడు.

వారణాసి గ్లింప్స్ ఇంట్లో కూర్చొని మన ల్యాప్‌టాప్‌లోనూ చేయొచ్చన్న యూజర్.. క్లాస్ పీకిన బాహుబలి ప్రొడ్యూసర్
వారణాసి గ్లింప్స్ ఇంట్లో కూర్చొని మన ల్యాప్‌టాప్‌లోనూ చేయొచ్చన్న యూజర్.. క్లాస్ పీకిన బాహుబలి ప్రొడ్యూసర్

అసలు గొడవేంటి?

రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ 3 నిమిషాల గ్లింప్స్ వీడియోను రూపొందించడానికి తమ ఆర్టిస్టులు వారాల తరబడి కష్టపడ్డారని వివరించాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "భవిష్యత్తులో చూస్తే AI జనరేటెడ్ అని అనడాన్ని అవమానంగా భావించడం ఫన్నీగా అనిపిస్తుంది. 'వారణాసి' సినిమా విడుదలయ్యే సమయానికి AI ఎంతలా అభివృద్ధి చెందుతుందంటే.. ఇలాంటి వీడియోలను మనం లాప్‌టాప్‌లోనే 'గ్రోక్' (Grok) లేదా 'క్లింగ్' (Kling) వంటి టూల్స్ వాడి చేసేయొచ్చు. AI అనేది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులకు పని తగ్గించే ఒక అద్భుతమైన టూల్" అని కామెంట్ చేశాడు.

అదొక 'చెత్త'.. కళాకారులకు అవమానం: శోభు

సదరు నెటిజన్ వ్యాఖ్యలకు శోభు యార్లగడ్డ గట్టిగానే బదులిచ్చాడు. "మీ ట్వీట్ చూశాక నాకు ఒకటి అర్థమైంది. మీరు చెప్పినట్టు లాప్‌టాప్‌లో AI వాడి చేసే వీడియోలు నాణ్యత లేని ‘చెత్త’లా ఉంటాయి. అది నిజమైన కళాకారులను అవమానించడమే అవుతుంది" అని అతడు మండిపడ్డాడు.

అయితే AI టెక్నాలజీని పూర్తిగా కొట్టిపారేయలేదు. "మీరు చెప్పిన రెండో పాయింట్ కరెక్టే. వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులకు ప్రీ-విజువలైజేషన్ కోసం, పని వేగంగా చేయడానికి AI ఒక గొప్ప టూల్‌గా ఉపయోగపడుతుంది. కానీ దాన్ని ఫైనల్ అవుట్‌పుట్‌తో పోల్చకూడదు. మీరు రెండు వేర్వేరు విషయాలను కలిపి మాట్లాడుతున్నారు" అని శోభు స్పష్టత ఇచ్చాడు.

రాజమౌళి క్లారిటీ: ఒక్కో ఫ్రేమ్‌కు 20 గంటలు!

ఈ 'AI' పుకార్లపై దర్శకుడు రాజమౌళి కూడా 'పాలిగాన్' (Polygon) ఇంటర్వ్యూలో స్పందించాడు. "అక్టోబర్ నుంచే మా ఆర్టిస్టులు ఆ 3 నిమిషాల టీజర్ కోసం గీతలు గీయడం మొదలుపెట్టారు. విడుదలయ్యే చివరి రోజు వరకు వాళ్లు రేయింబవళ్లు కష్టపడ్డారు. ఆ చివరి మూడు వారాలు వాళ్లు కనీసం సరిగ్గా నిద్రపోయారో లేదో కూడా నాకు తెలియదు. అంత కష్టపడితే.. దాన్ని AIతో చేశారు అనడం వాళ్ల ప్రతిభను ఘోరంగా అవమానించడమే. అందులోని ఒక్కో ఫ్రేమ్ రెండర్ అవ్వడానికి 20 గంటల సమయం పట్టింది. వాళ్ల కష్టం అలాంటిది" అని జక్కన్న వివరించాడు.

వారణాసి సినిమా వివరాలు

'వారణాసి' మూవీలో మహేష్ బాబు 'రుద్ర'గా, ప్రియాంక చోప్రా 'మందాకిని'గా, పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ'గా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More