Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ- మహేశ్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా మెప్పించాడా? ఎలా ఉందంటే?
Srinivasa Mangapuram Review And Rating In Telugu: ఘట్టమనేని వంశం నుంచి వచ్చిన జయకృష్ణ హీరోగా తెరకెక్కిన తొలి సినిమా శ్రీనివాస మంగాపురం. బాలీవుడ్ బ్యూటీ రాషా తడానీ హీరోయిన్‌గా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి శ్రీనివాస మంగాపురం రివ్యూలో తెలుసుకుందాం.
Srinivasa Mangapuram Review And Rating In Telugu: తెలుగు సినిమా రంగానికి సరికొత్త హీరోగా పరిచయమయ్యారు ఘట్టమనేని జయకృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ, గ్లోబల్ స్టార్ మహేశ్ బాబుల నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన కథానాయకుడిగా అడుగుపెట్టిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'.

శ్రీనివాస మంగాపురం రివ్యూ
మహేశ్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని కూడా హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆర్ఎక్స్ 100, మంగళవారం డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఇవాళ (జూలై 30) థియేటర్లలో విడుదల అయింది.
మరి ఈ సినిమా ఎలా ఉంది, హీరోగా ఘట్టమనేను మూడోతరం వారసుడు జయకృష్ణ మెప్పించాడా వంటి వివరాలను నేటి శ్రీనివాస మంగాపురం రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
పెద్దిరెడ్డి (శ్యామ్) తిరుపతిలో అందరికి భయం. అలాంటి పెద్దిరెడ్డి కూతురు మంగ (రాషా తడాని)ని శ్రీవారి వేడుకల్లో చూసి మనసు పారేసుకుంటాడు శ్రీను. మంగాను ప్రేమలో పడేసేందుకు శ్రీను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలోనే థియేటర్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న మంగాకు శ్రీను హెల్ప్ చేస్తాడు. అప్పటికే మంగాకు పెళ్లి కుదిరి నిశ్చితార్థం జరుగుతుంది.
మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉండగా.. తిరుపతి సమీపంలోని కొండపై మంగాకు తన ప్రేమను చెబుతాడు శ్రీను. కానీ మంగా ఛీ కొడుతుంది. మంగా వెంట శ్రీను పడటం చూసిన పెద్దిరెడ్డి తమ్ముడు చూసి ఇంట్లో విషయం చెబుతాడు.
ఆ తర్వాత ఏమైంది? శ్రీను కొట్టి కారులో తీసుకెళ్లిన పెద్దిరెడ్డి మనుషులు ఎందుకు వదిలిపెట్టారు? శ్రీను ప్రేమను మంగా అంగీకరించిందా? పెద్దిరెడ్డి చెల్లి (వాసుకి) శ్రీనును వాసు బాబు అని ఎందుకు పిలిచింది? శ్రీనుగా వాసుబాబు ఎలా మారాడు? వాసుబాబుకు భళ్లారి జిల్లాకే పెద్ద అయిన వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) ఉన్న సంబంధం ఏంటీ? శ్రీను, మంగా జీవితాల్లో ఏం జరిగింది? చివరికి ఇద్దరు ఒక్కటయ్యారా? లేదా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
ఇది ఒక లవ్ అండ్ ఫ్యామిలీ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాబట్టి కథలో పెద్దగా కొత్తదనం ఏం లేదు. కానీ, జయకృష్ణను మాస్ హీరోగా ఎలివేట్ చేసేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు దర్శకనిర్మాతలు.
సినిమా ఆరంభం విలన్‌ను పవర్‌ఫుల్‌గా చూపిచండం, రెగ్యులర్ లవ్ సీన్లతో సాగుతుంది. హీరోయిన్ వెంట హీరో పడటం రొటీన్‌గానే ఉన్న జయకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ కొత్తగా ఉంది. అయితే, మధ్యలో సీనియర్ నటుడు నరేష్ వీకే, బ్రహ్మాజీలతో కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ బాగా నవ్విస్తాయి.
ఇంట్రెస్టింగ్ సీన్స్
నరేష్ పెళ్లిళ్ల స్టోరీ రియల్ లైఫ్‌కు దగ్గరిగా ఉండే ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచేస్తుంది. హీరోహీరోయినల్ గతం, వాసుబాబుకి-మంగాకు ఉన్న సంబంధం, వారి రిలేషన్, మోహన్ బాబు ఎంట్రీ వంటివి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి.
ముఖ్యంగా మోహన్ బాబు సీన్స్ పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. హీరో హీరోయిన్ ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. క్లైమాక్స్‌లోనూ ఎమోషన్స్ బాగా ఆకట్టుకుంటాయి. అయితే, రెగ్యులర్ ఫార్మాట్‌లోనే క్లైమాక్స్ ముగిస్తారు. దర్శకుడు అజయ్ భూపతి తన మార్క్ శైలిలో ఈ ప్రేమకథను ఎంతో అందంగా మలిచారు. పాతకాలపు అనుభూతులను నేటితరం ట్రెండ్‌కు తగినట్లు జోడించి కథను నడిపించారు.
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు. జయకృష్ణ గుమ్మడి కెమెరా పనితనం తెరపై ప్రతి ఫ్రేమ్‌ను వర్ణరంజితంగా చూపించగా, చందమామ కథలు పిక్చర్స్ నిర్మాణ విలువలు ఎంతో రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.
జయ కృష్ణ వన్ మ్యాన్ షో..
తొలి చిత్రమే అయినా జయకృష్ణ నటనలో ఎంతో పరిణతి కనిపించింది. ఘట్టమనేని వారి వారసత్వానికి తగ్గట్టుగా ఆయన ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్, ఈజ్‌తో మెప్పించారు. డ్యాన్సులు, యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో పండించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ బాగున్నాయి.
రాషా తడాని గ్లామర్.. మోహన్ బాబు పవర్ ఫుల్ రోల్
హీరోయిన్‌గా రాషా తడానీ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. జయకృష్ణ, రాషా జంట తెరపై ఎంతో ముచ్చటగా, సరికొత్త కాంబినేషన్‌లా కనిపిస్తుంది. నటి వాసుకి ఇంటర్వెల్ ముందు ఇచ్చే మలుపు కథకు ప్రాణం పోసింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తమదైన గంభీరమైన పాత్రలో కనిపించి సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చారు. నరేష్, బ్రహ్మాజీల కామెడీ ట్రాక్ నవ్వులు పూయించగా, విలన్ పాత్రలో అజయ్ మెప్పించారు.
ఫైనల్‌గా చెప్పాలంటే?
ఫైనల్‌గా చెప్పాలంటే శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram Review) సినిమా ఘట్టమనేని జయకృష్ణకు మంచి డెబ్యూట్ అని చెప్పొచ్చు. రొటీన్ కథ అయినప్పటికీ ఆకట్టుకునే నటన, సాంకేతిక విలువలతో కూడిన ఈ సినిమాపై ఓ లుక్కేయొచ్చు.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


