Mahesh Babu: బాబాయ్ మహేష్ బాబు సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్న జయకృష్ణ.. ఘట్టమనేని వారసుడి డెబ్యూ వెనుక మాస్టర్ ప్లాన్!

Mahesh Babu Jayakrishna: సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయమవుతున్నాడు. బాబాయ్ మహేష్ బాబు డెబ్యూ మూవీ ‘రాజకుమారుడు’ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నాడు ఈ కుర్రాడు. అతని డెబ్యూ మాస్టర్ ప్లాన్ ఏంటో చూసేయండి.

Published on: Jul 14, 2026, 09:06:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mahesh Babu Jayakrishna: టాలీవుడ్‌లో తిరుగులేని ఘన వారసత్వాన్ని కలిగి ఉన్న కుటుంబాలలో ఘట్టమనేని ఫ్యామిలీ ఒకటి. ఇప్పుడు ఈ సామ్రాజ్యం నుంచి మూడో తరం వారసుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు జయకృష్ణ ఘట్టమనేని. దివంగత నటుడు, నిర్మాత రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ లీడ్ రోల్‌లో ఎంట్రీ ఇస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీనివాస మంగాపురం’.

బాబాయ్ మహేష్ బాబు సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్న జయకృష్ణ.. ఘట్టమనేని వారసుడి డెబ్యూ వెనుక మాస్టర్ ప్లాన్! (x)
బాబాయ్ మహేష్ బాబు సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్న జయకృష్ణ.. ఘట్టమనేని వారసుడి డెబ్యూ వెనుక మాస్టర్ ప్లాన్! (x)

బాబాయ్ సెంటిమెంట్

తెలుగు చిత్రసీమలో సెంటిమెంట్లకు, లక్కీ లొకేషన్లకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఘట్టమనేని కుటుంబానికి గుంటురు జిల్లాలోని తమ స్వగ్రామం బుర్రిపాలెం అంటే ఒక ఎమోషనల్ బాండింగ్. గతంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా పరిచయమైన బ్లాక్‌బస్టర్ మూవీ ‘రాజకుమారుడు’ ప్రమోషన్ల ప్రచారాన్ని అప్పట్లో సరిగ్గా ఇదే గ్రామం నుంచే అధికారికంగా ప్రారంభించారు.

అబ్బాయ్ కూడా

రాజకుమారుడు సినిమా అప్పట్లో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. మహేష్ బాబును రాత్రికి రాత్రే స్టార్‌గా నిలబెట్టింది ఈ మూవీ. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను నమ్ముకుంటూ జయకృష్ణ ఘట్టమనేని కూడా తన మొదటి సినిమా ప్రమోషన్స్ కోసం బుర్రిపాలెం మట్టినే ఎంచుకోవడం విశేషం.

శ్రీనివాస మంగాపురం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు ముందు ఈ మూవీ యూనిట్ బుర్రిపాలెం గ్రామాన్ని సందర్శించింది.

ఆ ఫ్యాన్స్ కోసం

దివంగత రమేష్ బాబు కుటుంబం చాలా కాలంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు జయకృష్ణ ఎంట్రీకి ఒక బలమైన ఎమోషనల్ పునాది వేయడం మేకర్స్ వ్యూహం. కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, లెజెండ్ కృష్ణ పాత తరం అభిమానుల మద్దతు కోసమే ఈ బుర్రిపాలెం రూట్ మ్యాప్‌ను డిజైన్ చేశారని టాక్. దీనివల్ల చిత్రానికి ప్రారంభం నుంచే భారీగా ఆర్గానిక్ రీచ్, అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ సాలిడ్ హైప్ లభిస్తోంది.

అదే డేట్.. అదే అదృష్టం!

శ్రీనివాస మంగాపురం సినిమా ప్రమోషన్స్ మాత్రమే కాదు.. రిలీజ్ డేట్ విషయంలోనూ మేకర్స్ ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేశారు. మహేష్ బాబు నటించిన ‘రాజకుమారుడు’ చిత్రం సరిగ్గా 1999 జూలై 30వ తేదీన విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పుడు జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాను కూడా సరిగ్గా అదే తేదీన, అంటే 2026 జూలై 30నే థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు రంగం సిద్ధం చేశారు.

ఈ విధంగా ఒకే గ్రామం నుంచి ప్రమోషన్లు ప్రారంభించి, అదే డేట్‌కు రిలీజ్ ప్లాన్ చేయడం అనేది ఘట్టమనేని అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. బాబాయ్ మహేష్ బాబు లాగే అబ్బాయి జయకృష్ణ కూడా తన కెరీర్ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More