Srinivasa Mangapuram: మహేష్ బాబు అన్న కొడుకు కుమ్మేశాడు.. శ్రీనివాస మంగాపురం ట్రైలర్ రివ్యూ.. మోహన్ బాబు పీక్ విలనిజం
Srinivasa Mangapuram Trailer Review: మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ డెబ్యూ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ రిలీజైంది. ఘట్టమనేని వంశం నుంచి వస్తున్న మరో హీరో జయకృష్ణ ట్రైలర్ లో అదరగొట్టాడనే టాక్ వినిపిస్తోంది. మోహన్ బాబు పీక్ విలనిజం మూవీకి మరింత బలాన్నిచ్చింది. ట్రైలర్ రివ్యూపై ఓ లుక్కేయండి.
Srinivasa Mangapuram Trailer Review: టాలీవుడ్‌లో మరో నట వారసుడు వచ్చేస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరో డెబ్యూ చేస్తున్నాడు. దివంగత రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. మరి మహేష్ బాబు అన్న కొడుకు సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

శ్రీనివాస మంగాపురం ట్రైలర్
రా అండ్ రస్టిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన డైరెక్టర్ అజయ్ భూపతి మరోసారి తన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ముందుకు వచ్చాడు. జయకృష్ణ ఘట్టమనేని, రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని జంటగా పరిచయమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పి. కిరణ్ ‘చందమామ కథలు’ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్విని దత్ సమర్పిస్తున్నారు.
ఘట్టమనేని వారసత్వం
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో వారసుడు జయకృష్ణ ఘట్టమనేని. అయితే సాధారణంగా స్టార్ కిడ్స్ తమ డెబ్యూ కోసం సాఫ్ట్ లవ్ స్టోరీస్ లేదా కమర్షియల్ మాస్ కథలను ఎంచుకుంటారు. కానీ జయకృష్ణ మాత్రం మొదటి సినిమాకే తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పీరియాడిక్, ఇంటెన్స్ రస్టిక్ డ్రామాను ఎంచుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ట్రైలర్ రివ్యూ
ఫిలిం నగర్ ఇన్‌సైడ్ సోర్సెస్ ప్రకారం.. శ్రీనివాస మంగాపురం సినిమా కథ ‘ఆర్ఎక్స్ 100’ తరహాలోనే విపరీతమైన ఎమోషనల్ హైస్ అండ్ లోస్‌తో సాగుతుంది. తిరుపతి పరిసరాల్లోని ‘శ్రీనివాస మంగాపురం’ అనే గ్రామంలో శ్రీను, మంగా అనే ఇద్దరి మధ్య అమాయకపు ప్రేమకథ ఎలా మొదలైందనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
ఆ లవ్ స్టోరీ అక్కడి లోకల్ పాలిటిక్స్, ల్యాండ్ మాఫియా వల్ల ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కోర్ ప్లాట్. కేవలం గ్లామర్ కోసమే కాకుండా రాషా థడాని పాత్రకు సినిమాలో విపరీతమైన పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందని, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక ‘బోల్డ్ ట్విస్ట్’ సినిమాకే మేజర్ హైలైట్ కానుందని తెలుస్తోంది. ఫస్ట్ మూవీ అయినప్పటికీ హీరోయిన్ తో కెమిస్ట్రీ, యాక్షన్ సీన్స్ లో జయకృష్ణ ఘట్టమనేని బెస్ట్ ఇచ్చాడని అంటున్నారు.
మోహన్ బాబు విలనిజం
ఈ సినిమాకు బిగ్గెస్ట్ కమర్షియల్ అసెట్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇందులో ఆయన వెంకటప్పయ్య నాయుడు అనే పవర్‌ఫుల్ అండ్ క్రూరమైన నెగటివ్ రోల్‌లో కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో మోహన్ బాబు పలికించిన గంభీరమైన డైలాగ్ డెలివరీ, రాయలసీమ యాస సినిమా స్కేల్‌ను మార్చేసింది.
నూతన నటుడైన జయకృష్ణ.. మోహన్ బాబు లాంటి లెజెండ్‌ను ఎదిరించే సీన్స్‌లో చూపించిన ఈజ్ థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ ఐ-ఫీస్ట్ కానుంది.
మహేష్ బాబు అప్రూవల్
శ్రీనివాస మంగాపురం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో జయకృష్ణ ఘట్టమనేని మాట్లాడుతూ తన బాబాయి మహేష్ బాబు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మూవీకి బాబాయి సపోర్ట్ ఉందన్నాడు. టీజర్, ట్రైలర్ కు ఆయన అప్రూవల్ వచ్చిన తర్వాతే రిలీజ్ చేశామన్నాడు. ట్రైలర్ బాగుందని బాబాయి చెప్పాడని జయకృష్ణ ఘట్టమనేని వెల్లడించాడు.
ప్రీ-రిలీజ్ బిజినెస్
వైజయంతీ మూవీస్ అధినేత అశ్విని దత్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో నైజాం, ఆంధ్రా ఏరియాల్లో థియేట్రికల్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడైనట్లు ట్రేడ్ టాక్. రాక్‌స్టార్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని రా యాక్షన్ బ్లాక్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి ఎలివేట్ చేసింది. జూలై 30, 2026న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


