మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం- హైదరాబాద్‌లో గ్రాండ్ పార్టీ- నీకు ఇంకేం అవసరం లేదంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ కామెంట్స్
సినీ పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, స్టేజీ మీద రజనీకాంత్ చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది.
కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మంచు మోహన్ బాబు ఈ ఏడాది సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో సినీ సెలబ్రిటీలందరికి గ్రాండ్ పార్టీ ఇస్తూ ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సినీ ఇండస్ట్రీల నుంచి స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

సినీ పరిశ్రమ నుంచి సెలబ్రిటీలు
అలాగే, మోహన్ బాబు స్నేహితుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ కార్యక్రమానికి హాజరై మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
రజనీకాంత్ వీడియో వైరల్
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా తన స్నేహితుడు మోహన్ బాబు గురించి రజనీకాంత్ స్టేజీపై స్పీచ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నీకు ఇంకేం అవసరం లేదు
"నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నీకు ఇంకేమీ అవసరం లేదు. నువ్వు ఇప్పుడు చేయాల్సిందల్లా సంతోషంగా ఉండటం, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే. నీకు కావాల్సింది, నువ్వు చేయాల్సింది ఇంకా ఏం లేదు" అని మోహన్ బాబు గురించి రజనీకాంత్ చెప్పారు.
పెదరాయుడు సినిమా
మోహన్ బాబు, రజనీకాంత్ ఏళ్ల తరబడి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసింది. వీరిద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా వీరిద్దరు నటించిన పెదరాయుడు సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇకపోతే మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థాన కార్యక్రమంలో తలైవా తెలుపు రంగు, పంచెకట్టులో కనిపించారు.
కన్నవారి కలలుతో అరంగేట్రం
కాగా, మోహన్ బాబు 1974లో వచ్చిన కన్నవారి కలలు సినిమాతో టాలీవుడ్‌లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సపోర్టింగ్ రోల్ చేశారు. ఆ తర్వాత 1975లో వచ్చిన స్వర్గం నరకం మూవీతో మంచి బ్రేక్ అందుకుని పేరు తెచ్చుకున్నారు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు అని తెలిసిందే.
ఎంబీ50 స్పెషల్ పోస్టర్
ఇక మోహన్ బాబు 50 ఏళ్ల సినీ కెరీర్ సందర్భంగా కలెక్షన్ కింగ్ పోషించిన పాత్రలన్నింటితో ఎంబీ50 స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు మంచు విష్ణు. ఈ పోస్ట్‌కు మంచు విష్ణు అందమైన నోట్ రాసుకొచ్చాడు.
94 ఏళ్ల తెలుగు సినిమాను
"94 ఏళ్ల తెలుగు సినిమాను 50 ఏళ్ల పాటు మా నాన్న గారు తన భుజాలపై మోశారు. ఆయన అసాధారణ ప్రయాణానికి సాక్ష్యమిచ్చినందుకు కృతజ్ఞత. వినయపూర్వకంగా, ఎప్పటికీ గర్వపడుతున్నాను. 50 ఏళ్ల లెజెండరీ సంవత్సరాలకు అభినందనలు నాన్న" అని మంచు విష్ణు రాసుకొచ్చాడు.
నాని ది ప్యారడైజ్ సినిమాలో
ఇదిలా ఉంటే, మోహన్ బాబు చివరి సారిగా మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన కన్నప్పలో మహదేవ శాస్త్రిగా కనిపించారు. కన్నప్ప సినిమాకు మోహన్ బాబు నిర్మాతగా ఉన్నారు. ఇకపోతే నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


