సంగీత ప్రపంచంలోకి మంచు మనోజ్- ‘మోహన రాగ మ్యూజిక్’గా పేరు- తండ్రి మోహన్ బాబుకు ఇష్టమైన రాగంతో!

వరుస సినిమాలతో దూసుకుపోతున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. ‘మోహన రాగ మ్యూజిక్’ అనే కంపెనీని మంచు మనోజ్ ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని తాజాగా ఇవాళ (నవంబర్ 22) మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించాడు.

Nov 22, 2025, 14:38:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు దక్కించుకున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. సినిమాల్లో హీరోగా, విలన్‌గా అదరగొట్టిన మంచు మనోజ్ సంగీత పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.

సంగీత ప్రపంచంలోకి మంచు మనోజ్- ‘మోహన రాగ మ్యూజిక్’గా పేరు- తండ్రి మోహన్ బాబుకు ఇష్టమైన రాగంతో!
సంగీత ప్రపంచంలోకి మంచు మనోజ్- ‘మోహన రాగ మ్యూజిక్’గా పేరు- తండ్రి మోహన్ బాబుకు ఇష్టమైన రాగంతో!

మోహన రాగ మ్యూజిక్

అందులో భాగంగా మంచు మనోజ్ తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ ‘మోహన రాగ మ్యూజిక్’ను ప్రారంభించబోతున్నట్లు తాజాగా ఇవాళ (నవంబర్ 22) అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ ఆయ‌న‌కు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఓ ఎమోష‌న‌ల్ మైల్ స్టోన్ అని తెలుస్తోంది.

వెండితెరపై తనదైన నటన, పాత్రలతో విలక్ష‌ణ న‌టుడుగా తెలుగు సినిమాల్లో ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు మంచు మ‌నోజ్‌. చైల్డ్ ఆర్టిస్ట్‌గా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. బిందాస్‌, క‌రెంట్ తీగ‌, పోటుగాడు వంటి మాస్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తోపాటు ప్ర‌యోగ్రాత్మ‌క చిత్రాల్లోనూ న‌టించి మెప్పించారు.

సినిమాల్లో త‌న అభిరుచిని న‌ట‌న‌లోనే కాకుండా సొంతంగా స్టంట్స్ కంపోజ్ చేయ‌టం, సెట్స్ రూప‌క‌ల్ప‌న‌లో ఇన్‌వాల్వ్‌ కావ‌టం, గుర్తుండి పోయే పాత్ర‌ను రూపొందించ‌టంలో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ వ‌చ్చారు.

సాంగ్స్ పాడిన మనోజ్

ప్రారంభం నుంచి మంచు మనోజ్ జీవితంలో సంగీతం అనేది ఓ అంతర్భాగంగా ఉంటోంది. ఎందుకంటే ‘పోటుగాడు’ సినిమాలో ‘ప్యార్ మే పడిపోయానే..’ పాటను పాడి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. కోవిడ్ స‌మ‌యంలో అంద‌రినీ ఉత్తేజ‌ర‌ప‌రిచేలా ‘అంతా బాగుంటాంరా’ పాట‌ను విడుద‌ల చేశారు.

‘మిస్టర్ నూకయ్య’ చిత్రంలో ‘పిస్తా పిస్తా.. ’ పాట‌తో పాటు ‘నేను మీకు తెలుసా’ సినిమాలో ‘ఎన్నో ఎన్నో..’, ‘మిస్టర్ నూకయ్య’ సినిమాలో ‘ప్రాణం పోయే బాధ..’ పాట‌ల‌కు సాహిత్యాన్ని అందించారు. ఆయ‌న హృద‌యానికి హ‌త్తుకునేలా, భావోద్వేగంతో కూడుకున్న‌, విల‌క్ష‌ణ‌మైన‌ గాత్రం ఆయ‌న‌లోని స‌హ‌జ‌మైన సంగీత ప్రతిభను తెలియజేస్తోంది.

తెరపై పాటలు పాడటం, రాయటం వంటి సంగీత సంబంధమైన విషయాలే కాదు.. తెర వెనుక ఎన్నో విశేష‌మైన సేవ‌ల‌ను మంచు మనోజ్ అందించారు. మ‌నోజ్ త‌న సినీ ప్ర‌యాణంలో తండ్రి మంచు మోహ‌న్ బాబు, అన్న‌య్య మంచు విష్ణు, సోద‌రి మంచు లక్ష్మి చిత్రాల‌కు సంగీత విభాగంలో వ‌ర్క్ చేయ‌టంతో పాటు వారి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కూడా డైరెక్ట్ చేశారు.

హాలీవుడ్ సినిమాకు సంగీతం

త‌న కుటుంబ స‌భ్యులు న‌టించిన ఎన్నో చిత్రాల‌కు ఆయ‌న పాట‌ల‌ను పాడారు మంచు మనోజ్. అంత‌ర్జాతీయ స్థాయిలో త‌న గుర్తింపును పెంచుకుంటూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అచ్చు రాజ‌మ‌ణితో క‌లిసి హాలీవుడ్ సినిమా ‘బాస్మ‌తి బ్లూస్’కు సంగీతాన్ని అందించారు.

ఈ మూవీలో కెప్టెన్ మార్వెల్ పాత్ర పోషించిన బ్రీ లార్స‌న్ ఇందులో ప్ర‌ధాన‌ పాత్ర‌లో నటించారు. ఇకపోతే మంచు మనోజ్ ప్రారంభించిన ‘మోహన రాగ మ్యూజిక్’ అనేది కొత్త ఆలోచనలు, భావోద్వేగాలను కలిపే వేదిక. ఈ కంపెనీతో మంచు మనోజ్ ఒక కొత్త సృజనాత్మక అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు.

కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టం, ప్ర‌యోగాత్మ‌క సంగీతాన్ని ప్రోత్స‌హించ‌టం.. భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా స‌రికొత్త సంగీతాన్ని రూపొందించ‌టమే దీని ప్రధాన లక్ష్యం.

తండ్రీకొడుకులకు ఇష్టమైన రాగం

ఈ పేరుకీ ప్రత్యేకత‌ ఉంది. అదేంటంటే.. తండ్రీ కొడుకులిద్ద‌రికీ (మంచు మోహన్ బాబు-మంచు మనోజ్) అత్యంత ఇష్ట‌మైన రాగం మోహ‌న‌ రాగం. అందుకే ఈ పేరు పెట్టినట్లు టాక్ నడుస్తోంది.

ఒరిజిన‌ల్ సింగిల్స్‌, కొలాబ్రేష‌న్స్‌, కొత్తర‌క‌మైన మ్యూజిక్ ప్రాజెక్ట్స్ ఈ లేబుల్ నుంచి రాబోతున్నాయి. మోహ‌న రాగ మ్యూజిక్ కంపెనీతో జ‌ర‌గ‌బోయే అతి పెద్ద ఇంట‌ర్నేష‌న‌ల్ కొలాబ్రేష‌న్ గురించి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More