కోట్లు వచ్చే కెరీర్ వదిలేసి సినిమాల్లోకి, మహేశ్ బాబు మూవీస్ చూస్తూ పెరిగా, నా రంగు చూసి ఛాన్స్ ఇవ్వరనుకున్నా: నిహారిక
Niharika NM On Quitting Content Creation: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫన్నీ వీడియోలతో నెట్టింట కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నిహారిక ఎన్ఎమ్ వెండితెరపై సత్తా చాటుతున్నారు. డిజిటల్ మీడియా సంపాదనను పక్కనపెట్టి నటన వైపు రావడం, సినిమాల్లో ఎంట్రీపై ఆమె పంచుకున్న ఆసక్తికర విశేషాలు.
Niharika NM On Quitting Content Creation: డిజిటల్ మీడియా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్ఎమ్ (Niharika NM) ఇప్పుడు వెండితెరపై వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. దక్షిణాది సినిమాల ద్వారా నటిగా మారిన ఈ ఇంటర్నెట్ స్టార్, త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

ప్యారడైజ్ విలన్‌తో
నాని ప్యారడైజ్ విలన్ రాఘవ్ జుయల్‌తో కలిసి నిహారిక నటించిన హిందీ చిత్రం 'భాయ్ తేరా స్టార్ హై' (Bhai Tera Star Hai) జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల తమిళంలో ఆమె నటించిన 'ఇదయమ్ మురళి' చిత్రం మంచి విజయాన్ని సాధించగా, వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్న నిహారిక తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
భారీ సంపాదనను పక్కనపెట్టి నటన వైపు..
సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు, నెలకు లక్షల్లో వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకుని నటన వైపు రావడం సామాన్యమైన విషయం కాదు. దాదాపు మూడేళ్ల కిందటే కంటెంట్ క్రియేషన్‌ను ఆపేసినట్లు నిహారిక ఎన్ఎమ్ చెప్పారు.
"ఇంటర్నెట్‌లో అప్పటికే విజయం సాధించి, మంచి రాబడినిచ్చే కెరీర్‌ను వదిలేసి కొత్త దారి ఎంచుకోవడం పెద్ద సాహసమే. అయితే నాలోని నటిని పెంపొందించుకోవడానికి, పెద్ద కథల్లో భాగం కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను" అని నిహారిక పేర్కొన్నారు.
అమెరికాలోని చాప్‌మన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎమ్‌ఎఫ్‌ఏ పూర్తి చేసిన నిహారిక, చిన్నప్పటి నుంచీ నాటక రంగంలో అనుభవం ఉన్న ఆర్టిస్ట్. సోషల్ మీడియాలో చేసిన ఫన్నీ వీడియోలు కూడా ఒక రకమైన కథా చెప్పడమేనని నిహారిక అభిప్రాయపడ్డారు.
'భాయ్ తేరా స్టార్ హై'తో బాలీవుడ్ ఎంట్రీ
దర్శకుడు వివేక్ అగర్వాల్ తెరకెక్కించిన 'భాయ్ తేరా స్టార్ హై' చిత్రంలో నిహారిక 'రష్మి' అనే ఉత్సాహవంతమైన యువతి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో డ్యాన్సర్, నటుడు రాఘవ్ జుయల్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభవమని ఆమె తెలిపారు.
"సెట్‌లో రాఘవ్‌తో ఒక సీన్ కోసం ఇద్దరం కలిసి స్పాట్‌లో ఇంప్రవైజ్ చేశాం. అది స్క్రీన్‌పై చాలా బాగా వచ్చింది. ఒక మంచి కో-యాక్టర్ తోడుంటే సీన్ ఏ స్థాయికి వెళ్తుందో అప్పుడే నాకు అర్థమైంది" అని నిహారిక ఎన్ఎమ్ గుర్తుచేసుకున్నారు.
వర్ణవివక్ష దాటుకుని వచ్చిన గుర్తింపు
ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ సొంత కష్టంతో పైకి వచ్చినవారేనని, ఆ తపన సినిమాలో ప్రతి సీన్‌లోనూ కనిపిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో ముదురు రంగు (Dusky) ఉన్న మహిళలకు ప్రధాన పాత్రలు లభించడం కష్టంగా ఉండేది అని ఆ పాత రోజులను నిహారిక గుర్తు చేసుకున్నారు.
"చిన్నప్పుడు మహేశ్ బాబు సినిమాలు చూస్తూ నేనూ అలాంటి సినిమాల్లో నటించాలని కలలు కనేదాన్ని. కానీ నా రంగు, రూపాన్ని బట్టి నాలాంటి వాళ్లు లీడ్ రోల్స్ చేయలేరని అనుకునేదాన్ని. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. అన్ని రకాల రూపాలు, రంగులు ఉన్న మహిళలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ మార్పు రావడం నిజంగా సంతోషకరం" అని నిహారిక ఆనందం వ్యక్తం చేశారు.
డిజిటల్ క్రియేటర్ నుంచి హీరోయిన్‌గా
హోమ్‌లీ లుక్‌తో పక్కింటి అమ్మాయిలా కనిపించడం వల్ల దక్షిణాది ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని నిహారిక చెప్పారు. కామెడీ జోనర్ తనకెంతో ఇష్టమని, రాబోయే రోజుల్లో తమిళంలో కొన్ని డార్క్ థ్రిల్లర్ ప్రాజెక్టులలో విలక్షణమైన పాత్రలు చేయబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. డిజిటల్ క్రియేటర్ నుంచి వెండితెర హీరోయిన్‌గా మారే క్రమంలో నిహారిక చూపిస్తున్న చొరవ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


