రూ. 200 కోట్ల సామ్రాజ్యం- మహిళల ఇన్నర్‌వేర్ బ్రాండ్‌తో సంచలనం సృష్టించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్- ఆమె ఎవరంటే?

Kusha Kapila Underneat Brand 200 Cr Business: డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ ప్రారంభించి, నటిగా మెప్పించి అనంతరం వ్యాపార రంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్. ఆమె ఇన్నర్‌వేర్ బ్రాండ్ కేవలం ఏడాదిలో రూ.200 కోట్ల వార్షిక ఆదాయ రన్ రేట్ (ARR) సాధించి సంచలనం రేపింది.

Published on: Jul 13, 2026, 17:20:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kusha Kapila Underneat Brand 200 Cr Business: సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్ కేవలం వీడియోలు చేయడానికో, గ్లామర్ ప్రపంచానికో మాత్రమే పరిమితం కాదని మరోసారి నిరూపితమైంది. కెమెరా ముందు నటిగా మెప్పిస్తూనే, తెర వెనుక వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించవచ్చని కుషా కపిల నిరూపించారు.

రూ. 200 కోట్ల సామ్రాజ్యం- మహిళల ఇన్నర్‌వేర్ బ్రాండ్‌తో సంచలనం సృష్టించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్- ఆమె ఎవరంటే?
రూ. 200 కోట్ల సామ్రాజ్యం- మహిళల ఇన్నర్‌వేర్ బ్రాండ్‌తో సంచలనం సృష్టించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్- ఆమె ఎవరంటే?

పారిశ్రామికవేత్తగా

కంటెంట్ క్రియేటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి బాలీవుడ్‌లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న కుషా ఇప్పుడు పారిశ్రామికవేత్తగా (Entrepreneur) సరికొత్త శిఖరాలకు చేరుకున్నారు. కుషా నేతృత్వంలోని ఇన్నర్‌వేర్, షేప్‌వేర్ బ్రాండ్ 'అండర్‌నీట్' (UnderNeat) మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కస్టమర్ల మనసు గెలుచుకుంది.

ఏప్రిల్ 2025లో ప్రారంభం..

ఫ్యాషన్ ప్రపంచంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, ఈ స్టార్టప్ ఏకంగా రూ.200 కోట్ల వార్షిక పునరావృత ఆదాయాన్ని (ARR) సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గురుగ్రామ్ వేదికగా సాగుతున్న ఈ స్టార్టప్‌ను కుషా కపిల, విమర్శ్ రజ్దాన్ కలిసి ఏప్రిల్ 2025లో ప్రారంభించారు.

భారతీయ మహిళల శరీర ఆకృతికి, అవసరాలకు తగ్గట్టుగా సరైన సైజుల్లో ఇన్నర్‌వేర్‌ను అందించాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్‌ను మార్కెట్లోకి తెచ్చారు. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ 'మింత్రా' (Myntra)లో అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే ఈ బ్రాండ్ ఏకంగా 200 శాతం వృద్ధిని నమోదు చేసింది.

93 శాతం కస్టమర్ రేటింగ్

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో సైజ్-ఇన్‌క్లూజివ్, కంఫర్టబుల్ షేప్‌వేర్‌కు ఉన్న డిమాండ్‌ను ఈ సంస్థ సరిగ్గా ఉపయోగించుకుంది. మింత్రాతో పాటు నైకా (Nykaa), అమెజాన్, బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో పాటు తమ సొంత డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) వెబ్‌సైట్ ద్వారా ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

ఇప్పటివరకు ఈ బ్రాండ్ సుమారు 7.86 లక్షలకు పైగా కస్టమర్ సంభాషణలను నమోదు చేసింది. అలాగే 23 వేలకు పైగా వెరిఫైడ్ రివ్యూలను సాధించి, 93 శాతం కస్టమర్ సంతృప్తి రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఈ అద్భుత విజయంపై కుషా కపిల సంతోషం వ్యక్తం చేశారు. కస్టమర్ల నుంచి వస్తున్న స్పందన తమకు మరింత బాధ్యతను పెంచిందని చెప్పారు.

భారతీయ మహిళల నమ్మకమే మా బలం

"మేము ఈ బ్రాండ్ ప్రారంభించడానికి ముందే మహిళలతో జరిపిన చర్చలు మాకు ఎన్నో విషయాలు నేర్పించాయి. సరైన ఫిట్టింగ్ దొరక్క భారతీయ మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు అర్థమైంది. వీటన్నింటికీ పరిష్కారంగానే మేము 'అండర్‌నీట్'ను తీసుకువచ్చాం. మొదటి ఏడాదిలోనే ఆరు లక్షల మంది మహిళలు మా ఉత్పత్తులను ఎంచుకోవడం కేవలం ఒక సంఖ్య కాదు, మాపై వారు ఉంచిన నమ్మకానికి నిదర్శనం" అని కుషా కపిల వివరించారు.

ప్రస్తుతం ఈ బ్రాండ్ లైనప్‌లో బ్రాలు, బాడీసూట్లు, బాడీకాన్ డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయి. రూ.200 కోట్ల మార్కును దాటడం తమ బిజినెస్ మోడల్‌ విజయానికి నిదర్శనమని, భారతీయ ఇన్నర్‌వేర్ కేటగిరీలో వృద్ధికి ఇంకా అపారమైన అవకాశాలు ఉన్నాయని సహ వ్యవస్థాపకుడు విమర్శ్ రజ్దాన్ పేర్కొన్నారు.

సోషల్ మీడియా నుంచి వెండితెర వరకు

కుషా కపిల ప్రయాణం ఎందరో యువతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. డిజిటల్ ప్రపంచంలో టాప్ కంటెంట్ క్రియేటర్‌గా ఉన్నప్పుడే ఆమెకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయి. 'ఘోస్ట్ స్టోరీస్', 'ప్లాన్ ఎ ప్లాన్ బి', 'సెల్ఫీ', 'సుఖీ', 'థాంక్యూ ఫర్ కమింగ్', 'మసాబా మసాబా', 'కేస్ తో బంతా హై' వంటి ఓటీటీ సినిమాలు, ఓటీటీ సిరీసులలో కుషా కపిల నటించారు.

ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ 'మామ్లా లీగల్ హై' సీజన్-2లో అడ్వకేట్ నైనా అరోరా పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు కుషా కపిల. సినిమాలు, వ్యాపారంతో పాటు కుషా కపిల వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.

అర్జున్ కపూర్‌తో డేటింగ్

2017లో జోరావర్ అహ్లువాలియాను వివాహం చేసుకున్న ఆమె, జూన్ 2023లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం సాగినా, ఆ రూమర్లను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఖండించారు. ఇటీవల ప్రముఖ కమెడియన్ అనుభవ్ సింగ్ బాసితో కూడా ఆమె పేరును జోడిస్తూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More