Niharika Konidela: మెగా ఫ్యామిలీలో ఉండేందుకు నేను అర్హురాలిని అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను: నిహారిక కొణిదెల

Niharika Konidela On Being Deserves In Mega Family: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి రూపొందించిన సినిమా కమిటీ కుర్రోళ్లు. ఈ మూవీకి రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మెగా ఫ్యామిలీపై నిహారిక కొణిదెల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jul 24, 2026, 13:16:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Niharika Konidela On Being Deserves In Mega Family: బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై హీరోయిన్‌గా ఇచ్చిన మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి మంచి సక్సెస్ అందుకుంది. ఇటీవల ఆమె నిర్మాతగా మారి రూపొందించిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు 2 నేషనల్ అవార్డ్స్ వచ్చిన విషయం తెలిసిందే.

మెగా ఫ్యామిలీలో ఉండేందుకు నేను అర్హురాలిని అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను: నిహారిక కొణిదెల
మెగా ఫ్యామిలీలో ఉండేందుకు నేను అర్హురాలిని అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను: నిహారిక కొణిదెల

72 నేషనల్ అవార్డ్స్

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో రూపొందిన కమిటీ కుర్రోళ్లు సినిమాతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది.

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో రెండు జాతీయ అవార్డులను ‘కమిటీ కుర్రోళ్లు’ కొల్లగొట్టింది. ఈ సందర్భంగా ఇటీవల చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడిన నిహారిక కొణిదెల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నా 32 ఏళ్ల జీవితంలో

నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరి జర్నీ నాకు తెలుసు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో నా మనసు సంతృప్తితో నిండిపోయింది. నా 32 ఏళ్ల ఈ జీవితంలో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి ఓకే చెప్పడంతో గొప్ప నిర్ణయం" అని అన్నారు.

"ఇది నా సినిమా, ప్రాణం పెట్టాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. మంచి సినిమా తీసినా కూడా అది ఆడియెన్స్ వరకు తీసుకు వెళ్లగలగాలి. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో అందరి కష్టం ఉంది. మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి ఓ గొప్ప ఫీలింగ్ కలుగుతుందంటే.. నా జీవితంలో ఎప్పుడూ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లను" అని నిహారిక కొణిదెల తెలిపింది.

నేషనల్ అవార్డ్ కోసం సినిమా తీయలేదు

"యదు వంశీ గారు ఎప్పుడూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెబుతూనే ఉండేవారు. కానీ, నేను ఒక నేషనల్ అవార్డ్ సినిమా తీయాలని ‘కమిటీ కుర్రోళ్లు’ని నిర్మించలేదు. ఈ జర్నీలో మాత్రం నేను కూడా జాతీయ అవార్డు రావాలని కోరుకున్నాను. 72వ జాతీయ అవార్డుల్లో మేం కూడా ఉండాలని అనుకున్నాను. నా కల నేడు నెరవేరింది" అని నిహారిక సంతోషం వ్యక్తం చేసింది.

"ఆర్టిస్టుల్ని 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లుగా మారేందుకు ఎంతో మేకోవర్ జరిగింది. ఈ జర్నీలో రవి, అక్షయ్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. రవికి నేషనల్ అవార్డ్ రావడం ఆనందంగా ఉంది. మా నాన్న తీసిన ‘రుద్రవీణ’కి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. మా పెదనాన్న గారు, బాబాయ్ గారు సినిమాకి సేవ చేశారు. నేను కొణిదెల ఫ్యామిలీ నుంచి వచ్చాను.. ఏదో ఒకటి చేశాను అని ఇప్పుడు అనిపిస్తోంది" అని నిహారిక కొణిదెల పేర్కొన్నారు.

ఇప్పుడు అర్హురాలిని

"నేను మెగా ఫ్యామిలీలో ఉన్నాను.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ ఫ్యామిలీలో నేను ఉండేందుకు అర్హురాలిని అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను. జాతీయ అవార్డులు సాధించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సినిమా చూసిన తర్వాత మీడియా, ఆడియెన్స్ ఇలా అందరూ కూడా నేషనల్ అవార్డ్ వస్తుందని అన్నారు. మాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి" అని నిహారిక వెల్లడించారు.

"ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. చిరంజీవి గారే అందరికీ గర్వకారణం అని నేను ఫీల్ అవుతుంటాను. ఆయనే నన్ను గర్వకారణం అని అనడంతో ఎంతో ఆనందంగా ఉంది. ‘రుద్రవీణ’కి మీ నాన్న (నాగబాబు) తీసుకున్నారు.. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావ్.. మాకెంతో గర్వంగా ఉంది’ అని ఆయన అనడం నాకు మరింత గర్వంగా ఉంది" అని మెగా డాటర్ నిహారిక కొణిదెల చెప్పుకొచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More