Jani Master: శేఖర్ మాస్టర్‌తో గొడవపై జానీ మాస్టర్ క్లారిటీ- చిరంజీవి ఎంట్రీతో వివాదానికి తెర? మెగాస్టార్‌తో కలిసి లంచ్!
Jani Master Sekhar Master Chiranjeevi: టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య గొడవ జరిగిందనే వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. శేఖర్ మాస్టర్‌తో గొడవపై జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. ముగ్గురు కలిసి లంచ్ చేసినట్లు తెలిపారు.
Jani Master Sekhar Master Chiranjeevi: ఆదివారం (జూలై 12) జరిగిన తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ సమావేశంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగిందనే వార్తలు టాలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం రేపాయి.

శేఖర్, జానీల మధ్య విభేదాలు
టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్లుగా దూసుకుపోతున్న వీరిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని, అసోసియేషన్ వేదికగా అది కాస్తా బయటపడిందంటూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు, కథనాలు వైరల్ అయ్యాయి. దీనిపై జానీ మాస్టర్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ అసలు నిజాలను పంచుకున్నారు.
శేఖర్ మాస్టర్ నా అన్న.. మా మధ్య గొడవల్లేవు!
సినిమా సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, శేఖర్ మాస్టర్‌లతో కలిసి దిగిన ఫోటోలను జానీ మాస్టర్ నెట్టింట షేర్ చేస్తూ రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
"గత రెండు రోజులుగా మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయంటూ కొన్ని తప్పుదోవ పట్టించే వీడియోలు, తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నేను ఈ విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. నాకు, శేఖర్ మాస్టర్ అన్నకు మధ్య ఎలాంటి మనస్పర్థలు గానీ, విభేదాలు గానీ లేవు. మేమంతా ఒకే కుటుంబం, ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటాం" అని జానీ మాస్టర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
వివాదానికి చెక్ పెట్టిన మెగాస్టార్
ఈ వివాదానికి చెక్ పెట్టడంలో టాలీవుడ్ పెద్ద దిక్కు, మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించారు. షూటింగ్ సెట్స్‌లో ఈ రూమర్ల గురించి తెలిసిన వెంటనే ఆయన ఇద్దరు మాస్టర్లను పిలిచి మాట్లాడారు. ముగ్గురు కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు.
"ఈ పుకార్లు వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా సెట్స్‌లో మా ఇద్దరితో మాట్లాడారు. మేమంతా కలిసి ఎంతో ఆనందంగా సమయం గడిపాం, కలిసి లంచ్ కూడా చేశాం. ఆయన చూపించే ప్రేమ, ఇచ్చే మార్గదర్శకత్వం, మద్దతు మాకు చాలా కీలకం. దయచేసి ఎలాంటి ఆధారాలు లేని పుకార్లను నమ్మకండి, ప్రచారం చేయకండి. మనమంతా ప్రేమ, గౌరవంతో కలిసి ముందుకు సాగుదాం" అని జానీ మాస్టర్ రాసుకొచ్చారు.
అసలు వివాదానికి కారణం ఏంటి?
ఈ ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్ల మధ్య అసలు వివాదం తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో తలెత్తిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఫెడరేషన్ అనుమతి లేకుండా అసోసియేషన్ ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడంతో ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు జానీ మాస్టర్ భార్య సుమలత (ఆయిషా) అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
అయితే సుమలత తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై అసోసియేషన్ సభ్యుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, ఈ క్రమంలోనే సుమారు 10 మంది డ్యాన్సర్లు తమ పదవులకు రాజీనామా చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, తమకు తెలియకుండా ఉప ఎన్నికలు జరపాలని చూడటమే ఈ గొడవకు కారణమని ఫెడరేషన్ సభ్యులు భావిస్తున్నారు.
పాత కేసుల నేపథ్యం
జానీ మాస్టర్ గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. 2024 సెప్టెంబర్‌లో ఆయనపై ఒక మైనర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసు వ్యవహారాలపై 2025 నవంబర్‌లో సింగర్ చిన్మయి శ్రీపాద స్పందిస్తూ.. జానీ మాస్టర్, ఆయన భార్య కోర్టులో తాము నిర్దోషులమని నిరూపించుకుంటారనే నమ్మకంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
చిరంజీవి ఎంట్రీతో వివాదానికి తెర
ఈ పాత వివాదాల నేపథ్యంలో తాజాగా శేఖర్ మాస్టర్‌తో గొడవ జరిగిందనే వార్తలు రావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో ఈ వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


