ETV Prabhakar: డాక్టర్ అవుతందనుకున్న మా అమ్మాయి దివిజ హీరోయిన్‌గా పరిచయమవుతోంది: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కామెంట్స్

ETV Prabhakar Daughter Divija Venkataramayya Gari Taluka Songs: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయం అవుతోన్న మూవీ వెంకట్రామయ్య గారి తాలూక. దినేష్ కుమార్ హీరోగా చేస్తున్న ఈ సినిమా పాటల ఆవిష్కరణ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్‌‌లో ప్రభాకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

Published on: Jun 25, 2026, 20:09:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ETV Prabhakar Daughter Divija Venkataramayya Gari Taluka Songs Launch: దినేష్ కుమార్ హీరోగా, ప్రముఖ నటుడు, బుల్లితెర మెగాస్టార్, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'.

డాక్టర్ అవుతందనుకున్న మా అమ్మాయి దివిజ హీరోయిన్‌గా పరిచయమవుతోంది: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కామెంట్స్
డాక్టర్ అవుతందనుకున్న మా అమ్మాయి దివిజ హీరోయిన్‌గా పరిచయమవుతోంది: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కామెంట్స్

వెంకట్రామయ్య గారి తాలూకా పాటల ఆవిష్కరణ

సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకట్రామయ్య గారి తాలూకా మూవీ టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. మానవ సంబంధాలు, తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాలు, ఫాదర్ సెంటిమెంట్ ప్రధానాంశాలుగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందని చిత్రబృందం తెలిపింది.

సమాజంలో డబ్బు చుట్టూ

ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, సుధ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుత సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న మానవ సంబంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను హృద్యంగా ఆవిష్కరించిన కుటుంబ కథా చిత్రమిది అని మేకర్స్ పేర్కొన్నారు.

ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ... "ఈ సినిమా టీజర్, పాటల ఆవిష్కరణ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారి చిత్రాలను గుర్తు చేసే గొప్ప కథ ఇది. చాలా కాలం తర్వాత ఇలాంటి కథ వినడంతో మా అమ్మాయి దివిజను ఈ సినిమా చేయమని ప్రోత్సహించాను. నిర్మాత కోమలి ఎంతో కష్టపడి సినిమా నిర్మించారు. దర్శకుడు సతీష్ ఆవాల తన భుజాలపై బాధ్యత తీసుకుని అద్భుతంగా తెరకెక్కించారు" అని అన్నారు.

డాక్టర్ అవుతుందనుకున్న మా అమ్మాయి

"నాన్న గొప్పతనం, తల్లిదండ్రుల విలువను ఎంతో హృద్యంగా చూపించారు. ఈ సినిమాలోని పాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి. డాక్టర్ అవుతుందనుకున్న మా అమ్మాయి దివిజ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. అందరూ ఆశీర్వదించాలి. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తెలిపారు.

నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ... "ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించే సినిమా ఇది. చాలా కాలంగా చేయాలనుకున్న తరహా పాత్ర ఈ సినిమాలో దక్కింది. మానవ సంబంధాల విలువను గుర్తు చేసే అద్భుతమైన కథ" అని అన్నారు.

పెద్దలకు గౌరవం ఇవ్వడం లేదు

దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ..."మన దేశ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయం. కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా చూపిస్తుంది" అని పేర్కొన్నారు.

"నేను జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తిని. కుటుంబ బంధాల విలువ నాకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో దివిజ వీడియోలు చూసి ఈ పాత్రకు సరిపోతుందని భావించి ఈటీవీ ప్రభాకర్ గారిని సంప్రదించాను. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది" అని డైరెక్టర్ సతీష్ ఆవాల తెలిపారు.

హనుమాన్ సినిమాల విజయం

నిర్మాతలు కోమలి, మహేందర్ తొట్టె మాట్లాడుతూ... "హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో, మా సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాము. మధ్యతరగతి కుటుంబంలో నేను చూసిన అనుభవాలను ఈ సినిమాలో చూపించాం. సినిమా చూస్తున్నంతసేపు కంటతడి పెట్టకుండా ఎవరూ బయటకు రారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని నిర్మించాం. జూలై 18న ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలి" అని కోరారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More