డ్యాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు- జానీ మాస్టర్ భార్య సుమలత విజయం- ఇవాళ ప్రమాణ స్వీకారం- తొలిసారిగా మహిళ అధ్యక్షురాలన్న MLA

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య శ్రీమతి సుమలత దేవి ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Dec 18, 2025, 20:56:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శ్రీమతి, వీవీ సుమలత దేవి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో సుమలత దేవి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఇవాళ (డిసెంబర్ 18) హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

డ్యాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు- జానీ మాస్టర్ భార్య సుమలత విజయం- ఇవాళ ప్రమాణ స్వీకారం- తొలిసారిగా మహిళ అధ్యక్షురాలన్న MLA
డ్యాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు- జానీ మాస్టర్ భార్య సుమలత విజయం- ఇవాళ ప్రమాణ స్వీకారం- తొలిసారిగా మహిళ అధ్యక్షురాలన్న MLA

ముఖ్య అతిథులుగా

ఈ కార్యక్రమానికి శ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్, వీవీ సుమలత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మొట్ట మొదటిసారిగా మహిళ అధ్యక్షురాలు

జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .. "ఈ యూనియన్‌కు మొట్ట మొదటిసారిగా మహిళ అధ్యక్షురాలు ఎన్నికవ్వడం ఆనందంగా ఉంది. సుమలత గారి విజయం యూనియన్‌కు కొత్త రూపుని తీసుకు వస్తుందని నమ్ముతున్నాను" అని అన్నారు.

యూనియన్‌కు అండగా ఉంటాను

"జానీ మాస్టర్ గారు దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగిన జానీ మాస్టర్ గారు, ఆయన సతీమణి సుమలత గారి మీద నమ్మకంతో వారిని ఎన్నుకున్నారు. మా ఫ్యామిలీని తమ ఫ్యామిలీగా చూసుకునే సినీ కార్మికులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ఈ యూనియన్‌కు ఎప్పుడూ అండగా ఉంటాను" అని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హామీ ఇచ్చారు.

ప్రతీ ఒక్క సమస్యను పరిష్కరిస్తాను

వీవీ సుమలతా దేవి మాట్లాడుతూ .. "నా ఈ విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ, ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. యూనియన్‌లో ఉన్న ప్రతీ ఒక్క సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నా” అని తెలిపారు.

కేసులు పెట్టుకుంటే చులకన

శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ .. "ఎన్నికల్లో గెలిచిన సుమలత దేవి గారికి కంగ్రాట్స్. యూనియన్‌లో చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటిని మనలో మనమే పరిష్కరించుకుందాం. బయటకు వెళ్లి కేసులు పెట్టుకోవడం వల్ల మనమే చులకన అవుతాం. మనమంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతీ ఒక్కరికీ నా శుభాకాంక్షలు" అని అన్నారు.

యూనియన్ కార్యవర్గం

ఇదిలా ఉంటే ఈ యూనియన్‌కు ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీనివాసరావు, కోశాధికారిగా పి. చిరంజీవి కుమార్, ఉపాధ్యక్షులుగా కె. సురేష్, యమ్. రాజు, సహ కార్యదర్శులుగా కే. కిరణ్ కుమార్, ఏ. రాము, కార్య నిర్వహక కార్యదర్శిగా యు. శివ కృష్ణ నియామకమయ్యారు.

కమిటీ సభ్యులు

అలాగే, కమిటీ సభ్యులుగా కె. సతీష్ గౌడ్, కె. శ్రీదేవి, పి. సురేష్, ఎస్. వేదాంత, మనోహర్, ఎల్. కృష్ణ, బి. సుమన్, ఆర్. బోస్, ఎస్. శృతి ప్రమాణ స్వీకారం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More