జూబ్లీహిల్స్ నియోజకవర్గం : 2 సార్లు ఓటమి... ఈసారి విక్టరీ.....! నవీన్ యాదవ్ ప్రస్థానం ఇదే

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ విక్టరీ కొట్టారు.  చాలా ఏళ్లుగా రాజకీయంగా పోరాటం చేస్తున్న నవీన్ యాదవ్… తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి తన కలను నెరవేర్చుకున్నారు.

Published on: Nov 14, 2025, 12:23:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ దాదాపుగా విజయం సాధించారు. 24,658 ఓట్ల తేడాతో భారీ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో తొలిసారిగా నవీన్ యాదవ్… ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

నవీన్ యాదవ్
నవీన్ యాదవ్

అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్… విక్టరీని సొంతం చేసుకున్నారు. స్థానికుడైన నవీన్ యాదవ్…. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. కానీ ఈసారి ఉపఎన్నికలో మాత్రం విజయం అందుకొని తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

రెండ్లు సార్లు ఓటమి… ఈసారి విక్టరీ

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన నవీన్‌యాదవ్‌ (42)… చిన్న శ్రీశైలం యాదవ్‌ కుమారుడు. బీ.ఆర్క్‌ (ఆర్కిటెక్చర్‌) చదివిన నవీన్ యాదవ్ చాలా ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని తిరుగుతున్నారు. గతంలో ఎంఐఎంలో పని చేసిన నవీన్ యాదవ్… ఆ తర్వాత బయటికి వచ్చారు. చాలా ఏళ్లుగా స్వతంత్రగా పలు కార్యక్రమాలు చేస్తున్న నవీన్ యాదవ్…. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నవ యువ ఫౌండేషన్‌ను స్థాపించిన నవీన్ యాదవ్…. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతగా పేరొందిన నవీన్ యాదవ్…. ఎమ్మెల్యేగా గెలవటమే లక్ష్యంగా పెటుకున్నారు. ఇందుకోసం చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సఫలీకృతం కాలేదు. కానీ మాగటం గోపినాథ్ మృతితో వచ్చిన ఉపఎన్నికలో మాత్రం…. కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకుని తొలిసారిగా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

2009లో యూసుఫ్‌గూడ డివిజన్‌ నుంచి నవీన్ యాదవ్(ఎంఐఎం) కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూహ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మజ్లిస్‌ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికలో కూడా నవీన్ యాదవ్ ఓడిపోయారు. 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంతో నిలిచి గట్టిపోటీనిచ్చారు. ఇక 2018 ఎన్నికల్లో ఎంఐఎం బరిలో ఉండకపోవటంతో… ఇదే నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ స్వతంత్రంగా పోటీ చేశారు. ఈసారి 18,817 ఓట్లతో సరిపెట్టుకున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కానీ పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. ఇక ఇటీవల సిట్టింగ్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నిక కోసం పలువురి పేర్లు పరిశీలించినప్పటికీ… చివరికి నవీన్ యాదవ్ కే టికెట్ ఖరారైన సంగతి తెలిసిందే.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More