జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ : కొనసాగుతున్న కాంగ్రెస్ లీడ్ - విజయం వైపు అడుగులు…!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి లీడ్ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు రౌండ్లు పూర్తి కాగా… ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపే మొగ్గు ఉంది. ట్రెండ్స్ ప్రకారం…. విక్టరీ దిశగా హస్తం పార్టీ అడుగులు వేస్తున్నట్లు సీన్ కనిపిస్తోంది.

Published on: Nov 14, 2025, 10:54:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్టల్ ఓట్ల నుంచి 8వ రౌండ్ వరకు కూడా ఆయనే లీడ్ లో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన రౌండ్ల ప్రకారం… కాంగ్రెస్ పార్టీకి 23 వేల ఓట్లకు పైగా లీడ్ లభించింది.

విజయం వైపు కాంగ్రెస్...!
విజయం వైపు కాంగ్రెస్...!

పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 39 ఓట్లు రాగా…. తొలి రౌండ్‌లో నవీన్‌యాదవ్‌కు 8,911 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు దక్కగా… నవీన్‌ యాదవ్‌కు 47 ఓట్ల ఆధిక్యం వచ్చింది.ఇక సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ మంచి మెజార్టీ లభించింది. ఈ రౌండ్‌లో నవీన్‌ యాదవ్‌కు 9,691 ఓట్లు, మాగంటి సునీతకు 8,609 ఓట్లు పోలయ్యాయి. మూడో, నాల్గో రౌండ్ లోనూ కాంగ్రెస్ మెజార్టీ మరింత పెరిగింది.

మొదటి రౌండ్ లో కాంగ్రెస్ 47 ఓట్ల ఆధిక్యం రాగా… రెండో రౌండ్ లో 2,947 ఓట్ల లీడ్ లభించింది. మూడో రౌండ్ లో 3,100 ఓట్ల మెజార్టీ రాగా… నాల్గొ రౌండ్ లో 3,100 ఓట్ల ఆధిక్యం లభించింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి నవీన్ యాదవ్ కి 9,147 లీడ్ దొరికింది. మరోవైపు ఐదో, 6, 7,8వ రౌండ్ లో కూడా నవీన్ యాదవ్ కే లీడ్ దక్కింది.

మరో 2 రౌండ్లు మిలిగి ఉన్నాయి. ఆయా రౌండ్లలో కూడా లీడ్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

మొత్తంగా చూస్తే ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలు సూచించినట్లు ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మెజార్టీ కూడా భారీగానే ఉండేలా కనిపిస్తోంది. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో సరికొత్త జోష్ ను నింపినట్లు అవుతోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More