Soldier: సైనికుల త్యాగాలతో లేడీ డైరెక్టర్ శ్రద్ధా ఖత్రి మూవీ- ఆకట్టుకుంటున్న సోల్జర్ ఫస్ట్ లుక్- హీరో హీరోయిన్ ఎవరంటే?

Soldier 24x7 On Duty First Look Released: కొనంకి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై లేడీ డైరెక్టర్ శ్రద్ధ ఖత్రి దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దేశభక్తి నేపథ్యంలో కొనంకి రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరనేది ఓ లుక్కేద్దాం.

Published on: Jun 27, 2026, 21:11:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Soldier 24x7 On Duty First Look Released: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దేశభక్తి, సైనిక నేపథ్యంతో వచ్చే కథలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షించే జవాన్ల గాథలు వెండితెరపై ఎల్లప్పుడూ సంచలనాలు సృష్టిస్తాయి.

సైనికుల త్యాగాలతో లేడీ డైరెక్టర్ శ్రద్ధ ఖత్రి మూవీ- ఆకట్టుకుంటున్న సోల్జర్ ఫస్ట్ లుక్- హీరో హీరోయిన్ ఎవరంటే?
సైనికుల త్యాగాలతో లేడీ డైరెక్టర్ శ్రద్ధ ఖత్రి మూవీ- ఆకట్టుకుంటున్న సోల్జర్ ఫస్ట్ లుక్- హీరో హీరోయిన్ ఎవరంటే?

సైనికుల త్యాగాలను ఆవిష్కరించి

గతంలో వచ్చిన 'మేజర్', 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు సైనికుల త్యాగాలను ఆవిష్కరించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. తాజాగా అదే బాటలో, భారత సైనికుల అసమాన ధైర్యసాహసాలను, వారి కర్తవ్య నిబద్ధతను కళ్లకు కట్టేందుకు ఒక సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ సిద్ధమవుతోంది.

కొనంకి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'సోల్జర్ - 24×7 ఆన్ డ్యూటీ' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ యూనిట్ అధికారికంగా తాజాగా విడుదల చేసింది. విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో కొనంకి కార్తీక్ రఫ్‌ అండ్ టఫ్ లుక్‌లో కనిపించి సినిమాపై అంచనాలను పెంచేశారు.

యుద్ధ వాతావరణంలో పవర్‌ఫుల్ లుక్

యుద్ధ వాతావరణం, తీవ్రమైన పోరాట ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో, బ్యాక్‌గ్రౌండ్‌లో గర్వంగా రెపరెపలాడుతున్న భారత త్రివర్ణ పతాకం దేశభక్తి భావాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. కార్తీక్ బాడీ లాంగ్వేజ్, ఒక పవర్‌ఫుల్ సైనికుడి రూపురేఖలు టాలీవుడ్‌లో సరికొత్త యాక్షన్ హీరోని పరిచయం చేయనున్నట్లు సంకేతాలిస్తున్నాయి.

ఈ సినిమాకు పెట్టిన '24×7 ఆన్ డ్యూటీ' అనే ట్యాగ్‌లైన్ కథలోని గాఢతను తెలియజేస్తోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠభరిత వాతావరణంలో, క్షణం కూడా విశ్రమించకుండా దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమించే జవాన్ల జీవనశైలిని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరిస్తున్నారు. మన దేశాన్ని కాపాడే వీరులకు ఈ సినిమా ఒక ఘన నివాళిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

యాక్షన్, మానవీయ విలువల కలయిక

ఈ చిత్రంలో కొనంకి కార్తీక్ సరసన ప్రియాంక వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను లేడీ డైరెక్టర్ శ్రద్ధా ఖత్రి తెరకెక్కిస్తున్నారు. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కాకుండా, ఒక సైనికుడి జీవితంలో ఉండే భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, మానవీయ విలువలను మిళితం చేస్తూ ఆమె ఈ కథను అద్భుతంగా రాసుకున్నారు.

"సరిహద్దుల్లో నిలబడే ప్రతి సైనికుడి వెనుక ఒక బలమైన కుటుంబ కథ ఉంటుంది. ఆ ఎమోషన్స్ ఈ సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి" అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రాన్ని కె. వి. నాయుడు కొనంకి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

బలమైన సాంకేతిక వర్గం

కథకు తగినట్లుగానే ఈ సినిమా కోసం ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను ఎంపిక చేశారు. సందీప్ బద్దుల ఈ చిత్రానికి కెమెరామెన్ (డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పోస్టర్‌లో కనిపించిన విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక రియలిస్టిక్ యుద్ధ వాతావరణాన్ని ఆయన చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

లైన్ ప్రొడ్యూసర్‌గా నవీన్ వడ్త్యావత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా తొకల వెంకట కిషోర్ వ్యవహరిస్తుండగా, సంస్థ సీఈఓ పి. జగదీష్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ బాధ్యతలను పీఆర్‌ఓ తేజస్వి సజ్జ చూసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, విడుదల తేదీ వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More