Rajamouli: జీవితంలో ఒక్కసారే తనతో మాట్లాడా, ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌తోనే సమంతతో సీన్- ఇంటర్ లవ్ స్టోరీ చెప్పిన రాజమౌళి

Rajamouli Reveals Inter Love Story Link To Samantha Scene: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన ఇంటర్మీడియట్ నాటి లవ్ గురించిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టారు. ఆ అమ్మాయితో మాట్లాడిన ఆ ఒక్క మాట ఏంటో, అప్పుడు ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ గురించి రాజమౌళి పంచుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: Jul 17, 2026, 09:34:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rajamouli Reveals Inter Love Story Link To Samantha Scene: 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి వ్యక్తిగత జీవితం గురించి ఒక క్రేజీ సీక్రెట్ బయటకు వచ్చింది. ఎప్పుడూ సినిమా ముచ్చట్లతో బిజీగా ఉండే ఈ దర్శకేంద్రుడు, తన కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయి కోసం పడిన పాట్లను గుర్తుచేసుకున్నారు.

జీవితంలో ఒక్కసారే తనతో మాట్లాడా, ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌తోనే సమంతతో సీన్- ఇంటర్ లవ్ స్టోరీ చెప్పిన రాజమౌళి
జీవితంలో ఒక్కసారే తనతో మాట్లాడా, ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌తోనే సమంతతో సీన్- ఇంటర్ లవ్ స్టోరీ చెప్పిన రాజమౌళి

రానా దగ్గుబాటి హోస్ట్‌గా

అలాగే, ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌తోనే చాలా వరకు సినిమాల్లో సీన్లుగా ఉపయోగిస్తున్నాంటూ రాజమౌళి చెప్పారు. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించిన ఓటీటీ టాక్ షో 'ది రానా దగ్గుబాటి షో' (The Rana Daggubati Show).

అమెజాన్ ప్రైమ్‌లో ది రానా దగ్గుబాటి షో ఓటీటీ స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఓటీటీ షోలో ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి తన ఇంటర్ లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

ఫ్రెండ్స్ ఏడిపించేవారు

"మా క్లాస్‌లో ఒక అమ్మాయి ఉండేది. ఇంటర్‌మీడియట్‌లో చదివేటప్పుడు హైదరాబాద్‌లో. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎప్పుడు మాట్లాడలేదు. మా క్లాస్‌లో అబ్బాయిలందరికి తెలుసు ఆ అమ్మాయంటే ఇష్టపడుతున్నాను అని. వాళ్లు దాన్ని పట్టుకుని ఏడిపించేవారు" అని రాజమౌళి తెలిపారు.

"నా జీవితం మొత్తంలో ఒక్కసారే ఆమెతో మాట్లాడాను. చాలా కష్టం మీద అడిగాను" అని రాజమౌళి అంటే.. "ఏం చెప్పారు" అని రానా దగ్గుబాటి అడిగాడు. "ట్యూషన్ ఫీస్ కట్టావా అని అడిగాను" అని రాజమౌళి చెప్పారు. దాంతో దగ్గుబాటి రానా ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. "ట్యూషన్ ఫీ అడిగారా.. భలే మనిషి.. సారీ. నేను ఊహించుకుంటున్నా మీరు ట్యూషన్ ఫీ అడగడం గురించి" అని రాజమౌళితో నవ్వుతూనే అన్నాడు రానా.

ట్యూషన్ ఫీ కట్టావా

"ఆమె ఫ్రంట్ సీట్‌లో కూర్చుంది. నేను ఇక్కడ ఉన్నా. భారతి ట్యూషన్ ఫీ కట్టావా అని నేను అడిగా. అప్పుడు తను నావైపు తిరిగి ఒక చూపు చూసింది. అది ఎలా ఉందంటే నేను ఎప్పుడు మాట్లాడుతానో అని తను ఎంతోకాలంగా ఎదురుచూసినట్లుగా ఉంది. కానీ, నాకు అప్పుడు అది అర్థం కాలేదు. అప్పుడు నాకు అది తెలియదు" అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

"నేను ట్యూషన్ ఫీ గురించి అడిగితే చూసి తన మొహంలో చాలా నిరాశ కనిపించింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అవి నా సినిమాల్లోకి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. నానిని సమంత చూసే సీన్, ఈగలో నానిని చూసినప్పుడు ఇచ్చే స్మైల్. ఆ ఇమేజెస్ అన్ని నా మైండ్‌లోకి వస్తూనే ఉంటాయి" అని రాజమౌళి వెల్లడించారు.

డైరెక్టర్స్ జీవితాల్లోని క్షణాలు

"అది కేవలం ఒక్క నిమిషం మూమెంట్ కావచ్చు. కానీ, గుర్తుండిపోతుంది. చాలా మంది డైరెక్టర్స్ తమ జీవితాల్లోని క్షణాలను సినిమాల్లోకి తీసుకొస్తుంటారు" అని అలా ఇంటర్ లవ్ స్టోరీ గురించి రాజమౌళి వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వారణాసి గురించి

ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో వారణాసి సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More