OTT Release: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు.. రష్మిక రొమాంటిక్ టు సునీల్ యాక్షన్ థ్రిల్లర్!
OTT Movies This Week: ఈ వారం ఓటీటీ ప్రియులకు సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్, జీ5, సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో ఈ వారం చూసేందుకు టాప్ 5 ఓటీటీ ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి అవేంటీ, వాటి ఓటీటీ రిలీజ్ డేట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Top 5 OTT Movies To Watch This Week: థియేటర్లతో పాటు ఓటీటీ స్క్రీన్లపై వినోదాన్ని ఆస్వాదించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా వీకెండ్ వినోదం కోసం ఓటీటీ కంటెంట్‌ను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఓటీటీ సినిమాలు
అయితే, ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో రష్మిక మందన్నా రొమాంటిక్ థ్రిల్లర్ నుంచి సునీల్ యాక్షన్ థ్రిల్లర్ వరకు సినిమాలు ఉన్నాయి. మరి టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఓటీటీ సినిమాలపై ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్‌లో రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా కాక్‌టెయిల్ 2
రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే టాలీవుడ్, బాలీవుడ్ లవర్స్ కోసం కాక్‌టెయిల్ 2 ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రేమ, ద్రోహం, మానసిక సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన ఈ హిందీ డ్రామా ఆగస్టు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో కాక్‌టెయిల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. బ్యూటిఫుల్ స్టార్ హీరోయిన్స్ రష్మిక మందన్నా, కృతి సనన్, హీరో షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమాపై యూత్‌ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయి.
సన్ నెక్ట్స్ ఓటీటీలో 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'
ఐటీ ఉద్యోగులు, గ్రామీణ నేపథ్యం కలగలిపిన కథలతో వచ్చే సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. అదే బాటలో సన్ నెక్ట్స్ (Sun NXT)లో ఓటీటీ రిలీజ్ అవుతున్న మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. వ్యవసాయం, ఐటీ ఉద్యోగం, ప్రేమ, ఫ్యామిలీ, సామాజిక అంశాలతో ఈ సినిమాను రూపొందించారు.
త్రిగుణ్ హీరోగా పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాకు మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 14 నుంచి సన్ నెక్ట్స్‌లో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
జీ5 ఓటీటీలో 'భారత భాగ్య విధాత'
చారిత్రాత్మక సంఘటనలు, మెడికల్ సర్వైవల్ నేపథ్యాన్ని జోడించి తెరకెక్కించిన హిందీ చిత్రం 'భారత భాగ్య విధాత'. ముంబై 26/11 దాడుల సమయంలో కామా ఆల్బ్‌లెస్ హాస్పిటల్‌లో వైద్య సిబ్బంది ఎదుర్కొన్న సవాళ్లు, పోరాటం, పేషంట్ల ప్రాణాలను కాపాడిన తీరుపై భారత భాగ్య విధాత సినిమాను తెరకెక్కించారు.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన భారత భాగ్య విధాత ఓటీటీలోకి ఈవారమే వచ్చేయనుంది. ఆగస్ట్ 14న జీ5 (Zee5)లో భారత భాగ్య విధాత ఓటీటీ రిలీజ్ కానుంది. సందేశాత్మక చిత్రాలు ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఆప్షన్.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ది ట్రేటర్స్ సీజన్ 2'
సినిమాలే కాకుండా మైండ్ గేమ్స్, సైకాలాజికల్ రియాలిటీ షోలను ఇష్టపడే వారి కోసం 'ది ట్రేటర్స్ సీజన్ 2' సిద్ధమైంది. తీవ్ర ఉత్కంఠను రేకెత్తించే ఈ రియాలిటీ కాంపిటీషన్ షో ఆగస్టు 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది. కరణ్ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న ఈ ఓటీటీ షోలో పోటీదారులు ఒకరినొకరు మైండ్ గేమ్‌తో ఎలా ఎదుర్కొంటారనేది ప్రధాన ఆకర్షణ.
సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 'కాటాలన్'
మలయాళ చిత్రాల్లో ఉండే డెప్త్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. అలాంటి ఒక సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కాటాలన్'. సునీల్, లోకేష్ కనగరాజ్ కీలక పాత్రల్లో ఆంటోనీ వర్గీస్ హీరోగా నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే కాటాలన్.
ఆగస్టు 13 నుంచి మనోరమా మ్యాక్స్ (ManoramaMax)లో కాటాలన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగులో కూడా ఈ ఓటీటీలో కాటాలన్ అందుబాటులో ఉండనుంది. సస్పెన్స్, యాక్షన్ ప్రియులకు ఈ మూవీ మంచి ఛాయిస్.
తెలుగులో 2 సినిమాలు
ఇలా ఈ వారం ఈ టాప్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇందులో మిస్టర్ వర్క్ ఫ్రమ్, కాటాలన్ తెలుగులో అందుబాటులో ఉండనున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


