Rashmika: నో డూప్, బాడీ డబుల్ కాదు- 20 గంటలు నీటిలోనే- రష్మిక మందన్నా సాహసం, ఒంటికి గాయాలు- ఏ హీరోయిన్ చేయని ఫైట్ సీన్!
Rashmika Mandanna Underwater Fight Scene Mysaa: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్‌లోనే అత్యంత ప్రమాదకరమైన సాహసం చేశారు. తన కొత్త సినిమా 'మైసా' కోసం ఎలాంటి డూప్ లేకుండా, భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మొదటిసారిగా ఒక మహిళా నటి నేతృత్వంలో సాగే అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు.
Rashmika Mandanna Underwater Fight Scene Mysaa: భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా ఇప్పుడు సరికొత్త రికార్డుకు సిద్ధమయ్యారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా యాక్షన్ వైపు అడుగులు వేస్తున్న రష్మిక.. తన తాజా చిత్రం 'మైసా' (Mysaa) కోసం నెక్ట్స్ లెవెల్ రేంజ్‌లో శ్రమించారు.

హై వోల్టేజ్ యాక్షన్
భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక మహిళా నటి నీటి అడుగున చేసే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను రష్మిక మందన్నా పూర్తి చేశారు. ఈ ఫైట్ సీన్ కోసం ఆమె ఎలాంటి డూప్ లేదా బాడీ డబుల్‌ను వాడకపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
నీటి అడుగున 20 గంటల పోరాటం
కాగా మెసా చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రష్మిక వెట్‌సూట్ ధరించి, డైవర్ల మధ్య నిలబడి సీన్‌కు సంబంధించిన సూచనలను వింటున్న దృశ్యాలు ఆ ఫోటోల్లో కనిపిస్తున్నాయి.
ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం రష్మిక కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 20 గంటల పాటు నీటి అడుగునే గడిపినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. మరో ఫోటోలో ఆమె వీపు భాగంలో గాయాల గుర్తులు కనిపిస్తున్నాయి.
"భారతీయ చలనచిత్ర రంగంలో ఒక మహిళా నటి నేతృత్వంలో నీటి అడుగున జరిగిన మొట్టమొదటి ఫైట్ సీక్వెన్స్ ఇది. మన ఊహలకు అందని విధంగా, నీటి లోతుల్లో జరిగే ఒక మహా యుద్ధాన్ని ప్రేక్షకులు స్క్రీన్‌పై చూడబోతున్నారు. ఆ ఉగ్రరూపాన్ని చూడటానికి సిద్ధమవ్వండి" అని దర్శకుడు రవీంద్ర పుల్లె ధీమా వ్యక్తం చేశారు.
నా జీవితంలోనే అతిపెద్ద సవాలు
ఈ యాక్షన్ షెడ్యూల్ విజయవంతంగా ముగిసిందని, త్వరలోనే మైసా సినిమా టీజర్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రమాదకరమైన ఫైట్ సీక్వెన్స్ అనుభవాన్ని రష్మిక మందన్నా సైతం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కొన్నాళ్లుగా తాను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడానికి ఈ షూటింగే కారణమని చెప్పారు.
"నేను సోషల్ మీడియాకు కాస్త దూరమయ్యానని నాకు తెలుసు. కానీ, మేమంతా ఈ ప్రాజెక్ట్ పనిలోనే బిజీగా ఉన్నాం. నా జీవితంలో నేను చేసిన అత్యంత కష్టమైన, సవాలుతో కూడిన పని ఇదొక్కటే. ఈ సీన్ కోసం మేమంతా పిచ్చిగా కష్టపడ్డాం. కానీ, ఆ కష్టమే నన్ను మరింత ఉత్సాహపరిచింది" అని రష్మిక మందన్నా రాసుకొచ్చారు.
గిరిజన నేపథ్యంలో పాన్ ఇండియా యాక్షన్
'మైసా' చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్నా కెరీర్‌లోనే లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా యాక్షన్ చిత్రంగా ఇది రానుంది.
మైసా ఫస్ట్ లుక్ పోస్టర్
గత ఏడాది జూలైలో విడుదల చేసిన మైసా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. అందులో రష్మిక ఒంటి నిండా రక్తంతో, చేతిలో ఆయుధం పట్టుకుని కోపంతో గాండ్రిస్తున్నట్లు కనిపించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


