Nivetha Thomas: హీరోయిన్ నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ ఎంట్రీ- బెంగళూరు మహానగరంలో బాలక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన హీరో
Nivetha Thomas Brother Nikhil Thomas Debut Movie: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నివేదా థామస్ సోదరుడు నిఖిల్ థామస్ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. నిఖిల్ నటిస్తున్న 'బెంగళూరు మహానగరంలో బాలక' చిత్రం ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ హీరో సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం.
Nivetha Thomas Brother Nikhil Thomas Debut Movie: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి మరో వారసుడు అడుగుపెడుతున్నారు. 'జెంటిల్‌మన్', 'నిన్ను కోరి', 'వకీల్ సాబ్' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ నివేదా థామస్. ఇప్పుడు నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ హీరోగా పరిచయమవుతున్నారు.

బెంగళూరు మహానగరంలో బాలక
నిఖిల్ థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘బెంగళూరు మహానగరంలో బాలక’. మంత్ర మూవీ మేకర్స్, ఫాల్కన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో ఇప్పుడే ఆసక్తి మొదలైంది.
ఫస్ట్ లుక్ విడుదల చేసిన హీరో ప్రియదర్శి
తాజాగా ‘బెంగళూరు మహానగరంలో బాలక’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ హీరో ప్రియదర్శి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వినూత్నమైన టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మొదటి షెడ్యూల్ పూర్తి
ఈపాటికే ‘బెంగళూరు మహానగరంలో బాలక’ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్‌తో తదుపరి షెడ్యూల్స్ కోసం సన్నాహాలు చేస్తోంది.
బెంగళూరు నేపథ్యంలో కథ!
మన తెలుగు రాష్ట్రాల నుంచి చదువు కోసమో, ఉద్యోగాల కోసమో బెంగళూరు వెళ్లే కుర్రాళ్లు అక్కడ ఎలాంటి విచిత్రమైన పరిస్థితులను, ఇబ్బందులను ఎదుర్కొన్నారనే కథాంశంతో ఈ సినిమా సాగనుంది. అవుట్ అండ్ అవుట్ వినోదభరితంగా, నేటి యువతకు కనెక్ట్ అయ్యే అంశాలతో దర్శకులు మహి, రాజశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
వరంగల్, హనుమకొండ పరిసరాల్లో షూటింగ్..
‘బెంగళూరు మహానగరంలో బాలక’ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. స్థానిక వాతావరణం సినిమా కథకు పెద్ద ప్లస్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు
ఈ చిత్రంలో నిఖిల్ థామస్‌తోపాటు టాలీవుడ్ కమెడియన్లు రఘు కారుమంచి, చిత్రం శ్రీను కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లు ధనరాజ్ వినీత్, మహేంద్ర, అచ్యుత్ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. దీనివల్ల సినిమాకు మరింత యూత్ అప్పీల్ రానుంది.
బెంగళూరు కష్టాలను
"తెలుగు కుర్రాడి బెంగళూరు కష్టాలను నవ్వుల పండగలా వెండితెరపై చూపించబోతున్నాం" అని చిత్ర దర్శకులు తెలిపారు. ఈ చిత్రానికి సి.హెచ్.వి. శర్మ, ఎమ్.ఎస్.ఎన్. మూర్తి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, మేరీ జెన్నిఫర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
బలమైన సాంకేతిక వర్గం
సాంకేతిక విభాగంలో మల్లూ నాయక్ అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా, విశ్వదీప్ స్వరాలు సమకూరుస్తున్నారు. హర్షిత్ కొటా ఎడిటర్‌గా, వీరబాబు పీఆర్వోగా పనిచేస్తున్నారు. నివేదా థామస్ క్రేజ్ ఆమె తమ్ముడికి ఏ మేరకు కలిసి వస్తుందో, ఈ 'బెంగళూరు మహానగరంలో బాలక' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


