Hushar Pittalu OTT: ఓటీటీలోకి హుషార్ పిట్టలు- సెక్స్ చేస్తూ పేరెంట్స్‌కు దొరికే టీనేజర్స్- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Hushar Pittalu OTT Streaming Details: తెలుగు రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ డ్రామా సినిమా హుషార్ పిట్టలు ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. సెక్స్ చేస్తూ తల్లిదండ్రులకు దొరికే టీనేజ్ లవర్స్ కథగా ఈ సినిమా తెరకెక్కింది. మరి హుషార్ పిట్టలు ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Hushar Pittalu OTT Release Details: యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేసే జొనర్లలో రొమాంటిక్ ఒకటి. అలాంటి రొమాంటిక్ జోనర్‌కు కాస్తా బోల్డ్, కామెడీ ఎలిమెంట్స్, ఎమోషన్స్ యాడ్ చేసి తెరకెక్కించిన సినిమానే హుషార్ పిట్టలు. యువతరం ఆలోచనలు, నేటితరం సంబంధాల్లో వచ్చే హెచ్చుతగ్గులతో ఈ సినిమాను రూపొందించారు మేకర్స్.

బిక్షు యాదవ్ దర్శకత్వం
హుషార్ పిట్టలు సినిమాలో వాసవి గణేశన్, అన్ష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌కు భిక్షు యాదవ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హుషార్ పిట్టలు చిత్రం ప్రమోషనల్ కంటెంట్, పాటలతోనే యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ముఖ్యంగా హుషార్ పిట్టలు టీజర్‌లోని బోల్డ్ సీన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ సినిమాకు చరణ్ అర్జున్ అందించగా.. సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడం విశేషం.
థియేట్రికల్ రన్, అడ్వాన్స్ బుకింగ్స్ హవా
ప్రముఖ నిర్మాణం, పంపిణీ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేసింది. పీవీఆర్, మిరాజ్ సినిమాస్‌తో పాటు ప్రముఖ సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. బుక్‌మైషో, జస్ట్‌టికెట్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో టికెట్ల బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
కేవలం యూత్‌కి పరిమితం కాకుండా, తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సందేశం ఈ కథలో ఉండటం విశేషం. అలాంటి హుషార్ పిట్టలు ఓటీటీ వివరాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. హుషార్ పిట్టలు ఓటీటీ రైట్స్ కొనుగోలుకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఈటీవీ విన్, ఆహా వంటి ప్లాట్‌ఫామ్స్ రేసులో ఉన్నాయి.
హుషార్ పిట్టలు ఓటీటీ స్ట్రీమింగ్
అయితే, ఈ పోటీని దాటి హుషార్ పిట్టలు ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో మంచి ధరకు సొంతం చేసుకున్నట్లు ఓ టాక్ నడుస్తోంది. ఈ లెక్కన అమెజాన్ ప్రైమ్‌లోనే హుషార్ పిట్టలు ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, సాధారణంగా ఏ చిన్న లేదా పెద్ద సినిమాలైనా థియేటర్లలో విడుదలైన తర్వాత 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తాయి.
కొన్ని సార్లు, నెల, 20 రోజుల్లోపే కొత్త సినిమాలు ఓటీటీ బాట పడతాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో హుషార్ పిట్టలు ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమచారాం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
హుషార్ పిట్టలు కథ ఏంటంటే:
పదో తరగతిలో రవి (అన్ష్) స్కూల్ ఫస్ట్. చదువు తప్ప మరో ధ్యాస లేని రవిని బాలు గ్యాంగ్ పోర్న్ వీడియోలు చూపించి చెడగొడుతుంది. అప్పటి నుంచి చదువు గాలికొదిలేసి అమ్మాయిలను పడేసే పనిలో ఉంటాడు రవి. ఓ రోజు చిట్టి (వాసవి గణేశన్)ని ఇష్టపడతాడు రవి. అప్పటికే రవిపై అట్రాక్షన్ ఉన్న చిట్టి కూడా ప్రేమిస్తుంది.
ఏజ్‌లో వచ్చే ఫీలింగ్స్ వల్ల ఇద్దరు శారీరకంగా దగ్గరవుతారు. అలా ఓ రోజు ఇంటిమేట్ అవుతున్న సమయంలో తల్లిదండ్రులకు దొరికిపోతారు. ఆ తర్వాత ఏమైంది? వారి తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? దానివల్ల రవి, చిట్టికి జీవితంలో వచ్చిన పరిణామాలు ఏంటీ?, సమాజం నుంచి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? రవి, చిట్టి చివరికి ఒక్కటయ్యారా? అనేదే మిగతా కథ.
ఓటీటీలో కంటే ముందుగా
బోల్డ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎమోషన్స్, సామాజిక, మెసేజ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన హుషార్ పిట్టలు ఓటీటీలోకి వచ్చేవరకు ఎదురుచూడకుండా బిగ్ స్క్రీన్‌పై థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదించాలనుకునే వారు ప్రస్తుతం థియేటర్లకు వెళ్లి చూడటం ఉత్తమం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


