OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 7 మరింత ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 5!ఎక్కడంటే?

OTT Release Movies Telugu: ఓటీటీలోకి తెలుగులో గత వారం ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గా ఉన్నా తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన 7 మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, ఆహా ఓటీటీల్లో ఉన్న ఆ సినిమాలేంటో చూద్దాం.

Published on: Aug 17, 2026, 05:02:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies Telugu: గత వారం ఏకంగా 14 సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చాయి. ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్, మనోరమ మ్యాక్స్ వంటి ఓటీటీల్లో ఈ సినిమాలు రొమాంటిక్ కామెడీ, అడ్వెంచర్, ఎమోషనల్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, హీస్ట్ క్రైమ్ వంటి జోనర్లతో రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 7 మరింత ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 5!ఎక్కడంటే?
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 7 మరింత ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 5!ఎక్కడంటే?

ఈటీవీ విన్ ఓటీటీ

ప్రేమదేశం (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఆగస్టు 13 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా)

నిజమే రుజువైనది (తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్)- ఆగస్టు 14

గమ్యం (తెలుగు ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆగస్టు 16

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

డోంట్ సే గుడ్ లక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ టీన్ రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం)- ఆగస్టు 14

టు ది మ్యాక్స్(తెలుగు డబ్బింగ్ స్పానిష్ స్పోర్ట్స్ అడ్వెంచర్ డ్రామా సినిమా)- ఆగస్టు 14

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

రీచర్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 12

ఇన్ ది గ్రే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 13

బటర్‌ఫ్లై (తెలుగు డబ్బింగ్ అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 13

వదలా (తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 14

హార్టిన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- ఆగస్టు 14 (ఆహా ఓటీటీలో కూడా)

చెఫ్ మంత్ర: ప్రాజెక్ట్ యూఎస్ఏ (తెలుగు కుకింగ్ కాంపిటీషన్ సిరీస్)- ఆహా ఓటీటీ- ఆగస్టు 13

కాటాలన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఆగస్టు 13

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు రూరల్ సోషల్ ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ డ్రామా మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- ఆగస్టు 14

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 (తెలుగు రియాలిటీ షో)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- ఆగస్టు 15

ఓటీటీలోకి తెలుగు 14 సినిమాలు

ఇలా గత వారం (ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16) తెలుగు భాషలో 14 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

7 ఇంట్రెస్టింగ్ సినిమాలు

అయితే, ఇందులో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, జగపతి బాబు, లయ నటించిన వదలా, కుకింగ్ షో చెఫ్ మంత్ర, రియాలిటీ షో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2, త్రిగుణ్ ప్రేమదేశం, కల్యాణ్ పడాల నిజమే రుజువైనది, గమ్యం వంటి 7 తెలుగు స్ర్టయిట్ సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ఇక వీటన్నింట్లో ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే 5 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం. వీటితోపాటు సునీల్, లోకేష్ కనగరాజు కలిసి యాక్ట్ చేసిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా కాస్తా ఇంట్రెస్టింగ్ మూవీగా భావించవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More