Newtons 3rd Law OTT: 2 ఓటీటీల్లోకి నిన్న రిలీజైన సుమంత్, జగపతి బాబు క్రైమ్ థ్రిల్లర్- ఇదే నెలలో స్ట్రీమింగ్- ఎక్కడంటే?
Newtons 3rd Law OTT Streaming On 2 Platforms: రెండు ఓటీటీల్లోకి తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ న్యూటన్స్ థర్డ్ లా స్ట్రీమింగ్ అవనుందని టాక్ నడుస్తోంది. సుమంత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన న్యూటన్స్ థర్డ్ లా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, రిలీజ్ డేట్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Newtons 3rd Law OTT Release On 2 Platforms: సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరో సుమంత్. ఇటీవల నేరుగా డిజిటల్ వేదికపైకి వచ్చిన 'అనగనగా' చిత్రం ఓటీటీ వీక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది.

న్యూటన్స్ థర్డ్ లా ఓటీటీ
అదే జోరుతో సుమంత్ నటించిన మరో సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'న్యూటన్స్ థర్డ్ లా' (Newton's 3rd Law) నిన్న (జూలై 31) థియేటర్లలోకి వచ్చేసింది. సుమంత్‌తోపాటు సీనియర్ హీరో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు. థియేట్రికల్ రిలీజ్‌తో పాటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు కూడా బయటకు రావడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
అసలు 'న్యూటన్స్ థర్డ్ లా' ఏంటి?
రాజేష్ కర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో సుమంత్ పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇంజినీరింగ్ విద్యార్థి వినయ్ (త్రినాథ్ వర్మ) అనుమానాస్పద స్థితిలో భవనం పైనుంచి పడి మరణించడంతో కథ మలుపు తిరుగుతుంది. ఈ కేసు విచారణ బాధ్యతను స్వీకరించిన వాసుదేవ్.. వినయ్ తల్లిదండ్రులు పార్వతి, గంగాధర్‌లను తనదైన శైలిలో విచారిస్తారు.
ఉత్కంఠ రేకెత్తించే కథనం..
వినయ్ మరణం వెనుక అతని కుటుంబం ఏదో పెద్ద రహస్యాన్నే దాస్తోందని విచారణలో పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ గుర్తిస్తారు. మరి అసలు ఆ సీక్రెట్స్ ఏంటి? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ స్టీఫెన్ మెర్క్యురీగా జగపతి బాబుకు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? 'న్యూటన్స్ థర్డ్ లా' పేరుతో రాసిన పుస్తకాన్ని చూసి డేవిడ్ (శ్రీనివాస్ అవసరాల) ఎందుకు భయాందోళనకు గురయ్యాడు? అనేదే ఈ సినిమా కథ.
సింజిత్ యర్రమిల్లి నిర్మించిన ఈ చిత్రంలో రవి వర్మ, షెల్లీ ఎన్ కుమార్, నేహా పఠాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. థ్రిల్లర్ సినిమాలను ఆస్వాదించే ఓటీటీ ప్రియులకు ఇది కచ్చితంగా మంచి ఎంపిక కానుంది. డబుల్ మర్డర్ నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ అంశాలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
2 ఓటీటీల్లో స్ట్రీమింగ్
ఇలాంటి న్యూటన్స్ థర్డ్ లా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాలు వైరల్ అవుతున్నాయి. రెండు ఓటీటీల్లో న్యూటన్స్ థర్డ్ లా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే, ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ సంస్థ 'ఈటీవీ విన్' (ETV Win) సమర్పణలో నిర్మించారు. విశేషమేమిటంటే, ఓటీటీ రిలీజ్ రైట్స్ విషయంలో కూడా ఈ చిత్రం పెద్ద డీల్ కుదుర్చుకుంది.
ఈటీవీ విన్‌తో పాటు అంతర్జాతీయ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) కూడా న్యూటన్స్ థర్డ్ లా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. రెండు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో ఒకేసారి న్యూటన్స్ థర్డ్ లా ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
న్యూటన్స్ థర్డ్ లా ఓటీటీ రిలీజ్ డేట్
సాధారణంగా థియేటర్లలో విడుదలైన చిత్రాలు 4 నుంచి 6 వారాల విరామం తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. ఆ నిబంధన ప్రకారం 'న్యూటన్స్ థర్డ్ లా' ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో డిజిటల్ వీక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆగస్ట్ 21 నుంచే ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్‌లో న్యూటన్స్ థర్డ్ లా ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అంటే, ఇదే నెలలో న్యూటన్స్ థర్డ్ లా ఓటీటీ రిలీజ్ అవనుందన్నమాట.
శాటిలైట్ రైట్స్ వివరాలు
అలాగే, న్యూటన్స్ థర్డ్ లా సినిమా శాటిలైట్ హక్కులను కూడా ఈటీవీ సొంతం చేసుకుంది. థియేటర్, ఓటీటీ రిలీజ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బుల్లితెర ప్రేక్షకులకు న్యూటన్స్ థర్డ్ లా టీవీ ప్రీమియర్ ద్వారా అందుబాటులోకి రానుంది. కానీ, మంచి సస్పెన్స్ అంశాలు ఉన్న ఈ సినిమాను థియేటర్లలో చూడటమే ఉత్తమం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


