Vadala Trailer: రొమాంటిక్‌గా జగపతి బాబు, లయ- సైకో యువతితో తలకిందులయ్యే ఫ్యామిలీ- థ్రిల్లింగ్ సీన్లతో వదలా ట్రైలర్

Jagapathi Babu Laya Vadala Trailer Released Today: టాలీవుడ్ హిట్ పెయిర్ జగపతి బాబు, లయ మళ్లీ జోడీ కట్టిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా వదలా. తాజాగా ఇవాళ వదలా ట్రైలర్ విడుదలైంది. జగపతి బాబు, లయ రొమాంటిక్ కెమిస్ట్రీ అదిరిపోగా హృతికా శ్రీనివాస్ సైకో నటనతో మరింత ఉత్కంఠతను పెంచేసింది.

Published on: Jul 9, 2026, 12:14:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jagapathi Babu Laya Vadala Trailer Released Today: వెండితెరపై కొన్నేళ్ల క్రితం ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసిన హిట్ కాంబినేషన్ మళ్లీ వస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. 'హనుమాన్ జంక్షన్', 'శివరామరాజు', 'మనోహరం', 'నాలో ఉన్న ప్రేమ'లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన జగపతి బాబు, లయ కాంబో చాలా కాలం తర్వాత మళ్లీ జోడీ కట్టారు.

రొమాంటిక్‌గా జగపతి బాబు, లయ- సైకో యువతితో తలకిందులయ్యే ఫ్యామిలీ- థ్రిల్లింగ్ సీన్లతో వదలా ట్రైలర్
రొమాంటిక్‌గా జగపతి బాబు, లయ- సైకో యువతితో తలకిందులయ్యే ఫ్యామిలీ- థ్రిల్లింగ్ సీన్లతో వదలా ట్రైలర్

వదలా ట్రైలర్ రిలీజ్

జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త సైకలాజికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'వదలా'. ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్‌తోనే మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా వదలా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇంటెన్సివ్ సీన్లతో వదలా సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది.

ఒక సైకో వల్ల తలకిందులైన హ్యాపీ ఫ్యామిలీ

జగపతి బాబు, లయ రొమాంటిక్ సీన్‌తో వదలా ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమను రొమాంటిక్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకుంటారు. అలా హ్యాపీగా సాగిపోయే కుటుంబంలోకి సైకోలాంటి అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి వల్ల ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడిందనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

భార్యా భర్తల మధ్య గొడవలు

పెళ్లై, పిల్లలు ఉన్న వ్యక్తిపై టీనేజ్ అమ్మాయి మనసు పడి అతని కోసం భార్యభర్తల (20 ఏళ్ల దాంపత్యం) మధ్య గొడవలు పెట్టడం, ఆఖరికి అతని కొడుకు, తండ్రిని చంపేందుకు ప్రయత్నించడం వంటి సీన్లతో థ్రిల్లింగ్‌గా వదలా ట్రైలర్‌ను మలిచారు.

సైకో అమ్మాయిగా

దర్శకుడు అకెళ్ల వి. కృష్ణ ఎంచుకున్న ఫ్రేమింగ్స్, విజువల్స్ ప్రేక్షకులలో ఒక తెలియని భయాన్ని, ఉత్కంఠను కలిగిస్తున్నాయి. సినిమాలో సైకో అమ్మాయిగా హృతిక శ్రీనివాస్ నటనతో ఆకట్టుకుంది. సైకో ఆలోచనలు ఉన్న వ్యక్తిగా ఆమె నటన, హావభావాలు ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వెండితెరపై మళ్లీ అదే కెమిస్ట్రీ

వదలా ట్రైలర్‌లో జగపతి బాబు, లయల కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. కొన్నేళ్ల క్రితం వెండితెరపై ఈ జంటను ఎలా చూశామో, ఇప్పుడూ అదే మ్యాజిక్ రిపీట్ కాబోతోందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఒక అన్యోన్యమైన భార్యాభర్తలుగా వీరిద్దరూ తమ పాత్రల్లో జీవించేశారు.

సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్

కార్తీక్ బి. కొడకండ్ల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు ప్రధాన బలంగా మారబోతోంది. ప్రతి సీన్ లోనూ సస్పెన్స్, మిస్టరీ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేసేలా రీ-రికార్డింగ్ కుదిరింది. "థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమాను రూపొందించాం" అని చిత్ర బృందం పేర్కొంది.

జూలై 17న సినిమా విడుదల

దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ వర్క్ ట్రైలర్‌లో రిచ్‌గా కనిపిస్తున్నాయి. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు.

అన్ని రకాల కమర్షియల్ హంగులతో రూపొందిన 'వదలా' చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More