OTT Telugu: కేవలం 11 రోజుల్లోనే షూటింగ్- రక్తపాతంలేని స్వచ్ఛమైన వినోదం- ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సిరీస్- ఎక్కడంటే?

Harichandra Katha OTT Streaming: ఓటీటీలోకి తెలుగు కామెడీ వెబ్ సిరీస్ హరిచంద్ర కథ స్ట్రీమింగ్‌కు వచ్చింది. కేవలం 11 రోజుల్లోనే తెరకెక్కిన 5 ఎపిసోడ్ల ఈ సిరీస్‌లో లవ్, స్నేహం, జాబ్ ఒత్తిడి వంటి అంశాలతో రూపొందించారు. ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ అనిపించే హరిచంద్ర కథ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 1, 2026, 09:31:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Harichandra Katha OTT Release: ఓటీటీ ప్రపంచంలో ఎటు చూసినా హత్యలు, రక్తపాతం, వైలెంట్ థ్రిల్లర్ల గోలే ఎక్కువైంది. ఇలాంటి తరుణంలో మనసుకు కాస్త హాయినిచ్చే, స్వచ్ఛమైన మిడిల్ క్లాస్ ఎమోషన్లతో కూడిన కథలు రావడం చాలా అరుదుగా మారింది.

ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సిరీస్- కేవలం 11 రోజుల్లోనే షూటింగ్- రక్తపాతంలేని స్వచ్ఛమైన వినోదం- ఎక్కడంటే?
ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సిరీస్- కేవలం 11 రోజుల్లోనే షూటింగ్- రక్తపాతంలేని స్వచ్ఛమైన వినోదం- ఎక్కడంటే?

ఓటీటీలోకి కామెడీ వెబ్ సిరీస్

సరిగ్గా ఈ లోటును భర్తీ చేసేందుకు పక్కింటి కుర్రాడి కథలా అనిపించే రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. అదే 'హరిచంద్ర కథ' (Harichandra Katha). కామెడీ, ఫ్రెండ్షిప్, లవ్ వంటి అంశాలతో సాగే హరిచంద్ర కథ ఓటీటీ ఆడియెన్స్‌కు మంచి అనుభూతి పంచేందుకు సిద్ధమైంది.

పక్కింటి కుర్రాడి జీవితం..

మొత్తం ఐదు ఎపిసోడ్లుగా రూపుదిద్దుకున్న ఈ ఓటీటీ సిరీస్, ఒక సాధారణ యువకుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రేమ, స్నేహం, కుటుంబ బాధ్యతలు, వయసుతో పాటు వచ్చే బాధ్యతలను చాలా సహజంగా తెరకెక్కించారు.

హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు

మన చుట్టూ ఉండే మనుషులే తెరపై కనిపిస్తున్నారా అనేంతలా ప్రతీ పాత్రను తీర్చిదిద్దారు. ఎక్కడా బలవంతంగా కాకుండా కథలో భాగమే వచ్ఛే కామెడీ, గుండెను తాకే భావోద్వేగాలు ఈ సిరీస్‌కు ప్రాణం పోశాయి.

కేవలం 11 రోజుల్లోనే అద్భుత దృశ్యకావ్యం!

సాధారణంగా ఒక వెబ్ సిరీస్ నిర్మాణానికి నెలల సమయం పడుతుంది. అలాంటిది పక్కా ప్రణాళిక, బలమైన కథనం ఉంటే ఎంత తక్కువ సమయంలోనైనా నాణ్యమైన అవుట్‌పుట్ ఇవ్వవచ్చని ఈ టీమ్ నిరూపించింది. ఈ వెబ్ సిరీస్ మొత్తాన్ని కేవలం 11 రోజుల వ్యవధిలోనే పూర్తి చేయడం విశేషం.

పరిశ్రమ నుంచి ప్రశంసలు

"సరైన ప్రణాళిక, ప్రతిభ కలిగిన సాంకేతిక నిపుణులు తోడైతే ఎంత తక్కువ సమయంలోనైనా అద్భుతమైన సినిమాను అందించవచ్చని ఈ టీమ్ నిరూపించింది" అని పరిశ్రమ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

రాజీపడని క్వాలిటీ

అంత తక్కువ సమయంలో చిత్రీకరించినప్పటికీ క్వాలిటీ విషయంలో చిత్ర బృందం ఎక్కడా రాజీపడలేదు. రియల్ లొకేషన్స్, వాసు అందించిన అద్భుతమైన ఛాయాగ్రహణం, నితిన్ బాల్జా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సత్య యామిని, జాహ్నవి అలరించిన పాటలు ఈ సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

బింజ్ వాచ్ చేయించే ఆకట్టుకునే స్క్రీన్ ప్లే

దర్శకుడు కార్తీక్ కృష్ణ రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మొదటి ఎపిసోడ్ నుంచి చివరి వరకు కట్టిపడేస్తుంది. ప్రతి ఎపిసోడ్ ముగింపులో వచ్చే ట్విస్ట్, తర్వాతి ఎపిసోడ్ ఏంటో చూడాలనే కుతూహలాన్ని పెంచుతుంది. అందుకే ఇది ఒకే సారి కూర్చుని చూసేసే (Binge-watch) పర్ఫెక్ట్ ఓటీటీ వెబ్ సిరీస్‌గా మారింది.

హరిచంద్ర కథ నటీనటులు

హరినాథ్ రాజ్, హేమ గోర్లే, గోపీచంద్ అల్లా ప్రధాన పాత్రల్లో పోటీపడి నటించారు. వీరికి తోడుగా అర్జున్ శ్రీనివాస్, శివప్రసాద్, ప్రవీణ్ తమ సహజ నటనతో అలరించారు. వారం అంతా పడ్డ అలసటను మరచిపోయి, కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి, మంచి అనుభూతిని పొందడానికి 'హరిచంద్ర కథ' ఒక సరైన ఎంపిక.

హరిచంద్ర కథ ఓటీటీ స్ట్రీమింగ్

తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహాలో హరిచంద్ర కథ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 31న ఆహాలో హరిచంద్ర కథ ఓటీటీ రిలీజ్ అయింది. కేవలం 11 రోజుల్లోనే తెరకెక్కిన హరిచంద్ర ఆహా ఓటీటీలో చూసేందుకు బెస్ట్ తెలుగు సిరీస్ అని చెప్పుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More