Work From Home: ప్రధాని మోదీ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు.. హీరో త్రిగుణ్ కామెంట్స్

Trigun About PM Modi At Mr Work From Home Trailer Launch: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ విలేజ్ రొమాంటిక్ డ్రామా మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. తాజాగా ఇవాళ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ విడుదల అయింది. ఈ సందర్భంగా హీరో త్రిగుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: May 14, 2026, 16:48:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trigun About PM Modi At Mr Work From Home Trailer Launch: హీరో త్రిగుణ్, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాను అరవింద్ మండెం నిర్మించారు.

ప్రధాని మోదీ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు.. హీరో త్రిగుణ్ కామెంట్స్
ప్రధాని మోదీ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు.. హీరో త్రిగుణ్ కామెంట్స్

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ రిలీజ్

సీహెచ్‌వీఎస్ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందింన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రాన్ని శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మే 15న సినిమా గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సందర్భంగా మేకర్స్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి

హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. ట్రైలర్ చెప్పినట్టుగా మార్నింగ్ షో విషయం ఏంటో తెలియదు గానీ, టాక్ బయటకు వస్తే సినిమా గురించి మీకే తెలుస్తుంది" అని అన్నాడు.

చాలా మంచి విజువల్స్

"చాలా మంచి టీమ్‌తో కలిసి నిజాయితీగా చేసిన సినిమా ఇది. తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాను. అనీష్ కురువిల్లా గారు, సుదర్శన్ గారు, వైవా హర్ష ఇలా చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాకి పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. మా కెమెరామెన్ రవి గారు సినిమాను చాలా బ్యూటిఫుల్‌గా తీశారు. చాలా మంచి విజువల్స్ ఉంటాయి" అని హీరో త్రిగుణ్ తెలిపాడు.

మంచి కలెక్షన్స్ రావాలని

"అరుణ్ ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమాను విడుదల చేస్తున్న బుచ్చి గారికి, రాందాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాతో మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను" అని త్రిగుణ్ కోరాడు.

ఐటీ జాబ్ వదిలేసిన కుర్రాడు

"మొన్ననే ప్రధాని మోదీ గారు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను" అని హీరో త్రిగుణ్ పేర్కొన్నాడు.

పాయల్ రాధాకృష్ణ కామెంట్స్

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. నేను సైన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశాను. తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More