Bigg Boss Agnipariksha 2: బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్- కల్యాణ్ పడాల, డీమాన్ పవన్‌తో లాంచ్- ఏఏ నగరాల్లో అంటే?

Bigg Boss Agnipariksha 2 Flame Tour Launch By Kalyan Padala Demon Pawan: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ సందడి మొదలైపోయింది. ఆగస్ట్ 15 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 కోసం ఫ్లేమ్ టూర్‌ను ప్రారంభించారు సీజన్ 9 విన్నర్ కల్యాణ్ పడాల, ఫైనలిస్ట్ డీమాన్ పవన్. అది ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Aug 13, 2026, 12:09:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Agnipariksha 2 Flame Tour Launch By Kalyan Padala Demon Pawan: ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ సందడి మొదలైపోయింది. సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ 10 తెలుగు ప్రారంభం కానుంది. అయితే, దీనికంటే ముందుగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చి హౌజ్‌లోకి పంపిస్తారని తెలిసిందే.

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్- కల్యాణ్ పడాల, డీమాన్ పవన్‌తో లాంచ్- ఏఏ నగరాల్లో అంటే?
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్- కల్యాణ్ పడాల, డీమాన్ పవన్‌తో లాంచ్- ఏఏ నగరాల్లో అంటే?

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్

ఇప్పుడు కూడా పదో సీజన్ కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌ను టీమ్ ఘనంగా ప్రారంభించింది. అగ్ని పరీక్ష ప్రాముఖ్యతను ప్రేక్షకులకు తెలియజేసేలా ఈ టూర్‌ను కొనసాగిస్తున్నారు.

గతేడాది అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టి, విజేతగా నిలిచిన కల్యాణ్ పడాల ఈ ఫ్లేమ్ టూర్‌ను విజయనగరంలో ఘనంగా ప్రారంభించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన క‌ల్యాణ్ ప‌డాల బిగ్‌బాస్ హౌస్‌లో త‌న క్రమ‌శిక్ష‌ణ‌, ప‌ట్టుద‌ల‌, స‌హ‌నంతో పాటు అద్భుత‌మైన ఆట‌తీరుతో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు.

కల్యాణ్ పడాలతో సెల్ఫీలు

అనంత‌రం బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 9 విజేత‌గా నిలిచి కల్యాణ్ పడాల చ‌రిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఇంతటీ క్రేజ్ తెచ్చుకున్న కల్యాణ్ పడాలను చూసేందుకు ‘అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్’లో అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. క‌ల్యాణ్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆస‌క్తి చూపించారు.

కళ్యాణ్ పడాల తన అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. త‌న బిగ్‌బాస్ ప్ర‌యాణంలో విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌లు, అభిమానులు అందించిన ప్రేమ‌, మ‌ద్ద‌తును ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌ని తెలిపారు. విజ‌య‌న‌గ‌రం నుంచి బిగ్‌బాస్ వేదిక‌ వరకు సాగిన త‌న ప్ర‌యాణం ప్రేక్ష‌కుల ప్రేమ‌, ఆద‌ర‌ణ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని క‌ల్యాణ్ ప‌డాల పేర్కొన్నారు.

విశాఖలో డీమాన్ పవన్ సందడి

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్ సంద‌ర్భంగా అభిమానుల ఉత్సాహం, కేరింత‌ల‌తో విజ‌య‌న‌గ‌రం సంద‌డిగా మారింది. కల్యాణ్ ప‌డాల ఫ్లేమ్ టూర్‌కు అభిమానుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. ఇప్పుడు ఈ టూర్ విశాఖపట్నానికి చేరుకుంది. అక్కడ బిగ్ బాస్ 9 ఫైనలిస్ట్ డీమాన్ పవన్ సందడి చేశారు.

విశాఖలో నిర్వహించిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో అభిమానులను ఉద్దేశించి డీమాన్ పవన్ ఉత్తేజకరమైన ప్రసంంగాన్ని అందించారు. అగ్ని పరీక్ష అనేది ఓ గొప్ప వేదిక అని, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలనే ఆశయాన్ని నెరవేర్చే వారధి అని డీమాన్ పవన్ అన్నారు.

డీమాన్ పవన్ అదిరిపోయే స్పీచ్

అగ్ని పరీక్ష అంటే కేవలం టాస్కులు కావని, మన జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనేలా చేసే ఓ వేదిక అని, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలనే కోరికని, మనలోని ఫైర్‌ని సజీవంగా ఉంచే వేదిక అని డీమాన్ పవన్ పేర్కొన్నారు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ ఫ్లేమ్ టూర్‌ను చేపట్టారు. ఈ టూర్‌లో కల్యాణ్ పడాల, డీమాన్ పవన్ సందడి చేశారు.

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఓటీటీ స్ట్రీమింగ్

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ మా టీవీ ఛానెల్‌తోపాటు జియో హాట్‌స్టార్‌లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More