Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి స్నో అక్క.. ఆ డైరెక్టర్ ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేశాడంటూ!
Snow Akka Mouneesha Chowdary On Bigg Boss Telugu 10: స్నో అక్కగా తెగ పాపులర్ అయిన మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ మౌనీషా చౌదరి తాజాగా బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేసింది. అలాగే, ఓ డైరెక్టర్ తనకు మెసేజ్ చేశాడన్న మౌనీషా చౌదరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.
Snow Akka Mouneesha Chowdary On Bigg Boss Telugu 10 Entry: సినిమాలో ఒక్క సీన్‌తో తెగ క్రేజ్ తెచ్చుకున్నట్లే సోషల్ మీడియాలో ఒక్క రీల్, ఒక్క డైలాగ్‌తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంటున్నారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్నర్లు, కంటెంట్ క్రియేటర్లు.

అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణే స్నో అక్క. ఒక్క డైలాగ్, ఒక్క రీల్‌తో ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ ట్రెండ్ అయింది ఈ బ్యూటి. ఇంతకీ ఈ స్నో అక్క అసలు పేరు మౌనీషా చౌదరి. ఆమె ఒక మోడల్. ఇంతకుముందు అమెరికాలో నివసించిన మౌనీషా చౌదరి 2016లో మిస్ ఆసియా ఉతాగా కిరీటం దక్కించుకుంది.
మంచుపై వీడియో
మోడలింగ్ తర్వాత కంటెంట్ క్రియేటర్‌గా మారిన మౌనీషా మంచుపై ఓ వీడియో చేసింది. అందులో ఆమె చెప్పిన డైలాగ్, ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అయ్యాయి. కాస్తా ట్రోలింగ్ కూడా జరిగింది. దాంతో మౌనీషా చౌదరి కాస్తా స్నో అక్కగా, ఉతా స్నో అక్కగా పాపులర్ అయింది.
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు ప్రమోషన్స్ చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది. మంచు విష్ణు కన్నప్ప, వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు వంటి సినిమాలతో కొలాబరేషన్స్ చేస్తూ ప్రమోట్ చేస్తోంది. అలాగే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతోంది.
బిగ్ బాస్ తెలుగు 10పై హింట్
అయితే, ఈ స్నో బ్యూటీ బిగ్ బాస్ తెలుగు 10లో పాల్గొనెందుకు అవకాశం వచ్చినట్లు హింట్ ఇచ్చింది. యాంకర్ శివతో జరిగిన ఇంటర్వ్యూలో మౌనీషా చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్, విషయాలు చెప్పుకొచ్చింది.
"రీసెంట్‌గా నువ్వు ఇండియాకి రావడానికి కారణం ఇదే.. రియాలిటీ షో.. మాటీవీలో టెలీకాస్ట్ అయ్యే ఆ షోకి వెళ్లబోతున్నారనే" అని యాంకర్ శివ ఇన్‌డైరెక్ట్‌గా అడిగాడు. దానికి "ఈ ట్రిప్ రీజన్ మాత్రం అయితే అది కాదు. జెన్యూన్‌గా అది అయితే కాదు. నెక్ట్స్ ట్రిప్ సెప్టెంబర్, అక్టోబర్‌లో వస్తున్నాను మళ్లీ. అప్పుడు అది అవుతుందో లేదో నాకు తెలియదు" అని మౌనీషా చౌదరి తెలిపింది.
బిగ్ బాస్ 10 తెలుగు స్టార్ట్ డేట్
అయితే, నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 10 తెలుగు షో సెప్టెంబర్ 6 నుంచి స్టార్ మా, జియో హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం కానుంది. మౌనీషా చెప్పిన డేట్ కూడా బిగ్ బాస్ టీవీ ప్రీమియర్‌కు మ్యాచ్ అవుతోంది. దీంతో బిగ్ బాస్ తెలుగు 10లోకి మౌనీషా వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అది అవుతుందో లేదో అని మౌనీషా చెప్పడం చూస్తే ఇంకా చర్చలు జరుగుతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు.
"మీరు యూఎస్ఏలో ఒక పాడ్‌కాస్ట్ ఇచ్చారు. అందులో తెలుగు డైరెక్టర్స్ గురించి మీరు ఒక కంటెంట్ మాట్లాడారు. ఆ ఎక్స్‌పీరియెన్స్ ఏంటీ? అసలు ఎందుకు వాళ్లు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు మళ్లీ వాళ్లు ఫోన్ చేసి సారీలు చెప్పడం లాంటివి ఏమైనా జరిగాయా?" అని యాంకర్ శివ అడిగాడు.
15, 16 ఏళ్లు ఉండొచ్చు
"సారీలు వంటివి ఏముండవు లేండి. బేసికల్లీ ఏమైందంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండే. అందరికీ కూడా ఉంటాయి కదా. అప్పుడు నేను 15 లేదా 16 ఏజ్ అనుకుంటా. ఫేస్‌బుక్‌లో ఒక డైరెక్టర్ మెసేజ్ చేశాడు. జెనరల్‌గా సినిమాలపై ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను ఎస్, నో కూడా ఫుల్‌గా చెప్పలేకపోయాను. ఆ ఏజ్‌లో ఏం తెలుస్తది చెప్పండి" అని మౌనీషా చౌదరి తెలిపింది.
"మీ కొలతలు ఏంటీ అంటూ బిలో ద బెల్ట్ (బాడీ పార్ట్స్ సైజ్‌ల గురించి అన్న అర్థంలో) మాట్లాడారు. అదే నేను షేర్ చేసుకున్నా ఆ పాడ్‌కాస్ట్‌లో. వాళ్లు అడిగింది ఏంటంటే టాలీవుడ్‌లో ఎందుకు ట్రై చేయలేదు అంటే.. చిన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి అయింది. కొంచెం భయపడ్డాను. ఇంట్లోవాళ్ల సపోర్ట్ కూడా లేదు. అందుకని నేను చేయలేదని చెప్పాను. ఇది ఎప్పుడో అయిందేలేండీ. నేను కూడా అంతగా గుర్తుపెట్టుకోలేదు" అని మౌనీషా వెల్లడించింది.
ఇండస్ట్రీ మారిపోయింది
"అలాంటి సంఘటనే మళ్లీ ఎదురైతే" అని యాంకర్ శివ ప్రశ్నించాడు. అవ్వలేదండి. అదృషవశాత్తు ఇప్పటివరకు అయితే నేను మాట్లాడినవాళ్లు అంతా చాలా గౌరవంగా మాట్లాడారు. ఇండస్ట్రీ కూడా చేంజ్ అయిందనిపించింది. అమ్మాయిలు కూడా ప్రతిదీ బయటకు చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు చాలా మందికి అవగాహన వచ్చింది. భయపడట్లేదు ఇప్పుడు" అని స్నో అక్క మౌనీషా చెప్పుకొచ్చింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


