పెళ్లి చేసుకుందామంటే మరొకరిని గర్భవతిని చేశాడు, చావు బతుకుల్లో ఉంటే సేవలు చేసి గుడ్ బై చెప్పా: ఏడ్చిన మోడల్ పమేల
Model Pamala Serena In OTT Show: ఓటీటీ రియాలిటీ షో 'లాక్ అప్ 2' గ్రాండ్ ఫినాలేకి ముందే హౌస్‌లో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. మోడల్ పమేలా సెరెనా తన 8 ఏళ్ల ప్రేమ బంధం, నిశ్చితార్థం అయ్యాక కాబోయే భర్త చేసిన ద్రోహం గురించి చెప్పి ఏడ్చేసింది. చావు బతుకుల్లో ఉంటే సేవలు చేసినట్లు తెలిపింది.
Model Pamala Serena In OTT Show: రియాలిటీ ఓటీటీ షో 'లాక్ అప్ 2' ముగింపు దశకు చేరుకుంటున్న వేళ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య డ్రామా తీవ్రస్థాయికి చేరుతోంది. ఫినాలేకి ముందు నిర్వహించిన సీక్రెట్ రివీల్ టాస్క్‌లో భాగంగా పలువురు కంటెస్టెంట్లు తమ జీవితాల్లోని చేదు జ్ఞాపకాలను బయటపెడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

జీవితంలో అనుభవించిన ద్రోహం
శ్రేయా కల్రా, రామ్ కపూర్ వంటి వారితో పాటు ప్రముఖ మోడల్ పమేలా సెరెనా తన గత జీవితంలో అనుభవించిన ద్రోహం గురించి చెప్పి తోటి కంటెస్టెంట్లను కలచివేసింది. పమేలా సెరెనా తన గత బంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందింది.
ఆసుపత్రిలో ప్రాణాపాయం..
ఐదేళ్ల క్రితం ఒక ప్రముఖ భారతీయ-బ్రిటిష్ వ్యాపారవేత్తతో తనకు 8 ఏళ్ల సుదీర్ఘ బంధం (ప్రేమ) ఉండేదని, ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం కూడా పూర్తయిందని చెప్పింది. పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో అతడు విదేశాల నుంచి తిరిగొస్తూ తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరాడు. పరీక్షల్లో కడుపులో పుండు (Abscess) పగలడంతో అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారు.
ఫోన్ కాల్‌తో బయటపడ్డ నిజం!
"ఆసుపత్రిలో ఉన్నప్పుడు అతడి ఫోన్ నా దగ్గరే ఉంది. కొద్దిరోజుల తర్వాత ఒక తెలియని అమ్మాయి నుంచి కాల్ వచ్చింది. గత రెండేళ్లుగా అతడు తనతో ప్రేమలో ఉన్నాడని, ప్రస్తుతం తాను గర్భవతినని చెప్పడంతో కంటిముందు లోకమంతా చీకటైపోయింది" అని పమేలా కన్నీళ్లు పెట్టుకుంది.
చావు బతుకుల మధ్య ఉన్నాడని సేవలు.. ఆపై గుడ్‌బై!
నిశ్చితార్థం రద్దయ్యే పరిస్థితి వచ్చినా, ఆసుపత్రి బెడ్‌పై చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తిని వదిలేసి వెళ్లలేకపోయానని పమేలా ఆవేదన వ్యక్తం చేసింది. మరో నెలన్నర పాటు అతడి దగ్గరుండి సేవలు చేసి, పూర్తిగా కోలుకున్నాకే తన లగేజ్ సర్దుకుని శాశ్వతంగా బయటకు వచ్చేసినట్లు తెలిపింది. ఈ ఘటన తన మనసును తీవ్రంగా గాయపరిచిందని, ఆ తర్వాత ఎంతమంది పరిచయమైనా ఎవరినీ పూర్తిస్థాయిలో నమ్మలేకపోతున్నానని చెప్పింది.
'లాక్ అప్ 2'లో హీటెక్కిన వాతావరణం
బ్రిటన్‌లో జన్మించిన పమేలా.. మిసెస్ యూఏఈ వరల్డ్ 2022, మిసెస్ యూనివర్స్ దుబాయ్ 2021 కిరీటాలను గెలుచుకుంది. ఆ తర్వాత దిగ్గజ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన 'దేశీ బ్లింగ్' షోతో మంచి ప్రజాదరణ పొందింది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ఇక 'లాక్ అప్ 2' విషయానికి వస్తే.. ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయి ప్రసారం అవుతోంది. ఇటీవల రీ-ఎంట్రీ ఇచ్చిన హర్షద్ చోప్రా, యోగేష్ రావత్‌లు హౌస్‌లోకి వచ్చి వాతావరణాన్ని మరింత వేడెక్కించారు. సుఫీ మోతీవాలా, ధీరజ్ ధూపర్‌లపై విజయం సాధించి వీరు తిరిగి హౌస్‌లో అడుగుపెట్టారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. పమేలా సెరెనా ఎవరు?
ఈమె ప్రముఖ మోడల్, మిసెస్ యూనివర్స్ దుబాయ్ 2021 విజేత. నెట్‌ఫ్లిక్స్ 'దేశీ బ్లింగ్' షో ద్వారా ఈమె పాపులర్ అయ్యారు.
2. 'లాక్ అప్ 2' షోను ఏ ఓటీటీలో చూడవచ్చు?
ఈ రియాలిటీ షో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమ్ అవుతోంది.
3. 'లాక్ అప్ 2' షోకు వ్యాఖ్యాతలుగా ఎవరు వ్యవహరిస్తున్నారు?
బాలీవుడ్ ప్రముఖులు ఫరా ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్ ఈ సీజన్‌కు హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


