Riteish Deshmukh: శివాజీ టీ షర్ట్ వేసుకుని మద్యం తాగి చిందులు- జేనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ క్షమాపణలు-వివాదమైన వేడుక
Riteish Deshmukh Apology For Dancing In Shivaji T Shirt: జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించిన రాజా శివాజీ సినిమా సక్సెస్ కావడంతో వేడుక చేసుకున్నారు. కానీ, శివాజీ బొమ్మ ఉన్న టీ షర్ట్ వేసుకుని రితేష్ డ్యాన్స్ చేయడంతో ఈ వివాదం వివాదమైంది. దీనిపై తాజాగా రితేష్ దేశ్‌ముఖ్ స్పందించాడు.
Riteish Deshmukh Apology For Dancing In Shivaji T Shirt: బాలీవుడ్ హీరో, హీరోయిన్ జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ పీరియాడిక్ డ్రామా 'రాజా శివాజీ' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తోంది. సినిమా సాధించిన అపూర్వ విజయాన్ని వేడుక చేసుకుంటున్న తరుణంలో, రితేష్ దేశ్‌ముఖ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది.

ప్రైవేట్ వేడుక ఇది
ఆ వీడియోలో రితేష్ దేశ్‌ముఖ్ శివాజీ మహారాజ్ బొమ్మ ఉన్న టీ షర్ట్ వేసుకుని ఉండటం, డ్యాన్స్ చేయడం, వేషధారణపై నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేయడంతో, రితేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ట్రోలర్లకు గట్టి సమాధానం చెబుతూనే, శివాజీ భక్తుడిగా తన నిజాయితీని నిరూపించుకున్నారు. సినిమా యూనిట్‌కు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రైవేట్ వేడుక ఇది అని ఆయన స్పష్టం చేశారు.
ఆ టీషర్ట్ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!
వైరల్ వీడియోలో రితేష్ దేశ్‌ముఖ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మ ఉన్న టీషర్ట్ ధరించి వేడుకల్లో పాల్గొన్నట్లు కనిపించారు. దీనిపై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేడుకల్లో అలాంటి టీషర్ట్ వేయడం శివాజీ మహారాజ్‌ను అవమానించడమేనని విమర్శించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ మనందరికీ ఆరాధ్యదైవం, ఆత్మగౌరవానికి చిహ్నం. అటువంటి మహనీయుడి బొమ్మ ఉన్న టీషర్ట్ ధరించి సంబురాలు చేసుకోవడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని రితేష్ స్పష్టం చేశారు. అది కేవలం సమయాభావం వల్ల జరిగిన పొరపాటు మాత్రమేనని ఆయన వివరించారు. శివాజీని ఆరాధించే వ్యక్తిగా తన బాధ్యతను గుర్తిస్తూనే, వినమ్రంగా వివరణ ఇచ్చారు.
ఆ ఉద్దేశం నాకు అస్సలు లేదు
"రాజా శివాజీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకుని నేరుగా ఈ వేడుకకు హాజరయ్యాను. ఆ సమయంలో టీషర్ట్ మార్చుకోవడం మర్చిపోయాను. అంతేకానీ, శివాజీ మహారాజ్‌ను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు" అని రితేష్ దేశ్‌ముఖ్ వివరించారు.
ఒకవేళ తన చర్య వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే, శివప్రేమిగా మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై తనకు ఉన్న గౌరవం, భక్తి ఎప్పటికీ అలాగే ఉంటాయని రితేష్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు.
మందు తాగారన్న ప్రచారానికి చెక్!
ఈ వీడియో ఆధారంగా సోషల్ మీడియాలో మరో తీవ్రమైన ప్రచారం జరిగింది. వేడుకల్లో రితేష్ దేశ్‌ముఖ్ మద్యం సేవించారని కొందరు ఆరోపించారు. ఈ ఆరోపణలను రితేష్ తీవ్రంగా ఖండించారు. ఇవి పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని కొట్టిపారేశారు.
ఈ వేడుకకు ఆహ్వానం లేని వ్యక్తి ఎవరో దొంగచాటుగా ఆ వీడియో తీశారని, దాని ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శివాజీ మహారాజ్‌పై తనకు ఉన్న ఎనలేని గౌరవం, నిబద్ధత ఎప్పటికీ అలాగే ఉంటాయని రితేష్ పునరుద్ఘాటించారు. "జై శివారాయ్ 🙏 మీ, రితేష్ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్" అంటూ తన వివరణను ముగించారు.
"నేను నా జీవితంలో ఇప్పటివరకు మద్యం సేవించలేదు. భవిష్యత్తులో కూడా తాగను. ఈ విషయంలో నా స్టాండ్ చాలా క్లియర్" అని రితేష్ గట్టిగా సమాధానమిచ్చారు.
బాక్సాఫీస్ వద్ద 'రాజా శివాజీ' ప్రభంజనం
వివాదాలు ఒకవైపు నడుస్తున్నా, 'రాజా శివాజీ' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ మరాఠీ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ. 117.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
మరాఠీ ఇండస్ట్రీ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన రికార్డు. కేవలం ఇండియాలోనే ఈ సినిమా రూ. 113.14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విదేశీ మార్కెట్లలో కూడా కూ. 4.27 కోట్ల కలెక్షన్లను రాబట్టి స్థిరంగా సాగుతోంది. దాదాపు 91,858 షోల ద్వారా రూ. 95.86 కోట్ల నెట్ కలెక్షన్లను ఈ సినిమా సాధించి పవర్ ఫుల్ హిట్‌గా నిలిచింది.

సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్
రితేష్ దేశ్‌ముఖ్ సరసన ఆయన భార్య జెనీలియా నటించగా, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


