Trishala Dutt: సినిమాల్లోకి రావాలనుకుని సైకియాట్రిస్ట్‌గా మారిన సంజయ్ దత్ కూతురు- అసలు కారణం చెప్పిన త్రిషాల దత్!
Sanjay Dutt Daughter Trishala Dutt Reveals Bollywood Debut: రాజా సాబ్ విలన్ సంజయ్ దత్ కుమార్తే త్రిషాల దత్ మొదట సినిమాల్లోకి రావాలనుకున్నట్లు, కాకపోతే నటిగా కాదని, తర్వాత సైకియాట్రిస్ట్‌గా మారడానికి గల అసలు కారణాలను తాజాగా చెప్పారు. దీంతో త్రిషాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Sanjay Dutt Daughter Trishala Dutt Reveals Bollywood Debut: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, ది రాజా సాబ్ విలన్ సంజయ్ దత్ గారాల పట్టి త్రిషాల దత్ తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా అమెరికాలో స్థిరపడిన త్రిషాల దత్ ఒకప్పుడు తాను కూడా సినిమాల్లోకి రావాలనుకున్నానని.. కానీ, ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణం 'నటన' కాదని సంచలన విషయాన్ని బయటపెట్టారు.

తండ్రికి దగ్గరవడానికే ఆ ఆలోచన
సంజయ్ దత్, ఆయన మొదటి భార్య రిచా శర్మ దంపతులకు 1988లో త్రిషాల జన్మించారు. అయితే ఆమె చిన్న వయసులోనే రిచా శర్మ బ్రెయిన్ ట్యూమర్‌తో కన్నుమూయడంతో, త్రిషాల తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద అమెరికాలోనే పెరిగారు. తండ్రికి దూరంగా ఉండటం త్రిషాలను మానసికంగా ఎంతో బాధించేది. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న త్రిషాల తన కెరీర్ ఆరంభంలో ఎదురైన పరిస్థితుల గురించి మాట్లాడారు.
"నేను చిన్నప్పుడు బాలీవుడ్‌లోకి వెళ్లాలని ఆలోచించాను. అయితే అది నటన మీద ఉన్న మక్కువతో కాదు.. కేవలం నా తండ్రికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాను" అని త్రిషాల దత్ పేర్కొన్నారు. తన తండ్రితో ఎక్కువ సమయం గడపడానికి సినిమా పరిశ్రమ ఒక్కటే మార్గమని ఆ వయసులో ఆమె భావించినట్లు తెలుస్తోంది.
తండ్రి ఇచ్చిన సలహా.. కెరీర్ మలుపు
ఒకవైపు బాలీవుడ్ వెండితెర ఆహ్వానిస్తున్నా, సంజయ్ దత్ మాత్రం తన కుమార్తెకు వాస్తవాలను వివరించారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు చూసిన సంజయ్.. త్రిషాల నిర్ణయాన్ని తప్పుబట్టకుండానే ఆమెలో ఉన్న అసలు ఆసక్తిని వెలికితీసే ప్రయత్నం చేశారు.
"సినిమాల్లోకి రావడం నీ ఆలోచననేనా? నీ మనసు నిజంగా అటువైపే ఉందా?" అని సంజయ్ దత్ తనను అడిగినట్లు త్రిషాల గుర్తు చేసుకున్నారు. "నువ్వు ఫలానా వ్యక్తి కూతురివి అయినంత మాత్రాన ఇక్కడ ఆఫర్లు క్యూ కడతాయని, నువ్వు స్టార్ హీరోయిన్ అయిపోతావని అనుకోవద్దు. నీకు నచ్చిన రంగం ఏంటో ఆలోచించు" అని ఆయన హితబోధ చేశారట.
మానసిక వైద్యురాలిగా కొత్త ప్రయాణం
ఈ చర్చ తర్వాతే తాను సినీ గ్లామర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు త్రిషాల దత్ వెల్లడించారు. సొంతంగా ఎదగాలనే పట్టుదలతో త్రిషాల అమెరికాలో చదువుకుని నేడు విజయవంతమైన సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యురాలు)గా రాణిస్తున్నారు. తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులే ఆమెను ఇతరుల మానసిక సమస్యలను పరిష్కరించే దిశగా నడిపించాయి.
"ప్రతి ఒక్కరికీ అంతర్గత పోరాటాలు ఉంటాయి. అందరూ అన్ని వేళలా ధైర్యంగా ఉండలేరు. ఒత్తిడిలో ఉన్నవారికి 'నేను ఉన్నాను' అని చెప్పడానికే నేను థెరపిస్ట్‌గా మారాను. బాలీవుడ్ కుటుంబం నుంచి వచ్చిన వారెవరూ మానసిక ఆరోగ్యం గురించి పెద్దగా మాట్లాడటం నేను చూడలేదు. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా జీవితం ఎప్పుడూ పూలబాటలా ఉండదు. అందరం మనుషులమే అన్న విషయాన్ని గుర్తు చేయడమే నా లక్ష్," అని త్రిషాల చెప్పిన మాటలు ఆదర్శవంతంగా ఉన్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. త్రిషాల దత్ ఎవరు?
త్రిషాల దత్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ఆయన మొదటి భార్య రిచా శర్మల కుమార్తె. ఆమె ప్రస్తుతం అమెరికాలో మానసిక వైద్యురాలిగా పనిచేస్తున్నారు.
2. త్రిషాల దత్ బాలీవుడ్‌లోకి ఎందుకు రాలేదు?
ఆమెకు నటనపై ఆసక్తి లేకపోవడం, తండ్రి సంజయ్ దత్ ఇచ్చిన సలహా మేరకు ఆమె తనకు ఇష్టమైన వైద్య వృత్తిని ఎంచుకున్నారు. కేవలం తండ్రికి దగ్గరవ్వడం కోసమే సినిమాల్లోకి రావాలని ఒకప్పుడు అనుకున్నట్లు ఆమె తెలిపారు.
3. సంజయ్ దత్ కుమార్తె ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు?
త్రిషాల చిన్నతనం నుంచే అమెరికాలో తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగారు. ప్రస్తుతం అక్కడే సైకియాట్రిస్ట్‌గా స్థిరపడ్డారు.
4. త్రిషాల తల్లి రిచా శర్మ ఎలా మరణించారు?
త్రిషాల తల్లి రిచా శర్మ 1996లో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


