Pooja Dadlani: ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే సెలబ్రిటీ మేనేజర్- 38 కోట్లతో 3 లగ్జరీ ఫ్లాట్స్ కొన్న పూజా!
Shahrukh Khan Manager Pooja Dadlani Buys Luxury Flats: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ (గుర్నాని) ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో రూ.38.21 కోట్లతో మూడు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు. కార్టర్ రోడ్‌లోని ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పనులు ఇటీవల పూర్తయ్యాయి.
Shahrukh Khan Manager Pooja Dadlani Buys Luxury Flats: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వెనుక ఉండి ఆయన అన్ని విషయాలు చూసుకునే వ్యక్తి మేనేజర్ పూజా దద్లానీ అని అందరికీ తెలిసిందే. కేవలం షారుఖ్ వృత్తిపరమైన బాధ్యతలే కాకుండా, ఆయన బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, పబ్లిక్ అప్పీరెన్స్‌లను పర్యవేక్షించే పూజా, ఇప్పుడు తన రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో వార్తల్లో నిలిచారు. ముంబైలో సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాంద్రా ఏరియాలో పూజా భారీ డీల్ కుదుర్చుకున్నారు.

బాంద్రాలో మూడు ఫ్లాట్లు.. ఆరు కార్ పార్కింగ్‌లు
ముంబైలోని కార్టర్ రోడ్‌లో ఉన్న 'వరుణ్' అనే భవనంలో పూజా దద్లానీ, ఆమె భర్త హితేష్ ప్రకాష్ గుర్నాని, తండ్రి మోహన్ సియోరామ్ దద్లానీ కలిసి ఈ మూడు అపార్ట్‌మెంట్లను కొన్నారు. ప్రస్తుతం ఈ భవనం పునరాభివృద్ధి (Redevelopment) దశలో ఉంది. 'క్రీ మ్యాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన పత్రాల ప్రకారం, ఈ మూడు ఫ్లాట్ల మొత్తం విలువ రూ.38.21 కోట్లు.
ఈ అపార్ట్‌మెంట్లు భవనంలోని పై అంతస్తుల్లో ఉండటం విశేషం. ప్రతి ఫ్లాట్ దాదాపు 1,511 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. దీనికి అదనంగా 81 చదరపు అడుగుల బాల్కనీ కూడా ఉంది. అంటే మొత్తం మూడు ఫ్లాట్లు కలిపి 4,776 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ లగ్జరీ ఫ్లాట్లతో పాటు ఆరు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఈ డీల్‌లో భాగమే.
కోట్లలో స్టాంప్ డ్యూటీ.. 2028లో పొసెషన్
ఈ భారీ లావాదేవీకి సంబంధించి ఏప్రిల్ 21, 2026న రిజిస్ట్రేషన్ పనులు ముగిశాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం పూజా కుటుంబం రూ.2.16 కోట్ల స్టాంప్ డ్యూటీని, రూ.90,000 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించింది.
ప్రస్తుతం నిర్మాణం సాగుతున్న ఈ భవనం 2028 డిసెంబర్ నాటికి వినియోగదారుల చేతికి వచ్చే అవకాశం ఉంది. ట్రైక్షా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ (శ్రీ లోటస్ డెవలపర్స్ అనుబంధ సంస్థ) నుంచి వీటిని కొనుగోలు చేశారు పూజా దద్లానీ అండ్ ఫ్యామిలీ.
సెలబ్రిటీ మేనేజర్ల జాబితాలో పూజా టాప్
భారతదేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే సెలబ్రిటీ మేనేజర్లలో పూజా దద్లానీ ఒకరు. 2023లో ఆమె ముంబైలో మరో విలాసవంతమైన ఇంటిని రీనోవేట్ చేయించుకున్నారు. ఆ ఇంటి ఇంటీరియర్ డిజైన్‌ను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం. పూజా దద్లానీ కేవలం మేనేజర్‌గానే కాకుండా ఖాన్ కుటుంబంలో ఒక సభ్యురాలిగా కలిసిపోయారు.
షారుఖ్ 'మన్నత్' అప్‌డేట్స్
మరోవైపు షారుఖ్ ఖాన్ కూడా తన నివాసం 'మన్నత్'కు సంబంధించిన అనుబంధ భవనం (Annexe) పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కాలంలో ఆయన ఖార్ ప్రాంతంలోని పాలి హిల్ ఏరియాలో రెండు లగ్జరీ డ్యూప్లెక్స్ ఇళ్లను నెలకు రూ.24 లక్షల పైచిలుకు అద్దెకు తీసుకున్నారు. దాదాపు మూడేళ్ల కాలానికి రూ.8.67 కోట్ల ఒప్పందంతో ఈ ఇళ్లను కిరాయికి తీసుకున్నట్లు సమాచారం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


