Raja Shivaji: స్టార్ హీరోలు కూడా ఈ సినిమా కోసం ఒక్క రూపాయి తీసుకోకుండా పని చేశారు.. ఆయనపై గౌరవంతోనే..: రితేష్ దేశ్‌ముఖ్
Raja Shivaji: ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'రాజా శివాజీ' చిత్రం కోసం స్టార్ నటులందరూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశారని రితేష్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈ సినిమా విశేషాలను ఆయన పంచుకున్నారు.
Raja Shivaji: మరాఠీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా రూపొందిన 'రాజా శివాజీ' సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రానికి రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించడమే కాకుండా.. ప్రధాన పాత్రలో కూడా నటించారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న రితేష్.. సినిమా నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను, నటీనటుల గొప్ప మనసు గురించి కీలక విషయాలు పంచుకున్నారు.

పూర్తి చరిత్ర పరిశీలించిన తర్వాతే..
మహారాష్ట్రలో ఇప్పటి వరకూ ఏ మరాఠీ సినిమాకు దక్కని స్థాయిలో ఈ చిత్రానికి భారీగా థియేటర్లు లభించాయని రితేష్ దేశ్‌ముఖ్ సంతోషం వ్యక్తం చేశారు. శివాజీ మహారాజ్ చరిత్ర అనేది ఒక మహా సముద్రం లాంటిదని, దాన్ని ఒక్క సినిమాలో చూపించడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
"మేము శివాజీ మహారాజ్ గురించి అందుబాటులో ఉన్న దాదాపు అన్ని పుస్తకాలను క్షుణ్ణంగా చదివాం. చరిత్ర ఎక్కడా పక్కదారి పట్టకుండా, వాస్తవాలను ఏమాత్రం రాజీ పడకుండా ప్రజలకు చూపించడమే మా బాధ్యతగా భావించాం" అని రితేష్ వివరించారు.
ఒక్కరూ రెమ్యునరేషన్ తీసుకోలేదు
ఈ సినిమా స్క్రిప్ట్ పనుల కోసం రితేష్ దాదాపు మూడున్నరేళ్ల పాటు సమయాన్ని వెచ్చించారు. కేవలం ఒక సినిమాగా కాకుండా, మహారాజ్ పట్ల ఉన్న గౌరవంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో చిత్రంలో నటించిన ప్రధాన నటీనటుల గురించి మాట్లాడుతూ రితేష్ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.
ఈ సినిమాలో నటించిన పెద్ద స్టార్లందరూ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేశారని ఆయన తెలిపారు. శివాజీ మహారాజ్ పట్ల ఉన్న అచంచలమైన భక్తి, గౌరవంతోనే వారందరూ తమ ఫీజును వదులుకున్నారని రితేష్ పేర్కొన్నారు. ఈ సినిమాలో రితేష్, జెనీలియాతోపాటు సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్ లాంటి వాళ్లు నటించారు. ఇక సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశాడు.
సల్మాన్ గురించి..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రస్తావిస్తూ.. "సల్మాన్ ఖాన్ నాకు సోదరుడి వంటివాడు. నా గత రెండు సినిమాల్లోనూ ఆయన భాగమయ్యారు. ఆయన మద్దతు ఎప్పుడూ నాకు ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.
శివాజీ మహారాజ్ గొప్పతనాన్ని నేటి తరానికి చాటి చెప్పేందుకే ఈ సినిమాను ఇంత భారీ స్థాయిలో రూపొందించినట్లు ఆయన తెలిపారు. చారిత్రక అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో చిత్ర బృందం పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుందని, అందుకే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: రాజా శివాజీ సినిమాకు దర్శకుడు ఎవరు?
జవాబు: ఈ చిత్రానికి ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించారు. ఆయనే టైటిల్ రోల్ కూడా పోషించారు.
ప్రశ్న: రాజా శివాజీ సినిమా కోసం నటీనటులు రెమ్యునరేషన్ తీసుకున్నారా?
జవాబు: లేదు, శివాజీ మహారాజ్ పట్ల గౌరవంతో ఈ చిత్రంలో నటించిన స్టార్ నటులందరూ ఉచితంగా పనిచేశారని రీతేష్ వెల్లడించారు.
ప్రశ్న: రాజా శివాజీ సినిమా స్క్రిప్ట్ రాయడానికి ఎంత సమయం పట్టింది?
జవాబు: రితేష్ దేశ్‌ముఖ్ ఈ చిత్ర కథను సిద్ధం చేయడానికి సుమారు మూడున్నరేళ్ల పాటు కష్టపడ్డారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


