Nagarjuna Akhil: వాడి గుండెల్లో బాధ ఉంది, అదో పెద్ద సమస్య, దయచేసి పోలికలు పెట్టకండి- అఖిల్‌పై తండ్రి నాగార్జున ఎమోషనల్
Nagarjuna About Akhil In Lenin Press Meet: ఏజెంట్ పరాజయం తర్వాత అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ జూలై 10న థియేటర్లలోకి రానుంది. లెనిన్ ప్రెస్ మీట్‌లో అఖిల్ కెరీర్, ఎదుర్కొన్న ఒడిదొడుకులపై తండ్రి, కింగ్ నాగార్జున చేసిన ఎమోషనల్ కామెంట్స్ టాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి.
Nagarjuna About Akhil In Lenin Press Meet: 'ఏజెంట్' లాంటి భారీ డిజాస్టర్ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని అక్కినేని వారసుడు అఖిల్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సహా నిర్మాతగా నాగార్జున
బాక్సాఫీస్ వద్ద కమ్‌బ్యాక్ ఇవ్వడానికి అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రానికి కింగ్ నాగార్జున స్వయంగా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో నాగార్జున తన కొడుకు కెరీర్ పట్ల ఇండస్ట్రీలో ఉండే అంచనాలు, పరాజయాల వల్ల అఖిల్ పడిన బాధను పంచుకుంటూ ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు.
టాలీవుడ్‌లో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున లాంటి లెజెండ్స్ వారసత్వాన్ని మోయడం అంత సులువు కాదు. అఖిల్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఈ లెగసీ ప్రెషర్ అతనిపై బాగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని నాగార్జున కూడా అంగీకరించారు.
నా కెరీర్‌తో అఖిల్‌ను పోల్చకండి
ప్రెస్ మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ అఖిల్‌పై ఉండే అంచనాల భారాన్ని గుర్తుచేసుకున్నారు. "అక్కినేని కుటుంబ వారసత్వం వల్ల అఖిల్‌పై ఎప్పుడూ ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. నేను నా కెరీర్ ప్రారంభించిన కొత్తలోనూ ఇలాంటి లెగసీ ప్రెషర్ అనుభవించాను. ఇదొక పెద్ద సమస్య. దయచేసి నా కెరీర్‌తో అఖిల్ కెరీర్‌ను పోల్చకండి, ఎవరికీ ఇలాంటి పోలికలు పెట్టడం కరెక్ట్ కాదు" అని నాగార్జున కోరారు.
అఖిల్ గుండెల్లో ఆ బాధ ఉంది
అఖిల్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో చాలా వరకు ఆశించిన విజయాలు అందుకోలేదు. కానీ, ఒక నటుడిగా అతను ప్రతి సినిమాకు తన ప్రాణం పెట్టాడని నాగార్జున చెప్పుకొచ్చారు. "అఖిల్ ఎన్నో సినిమాలు చేశాడు. అందులో చాలా వరకు ఆడలేదు. కానీ నటుడిగా వాడు వందకు వంద శాతం కష్టపడ్డాడు. ఆ పరాజయాల వల్ల వాడి గుండెల్లో ఒక రకమైన బాధ, దుఃఖం ఉన్నాయి" అని నాగార్జున తెలిపారు.
"ఆ పెయిన్ వల్లే లెనిన్ కథ వినగానే అఖిల్ దానికి అంతగా కనెక్ట్ అయ్యాడు. వాడు ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడని, ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని నాకు అప్పుడే నమ్మకం కుదిరింది. అందుకే నేను కూడా ఈ ప్రాజెక్ట్‌కు సహ నిర్మాతగా మారాను" అని నాగార్జున చెప్పుకొచ్చారు.
"లెనిన్ ఫస్ట్ కట్ చూశాను, సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ కథను ప్రేక్షకులకు చూపించడం నా బాధ్యతగా అనిపించింది" అని తండ్రిగా నాగార్జున తన నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఇక సోషల్ మీడియా వేదికగా నాగార్జున స్పందిస్తూ, ఈ సినిమాలో ప్రేక్షకులు అఖిల్‌లోని సరికొత్త కోణాన్ని చూస్తారని రాసుకొచ్చారు.
'సిసింద్రీ' నుంచి 'లెనిన్' వరకు అఖిల్ ప్రయాణం
అఖిల్ అక్కినేని సినీ ప్రయాణం చాలా విచిత్రమైన మలుపులతో సాగింది. 1995లో 'సిసింద్రీ' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైన అఖిల్, ఆ తర్వాత 2014లో అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ 'మనం'లో క్యామియో రోల్‌లో మెరిశారు. ఇక 2015లో 'అఖిల్' సినిమాతో గ్రాండ్‌గా మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఆ తర్వాత 2017లో 'హలో' చిత్రంతో రీలాంచ్ చేసినా మిశ్రమ స్పందనే దక్కింది. ఆ తర్వాత 'మిస్టర్ మజ్ను', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలు చేశారు. అయితే 2023లో వచ్చిన 'ఏజెంట్' సినిమా అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 13 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే సాధించి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
ఇప్పుడు వస్తున్న 'లెనిన్' సినిమా అఖిల్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమాలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మొదట ఈ పాత్రకు శ్రీలీలను అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల భాగ్యశ్రీ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.
అఖిల్ కమ్‌బ్యాక్ ఇస్తాడని
నాగార్జున ఇచ్చిన లెనిన్ రివ్యూతో అక్కినేని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. జూలై 10న విడుదల కాబోతున్న ఈ చిత్రంతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తాడని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


