OTT Malayalam: ఓటీటీలోకి మలయాళ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్- పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోనా? విలనా?- తెలుగులోనే స్ట్రీమింగ్!

I Nobody OTT Streaming In Telugu: వారణాసి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు జంటగా చేసిన మలయాళ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఐ నోబడీ ఓటీటీలోకి వచ్చేయనుంది. తెలుగుతోపాటు 5 భాషల్లో ఐ నోబడీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగే ఐ నోబడీ ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 12, 2026, 05:01:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

I Nobody OTT Release Telugu: మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే వైవిధ్యమైన థ్రిల్లర్లకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఐ నోబడీ' (I Nobody).

ఓటీటీలోకి మలయాళ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్- పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోనా? విలనా?- తెలుగులోనే స్ట్రీమింగ్!
ఓటీటీలోకి మలయాళ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్- పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోనా? విలనా?- తెలుగులోనే స్ట్రీమింగ్!

అన్ని రకాల ఎలిమెంట్స్

ఇప్పుడు ఐ నోబడీ ఓటీటీలోకి వచ్చేయనుంది. 'రోర్‌షాక్', 'కెట్టియోలాను ఎంతె మాలాఖ' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నిజామ్ బషీర్ ఈ చిత్రాన్ని సస్పెన్స్, ఎమోషన్స్, క్రైమ్, మిస్టరీ, డొమెస్టిక్ ఫ్యామిలీ డ్రామా, సోషియో పొలిటికల్ సెటైర్ అంశాల సమ్మేళనంగా రూపొందించారు.

ఊహించని మలుపు తిరిగిన సామాన్యుడి జీవితం

తిరువనంతపురం నేపథ్యంలో సాగే ఈ కథలో రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) అనే ప్రభుత్వ ఉద్యోగి, అతడి భార్య మీరా (పార్వతి తిరువోతు), ఇద్దరు పిల్లలతో ప్రశాంతంగా జీవిస్తుంటారు. ఒకరోజు అనుకోకుండా ఒక బ్యాంకు దోపిడీకి రాజీవన్ ప్రత్యక్ష సాక్షిగా మారతాడు. దొంగలు తప్పించుకునే క్రమంలో తమ గుర్తింపు బయటపడకూడదనే ఉద్దేశంతో రాజీవన్‌ను కిడ్నాప్ చేస్తారు.

సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రాజీవన్ అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో, ఆయన కూడా ఆ బ్యాంకు దోపిడీలో భాగస్వామేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలవుతుంది.

నిజాయితీ నిరూపించుకునేందుకు

సామాజిక మాధ్యమాల ప్రభావం, ప్రజలు ఎలాంటి ఆధారాలు లేకుండా అపోహపడటం (Mob Psychology) వంటివి ఒక సామాన్యుడి జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో ఈ చిత్రం ఎంతో ప్రతిభావంతంగా చూపించింది. తనపై పడ్డ నిందను తుడిచేసుకుని, నిజాయితీని నిరూపించుకోవడానికి రాజీవన్ చేసే పోరాటం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది.

ఆకట్టుకునే నటన.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్

గతంలో 'ఎన్ను నింటే మొయిదీన్', 'కూడే' సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పృథ్వీరాజ్, పార్వతి జంట మరోసారి తమ నటనతో మెప్పించారు. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సన్నివేశాల్లోని ఉత్కంఠను రెట్టింపు చేయగా, రమీజ్ ఎం.బి ఎడిటింగ్ కథనాన్ని ఎక్కడా నెమ్మదించకుండా వేగంగా నడిపించింది.

ద్వితీయార్థంలో వచ్చే ఊహించని ట్విస్టులు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే, ఈ సినిమాలో పృథ్వీరాజ్ హీరోనా, విలనా అనే అనుమానం కలిగేలా ఉత్కంఠతో తెరకెక్కించారు. కాగా, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, ఈ4 ఎక్స్‌పెరిమెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జూలై 9న థియేటర్లలో విడుదలైన ఐ నోబడీ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 6.2 రేటింగ్ దక్కింది.

ఐ నోబడీ ఓటీటీ స్ట్రీమింగ్

కుటుంబ ప్రేక్షకుల నుంచి యంగ్ ఆడియెన్స్ వరకు అందరినీ ఆకట్టుకున్న ఈ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఐ నోబడీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీ అయింది. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో ఆగస్ట్ 20 నుంచి ఐ నోబడీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వంటి 5 భాషల్లో ఒకేసారి జియో హాట్‌స్టార్‌లో ఐ నోబడీ ఓటీటీ రిలీజ్ చేయనున్నారు. మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే తెలుగు ఓటీటీ లవర్స్‌కు ఇది కచ్చితంగా మంచి వీకెండ్ వాచ్ అని చెప్పవచ్చు.

వారణాసిలో విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్

ఇదిలా ఉంటే, ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ క్రేజీ సినిమా వారణాసిలో విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వారణాసిలో కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More