OTT Review: ఓటీటీ రివ్యూ- మూడేళ్ల కొడుకుని క్రూరంగా చంపే తండ్రి- ట్విస్టులు, ఝలక్‌లతో తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్!

I Will Find You OTT Review In Telugu: ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ ఐ విల్ ఫైండ్ యూ. మూడేళ్ల కొడుకును చంపిన తండ్రి కథగా తెరకెక్కిన ఐ విల్ ఫైండ్ యూ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో నేటి ఐ విల్ ఫైండ్ యూ ఓటీటీ రివ్యూలో చూద్దాం.

Published on: Aug 11, 2026, 05:59:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

I Will Find You OTT Review In Telugu:

ఓటీటీ రివ్యూ- మూడేళ్ల కొడుకుని క్రూరంగా చంపే తండ్రి- ట్విస్టులు, ఝలక్‌లతో తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్!
ఓటీటీ రివ్యూ- మూడేళ్ల కొడుకుని క్రూరంగా చంపే తండ్రి- ట్విస్టులు, ఝలక్‌లతో తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్!

టైటిల్: ఐ విల్ ఫైండ్ యూ

నటీనటులు: సామ్ వర్తింగ్టన్, బ్రిట్ లోవర్, మైలో వెంటిమిగ్లియా, ఎరిన్ రిచర్డ్స్, చి మ్యాక్‌బ్రైడ్, లోగన్ బ్రోనింగ్, జొనాథన్ టకర్, మడేలిన్ స్టోవ్ తదితరులు

దర్శకత్వం: బ్రాడ్ అండెర్సన్, ఆడమ్ డేవిడ్సన్, మ్యాగీ కైలే, మజా వ్రివిలో

క్రియేటర్: రాబర్ట్ హల్

సినిమాటోగ్రఫీ: ఫ్రాజర్ బ్రౌన్, బోరిస్

సంగీతం: డానీ బెన్సీ, సౌండర్ జురియన్స్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

ఎపిసోడ్స్: 8 (ఒక్కోటి సుమారు 40 నిమిషాలు)

సూపర్ హిట్ విజువల్ వండర్ అవతార్ ఫేమ్ సామ్ వర్తింగ్టన్ హీరోగా నటించిన హాలీవుడ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ఐ విల్ ఫైండ్ యూ. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఐ విల్ ఫైండ్ యూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ట్విస్టులు, ఝలక్‌లతో సాగే ఈ సిరీస్ ఎలా ఉందో నేటి ఐ విల్ ఫైండ్ యూ ఓటీటీ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

తన మూడేళ్ల కొడుకు మ్యాథ్యూ బోరోస్ (ఆష్టన్ క్రెస్మన్) అతి క్రూరంగా చంపిన కేసులో డేవిడ్ బోరోస్ (సామ్ వర్తింగ్టన్)కు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అప్పటినుంచి కుటుంబ సభ్యులను, ఏ ఒక్కరిని కూడా డేవిడ్ కలవడు. అలాంటిది ఐదేళ్ల తర్వాత జైలులో ఉన్న డేవిడ్ దగ్గరికి ఒక ఫొటో పట్టుకుని తన భార్య షెరిల్ డ్రీసన్ (ఎరిన్ రిచర్డ్స్) చెల్లెలు రాచెల్ మిల్స్ (బ్రిట్ లోవర్) వస్తుంది.

డేవిడ్‌కు ఆ ఫొటో చూపిస్తుంది. అందులో అచ్చం డేవిడ్ కొడుకు మ్యాథ్యూలాగే ఓ పిల్లాడు కనిపిస్తాడు. అతను మ్యాథ్యూనే అని రాచేల్, డేవిడ్ నమ్ముతారు. ఆ తర్వాత జైల్లో డేవిడ్‌పై రెండుసార్లు హత్యాయత్నం జరుగుతుంది. రెండోసారి హత్యాయత్నంలో డేవిడ్ తప్పించుకుంటాడు.

ట్విస్టులు

ఆ తర్వాత ఏమైంది? నిజంగా డేవిడ్ కొడుకు బతికున్నాడా? మరి మ్యాథ్యూ బతికుంటే డేవిడ్? ఎవరిని చంపాడు డేవిడ్? నిజంగా చంపాడా డేవిడ్‌ను జైలులో చంపించేందుకు ప్రయత్నించింది ఎవరు? డేవిడ్ జైలు నుంచి బయటపడేందుకు సహాయం చేసింది ఎవరు? అసలు మ్యాథ్యూ ఎవరి కొడుకు? ఆ ఫొటోలో ఉన్నది మ్యాథ్యూనే అని ఎలా అనుకున్నారు? డేవిడ్ వైవాహిక జీవితం ఎలా ఉండేది? డేవిడ్ తండ్రి గతంలో ఏం చేశాడు? డేవిడ్‌ను పట్టుకునేందుకు వచ్చిన స్పెషల్ ఆఫీసర్స్ ఏం తెలుసుకున్నారు? చివరికీ మ్యాథ్యూని డేవిడ్ కనిపెట్టాడా? లేదా? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:

ఐ విల్ ఫైండ్ యూ ఓటీటీ సిరీస్ చాలా సింపుల్ లైన్‌ స్టోరీ. కానీ, ఎపిసోడ్ ఎపిసోడ్‌కు వచ్చే ట్విస్టులు, అసలు విలన్ ఎవరనే సస్పెన్స్‌ను చివరి వరకు మెయింటేన్ చేస్తూ మంచి గ్రిప్పింగ్ సీన్లతో కథను నడిపించారు. ప్రాణంగా ప్రేమించిన కొడుకును హత్యే చేసినందుకు తండ్రికి శిక్ష పడుతుంది. కానీ, అదే కొడుకు బతికున్నాడని తెలిస్తే.. ఆ కొడుకు ఎక్కడో ఉన్నాడో కనిపెట్టేందుకు తండ్రి చేసే పోరాటమే ఈ సిరీస్ మెయిన్ ప్లాట్.

డేవిడ్ హత్య చేశాడని శిక్ష పడటం చూపిస్తూ నేరుగా కథలోకి తీసుకెళ్లారు. ఐదేళ్లకు డేవిడ్ మరదలు రాచేల్ వచ్చి మ్యాథ్యూ ఫొటోను చూపించడంతో కథలో ఇంట్రెస్ట్ మొదలవుతుంది. ఆ తర్వాత డేవిడ్‌పై అటాక్, జైలు వార్డెనే చంపడానికి ట్రై చేయడం వంటి సీన్లతో ఉత్కంఠంగా సాగుతుంది.

మొదటి 2 ఎపిసోడ్స్‌లో రొటీన్ ఇన్వెస్టిగేషన్

డేవిడ్ తప్పించుకోవడం, స్పెషల్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ కాస్తా రెగ్యులర్ ఫార్మాట్‌లోనే సాగుతుంది. మొదటి 2 ఎపిసోడ్స్‌లో వచ్చే ఆ సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు. తనను చంపాలని చూసిన జైలర్‌ను డేవిడ్‌ పట్టుకునేందుకు వెళితే అతను చనిపోవడం ఊహించేలా ఉంటుంది. కానీ, డేవిడ్‌కు వ్యతిరేకంగా చెప్పిన సాక్షిని పట్టుకునేందుకు వెళ్లిన తర్వాత వచ్చే సీన్లు ఊహకందవు.

డేవిడ్, రాచెల్ కలిసి మ్యాథ్యూను పట్టుకునేందుకు ప్రయత్నించడం, పోలీసుల నుంచి తప్పించుకోవడం, రాచెల్‌కు తన మాజీ లవర్ హైడెన్ (మైలో వెంటిమిగ్లియా) హెల్ప్ చేయడం వంటివన్ని ఉత్కంఠత కలిగిస్తాయి. ప్రతి ఎపిసోడ్‌కు విలన్ ఎవరనే అభిప్రాయం మారుతూ వస్తుంది. ఒక్కో ఎపిసోడ్‌లో ఊహించింది తప్పు అవుతు ఝలక్‌లు తగులుతాయి.

మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్

అయితే, అందరిమీద డౌట్ వచ్చేలా స్క్రీన్ ప్లే రన్ కావడంతో క్లైమాక్స్‌లో విలన్ ఎవరనేది తెలిసాకా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. కానీ, ఇదంతా విలన్ చేయడానికి గల కారణం మాత్రం ఏమాత్రం ఊహించనివిధంగా మైండ్ బ్లాక్ చేస్తుంది. అయితే, పెద్దగా యాక్షన్ సీన్స్ ఉండవు. చివరి ఎపిసోడ్‌లో ఒక లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. అది చెబితే స్పాయిలర్ అవుతుంది.

చివరిలో ఒక్క ముద్దు సీన్ తప్పా అడల్ట్ సన్నివేశాలు, బ్యాడ్ లాంగ్వేజ్ వంటివి లేవు. ఇక ఈ ఓటీటీ సిరీస్ నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎపిసోడ్ ప్రారంభంలో దానికి సంబంధించిన హింట్స్ ఇస్తూ వచ్చే సీన్స్ మంచి స్క్రీన్ ప్లేకు అద్దం పట్టాయి. ఎడిటింగ్ ఓకే. బీజీఎమ్ చాలా బాగుంది. ప్రతి సీన్‌ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది.

ట్విస్టులు, ఝలక్‌లతో

ఫైనల్‌గా చెప్పాలంటే ట్విస్టులు, ఝలక్‌లతో ఐ విల్ ఫైండ్ యూ ఓటీటీ సిరీస్.. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఓటీటీ రిలీజ్ అయిన ఐ విల్ ఫైండ్ యూ వీకెండ్స్‌లో చూసేందుకు మంచి ఛాయిస్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More