Spider Man 4 Collection: ఇండియాలో స్పైడీ బాబు వసూళ్ల సునామీ- సల్మాన్ ఆమీర్ విజయ్ అవతార్ సినిమాల ఆల్‌టైమ్ కలెక్షన్స్ ఔట్!
Spider Man Brand New Day Box Office Collection India: మార్వెల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తోంది. కేవలం 11 రోజుల్లోనే సల్మాన్, ఆమీర్, విజయ్ దళపతి సినిమాల ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను బ్రేక్ చేశాడు స్పైడీ బాబు.
Spider Man Brand New Day Indian Box Office Collection: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీల్లో 'స్పైడర్ మ్యాన్' ఒకటి. గత వారం థియేటర్లలోకి వచ్చిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాన్ సృష్టిస్తోంది.

ఉత్తర అమెరికాలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ఓపెనింగ్స్ రికార్డును దాటేసిన స్పైడర్ మ్యాన్ 4 సినిమా భారతదేశంలోనూ ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మన దేశంలో 'పఠాన్', 'యానిమల్' వంటి సంచలన చిత్రాల స్థాయిలోనే ఈ సినిమాకు తొలి వారాంతంలో అదిరిపోయే ఓపెనింగ్స్ లభించాయి.
రూ. 400 కోట్ల దాటిన రాబడిగా హాలీవుడ్ రికార్డు
కేవలం 11 రోజుల వ్యవధిలోనే భారత బాక్సాఫీస్ వద్ద స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా రూ. 400 కోట్ల దాటి భారీ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. టామ్ హాలండ్ సోలో హీరోగా నటించిన ఈ నాలుగో స్పైడర్ మ్యాన్ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే రూ. 60 కోట్ల నెట్ కలెక్షన్‌తో అడుగుపెట్టింది.
తొలి వారాంతానికే ఏకంగా రూ. 254 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అదే జోరును రెండో వారంలోనూ కొనసాగిస్తోంది. రెండో శుక్రవారం రూ. 15 కోట్లు, శనివారం రూ. 31 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ షేక్ చేసింది. 10 రోజుల్లోనే రూ. 380 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిన ఈ మూవీ, ఆదివారం నాటికి ఏకంగా రూ. 420 కోట్ల నెట్ మార్కును దాటేసింది.
అలాగే, 11 రోజుల్లో ఇండియాలో రూ. 455 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది స్పైడర్ మ్యాన్ 4 సినిమా. గతంలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' (గ్రాస్ రూ. 445 కోట్లు), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (రూ. 403 కోట్లు) సాధించిన రికార్డులను సైతం దాటేసి, ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ.
సల్మాన్, ఆమిర్, విజయ్ రికార్డులు గాల్లోకి!
హాలీవుడ్ సినిమాల రికార్డులను దాటడమే కాకుండా, మన దేశీయ స్టార్ హీరోల రికార్డులకు కూడా స్పైడర్ మ్యాన్ 4 సవాలు విసురుతోంది. సల్మాన్ ఖాన్ ఆల్‌టైమ్ హిట్ 'బజరంగీ భాయిజాన్' (రూ. 320 కోట్లు), దళపతి విజయ్ 'లియో' (రూ. 341 కోట్లు), అమీర్ ఖాన్ 'దంగల్' (రూ. 387 కోట్లు) భారతీయ లైఫ్‌టైమ్ వసూళ్లను ఈ చిత్రం ఇప్పటికే దాటేసింది.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ 'పఠాన్' (రూ. 543 కోట్లు), రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' (రూ. 554 కోట్లు) రికార్డుల వైపు వేగంగా దూసుకెళ్తోంది. లాంగ్ రన్‌లో షారుఖ్ ఆల్‌టైమ్ హిట్ 'జవాన్' (రూ. 640 కోట్లు) రికార్డును దాటేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇండియాలో 4 వేల స్క్రీన్లలో
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,000 స్క్రీన్లలో రోజూ 13,000లకు పైగా షోలతో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నెల 26న కన్నడ రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా విడుదలయ్యే వరకు స్పైడర్ మ్యాన్ 4కి పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడం దీనికి ప్లస్ పాయింట్‌గా మారింది.
పీటర్ పార్కర్ కొత్త ప్రయాణం.. కథేంటంటే?
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో భాగంగా వచ్చిన ఈ 'బ్రాండ్ న్యూ డే' చిత్రంలో టామ్ హాలండ్ పీటర్ పార్కర్‌గా మరోసారి జీవించేశారు. జెండయా (MJ), జేకబ్ బాటలాన్ (నెడ్) కీలక పాత్రల్లో మెరిసారు.
తనను ప్రపంచమంతా మర్చిపోయిన తర్వాత, ఒంటరిగా న్యూయార్క్ నగరంలో జీవిస్తూ నేరాలపై పోరాడే స్పైడర్ మ్యాన్ కథాంశంతో దర్శకుడు డెస్టిన్ డేనియల్ క్రెటన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సడీ సింక్, మార్క్ రుఫాలో, జాన్ బెర్న్‌థాల్ నటించిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా అటు మాస్ యాక్షన్, ఇటు ఎమోషన్స్ కలబోతగా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


