Salman Khan: ఘోరంగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. 50 మందిని చితక్కొట్టే భాయ్‌కి అసలు ఏమైంది? అనారోగ్యమే కారణమా?
Salman Khan Changed Physically: ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చాలా బరువు తగ్గి, నీరసంగా కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన తాజా వీడియోలు వైరల్ కావడంతో భాయ్ ఆరోగ్య పరిస్థితిపై విస్తృత చర్చ జరుగుతోంది.
Salman Khan Changed Physically: బాలీవుడ్ ‘భాయ్‌జాన్’ సల్మాన్ ఖాన్ శారీరక రూపం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ సిక్స్‌ప్యాక్ బాడీ, కండలు తిరిగిన శరీరంతో ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సల్మాన్.. తాజాగా ముంబైలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో చాలా సన్నగా, కాస్త అలసిపోయినట్లు కనిపించడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.

స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ కార్యాలయ సందర్శన
సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై నెటిజన్లు రకరకాల అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముంబైలోని స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) కార్యాలయాన్ని సల్మాన్ ఖాన్ సందర్శించారు. అక్కడ అత్యాధునిక ఐటీ సర్వర్ రూమ్‌ను ప్రారంభించడంతో పాటు లబ్ధిదారులకు కొత్త ఇళ్ల తాళాలను అందించారు.
ఈ సామాజిక కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు బయటకు రాగానే, అందరి దృష్టి ఆయన శారీరక మార్పులపైనే పడింది. సల్మాన్ కళ్లు ఎంతో అలసిపోయినట్లు ఉన్నాయని, వయసు పైబడిన ప్రభావం స్పష్టంగా తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
50 మందిని చితక్కొట్టే భాయ్
"ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు అనిపిస్తోంది.. దేవుడు ఆయన్ని చల్లగా చూడాలి" అని ఒక అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు. "సినిమాల్లో ఒంటరిగా 50 మందిని చితక్కొట్టే భాయ్‌ని ఇలా చూడటం బాధగా ఉంది. ఆయన ముఖంలో మునుపటి గ్లో కనిపించడం లేదు. ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారా?" అని మరొకరు రాసుకొచ్చారు.
అయితే, కొందరు అభిమానులు మాత్రం సల్మాన్‌కు మద్దతుగా నిలిచారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తరహాలోనే సల్మాన్ కూడా తన వయసును దాచకుండా, కెమెరాల ముందు సహజంగా కనిపిస్తూ ధైర్యం ప్రదర్శించారని వారు ప్రశంసిస్తున్నారు. వయసుతో పాటు శారీరక మార్పులు రావడం సహజమని, దానిని భాయ్ హుందాగా అంగీకరించారని కొనియాడారు.
'మాతృభూమి'లో భారీ మార్పులు..
సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ఆయన నటిస్తున్న ‘మాతృభూమి’ చిత్రం ప్రస్తుతం భారీ మార్పులతో రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది మార్చి వరకు ఈ సినిమాకు ‘బాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉండేది. భారత్-చైనా సరిహద్దులో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమాను ప్లాన్ చేశారు.
అయితే, ఇప్పుడు కథను పూర్తిగా మార్చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చైనా, గల్వాన్ లోయ ప్రస్తావనలను పూర్తిగా తొలగించి, కొత్త సీన్లతో రీషూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఇండియన్ ఆర్మీ కల్నల్ పాత్రలో కనిపిస్తుండగా, చిత్రంగద సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అపూర్వ లఖియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
వివాదాలకు చెక్!
సెన్సార్ బోర్డు (CBFC) నుంచి అభ్యంతరాలు రావడం వల్లే ఈ మాతృభూమి సినిమా నిలిచిపోయిందంటూ వస్తున్న రూమర్లను సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ (SKF) తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని, సినిమాను ఇంకా సెన్సార్‌కే పంపలేదని ఇన్ స్టాగ్రామ్ వేదికగా నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.
టాలీవుడ్ దర్శకుడితో క్రేజీ ప్రాజెక్ట్!
తెలుగు ప్రేక్షకులకు మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. సల్మాన్ ఖాన్ తన తదుపరి భారీ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. 'SVC63' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.
2027 ఈద్ కానుకగా
సల్మాన్, నయనతార, వంశీ పైడిపల్లి కాంబో చిత్రాన్ని 2027 ఈద్ కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఇటీవల రితేష్ దేశ్‌ముఖ్ సరసన 'రాజా శివాజీ' చిత్రంలో జీవా మహాలా పాత్రలో సల్మాన్ మెరిసిన వీరయోధుడి గెటప్‌కు సల్లూ భాయ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలాంటిది ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఘోరంగా మారిపోయి కనిపించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


