Nayanthara: సల్మాన్ ఖాన్ సరసన నయనతార.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో లేడీ సూపర్ స్టార్.. కన్ఫమ్ చేసిన మేకర్స్
Nayanthara: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిమేల్ లీడ్ గా నటించబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ మంగళవారం (మార్చి 31) సోషల్ మీడియా ద్వారా అధికారికంగా అనౌన్స్ చేశారు.
Nayanthara: మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమైంది. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో ఒక భారీ ప్రాజెక్టును ప్రకటించి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచిన విషయం తెలుసు కదా. అయితే ఈ ప్రాజెక్టులోకి ఇప్పుడు నయనతార కూడా వచ్చి చేరింది. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్ ఏం మ్యాజిక్ చేయబోతోందో అన్న ఆసక్తి నెలకొంది.

సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్
ఈ భారీ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ సరసన దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార నటించనుంది. "అత్యున్నత నైపుణ్యం, వైవిధ్యానికి మారుపేరైన నయనతార.. సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి మూవీలో చేరుతున్నారు. ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు కోసం మిమ్మల్ని ఆహ్వానించడం మాకు గర్వకారణం" అని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే 'జవాన్' చిత్రంతో హిందీ ప్రేక్షకులను మెప్పించిన నయనతార.. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో జతకట్టడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
షూటింగ్ షెడ్యూల్, నిర్మాణం
సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభం కానుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కుల్దీప్ రాథోర్, రఫీ కాజీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వంశీ పైడిపల్లి మార్క్ ఎమోషన్స్, సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
గతంలో వంశీ పైడిపల్లి 'మహర్షి', 'వారసుడు' (వారిసు) వంటి చిత్రాలతో ఘనవిజయాలను అందుకున్నాడు. ఇప్పుడు నేరుగా బాలీవుడ్ మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడంతో, ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వంశీ పైడిపల్లి గురించి..
2007లో ప్రభాస్ తో మున్నా సినిమా తీసి టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు వంశీ పైడిపల్లి. ఆ తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దళపతి విజయ్ లాంటి స్టార్లతో మూవీస్ చేశాడు. అతని ఖాతాలో బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి, వారసుడులాంటి సినిమాలు ఉన్నాయి.
19 ఏళ్ల కెరీర్లో కేవలం ఆరే సినిమాలు తీసిన వంశీ.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో మూవీ చేయబోతుండటం నిజంగా విశేషమే. ప్రస్తుతం సల్మాన్.. మాతృభూమి మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది?
జవాబు: ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ 2026లో ప్రారంభం కానుంది.
ప్రశ్న: ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు?
జవాబు: సౌత్ ఇండియన్ స్టార్ నయనతార ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన కథానాయికగా నటిస్తున్నారు.
ప్రశ్న: ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తున్నారు?
జవాబు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


