Korean Kanakaraju Collection: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజుకు ఒక్కరోజే 9 కోట్ల కలెక్షన్స్- 3 రోజుల్లో ఎన్ని కోట్లు అంటే?
Korean Kanakaraju 3 Days Worldwide Box Office Collection: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కమెడియన్ సత్య కాంబినేషన్‌లో వచ్చిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఒక్కరోజులో 9 కోట్లు రాబట్టిన కొరియన్ కనకరాజు 3 రోజుల్లో ఎన్ని కోట్లు రావచ్చో చూద్దాం.
Korean Kanakaraju Worldwide Box Office Collection Day 3: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హాస్య నటుడు సత్య కాంబినేషన్‌లో వచ్చిన తాజా కామెడీ హారర్ చిత్రం 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో సందడి చేస్తోంది. హారర్, కామెడీ, లవ్ ఎలిమెంట్స్ మిళితం చేసి దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో నిలకడగా సాగుతోంది.

కొరియన్ కనకరాజు నెట్ కలెక్షన్స్
మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన కొరియన్ కనకరాజు సినిమా రెండో రోజు కూడా అదే ఊపును కొనసాగించి వారాంతంలో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో విజయవంతమైంది. ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండో రోజున రూ. 4.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
దేశవ్యాప్తంగా దాదాపు 1,741 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం రెండు రోజులకు కలిపి భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 8.35 కోట్ల నెట్ (రూ. 9.60 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. రెండో రోజు థియేటర్లలో మొత్తం 53.60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ఉదయం ఆటలకు 23.50 శాతంతో మొదలైన ఆక్యుపెన్సీ, మధ్యాహ్నానికి 52 శాతానికి, సాయంత్రానికి 56.67 శాతానికి పెరిగింది. రాత్రి షోలకు ఏకంగా 67.67 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. నైట్ షోలలో పెరిగిన ఈ రష్, వీకెండ్‌లో సినిమాకు మరింత కలిసిరానుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఈ సినిమాకు ఎక్కువ భాగం వసూళ్లు వస్తున్నాయి.
2 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్
ఓవర్సీస్ మార్కెట్‌లోనూ 'కొరియన్ కనకరాజు' మంచి స్పందన తెచ్చుకుంటోంది. విదేశాల నుంచి రెండు రోజుల్లో రూ. 3 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూ. 12 కోట్ల మార్క్‌ను అధిగమించాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లలో పెద్దగా డ్రాప్ కాకపోవడం సినిమాకు ప్లస్ పాయింట్. ఇక మూడో రోజు ఆదివారం (ఆగస్ట్ 9) కావడంతో కొరియన్ కనకరాజు సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఇండియాలో 952 షోలలో కొరియన్ కనకరాజు ప్రదర్శించారు.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్
దీంతో మూడో రోజైన ఆదివారం నాడు కొరియన్ కనకరాజు సినిమాకు రూ. 1.40 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ. 4 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో కోటి చొప్పున కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
అలాగే, వరల్డ్ వైడ్‌గా 3వ రోజున రూ. 7 నుంచి 9 కోట్ల వరకు కలెక్షన్స్ రావచ్చని అంచనా వేశారు. ఈ లెక్కన 3 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా కొరియన్ కనకరాజు సినిమా రూ. 30 కోట్ల కలెక్షన్స్ రాబట్టనుందని ట్రేడ్ పండుతులు విశ్లేషిస్తున్నారు. కాగా మేర్లపాక గాంధీ మార్క్ కామెడీ టైమింగ్, నటుడు సత్య వినోదం, రితికా నాయక్ గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


