Kalki 2: డిసెంబర్ 2027లో కల్కి 2 రిలీజ్.. అవెంజర్స్, తుంబాడ్ 2 సినిమాలతో ప్రభాస్ ఢీ! రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్

Kalki 2 Box Office Clash 2027 December: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన గ్లోబల్ హిట్ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. 2027 డిసెంబర్‌లో హాలీవుడ్ భారీ చిత్రాల మధ్య ఈ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో భారీ పోటీ నెలకొంది.

Published on: May 9, 2026, 09:07:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రానున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'కల్కి2898 ఏడీ పార్ట్ 2' (Kalki 2). మొదటి భాగం కల్కి 2898 ఏడీ సృష్టించిన సంచలనాల తర్వాత, ఇప్పుడు పార్ట్-2 కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

డిసెంబర్ 2027లో కల్కి 2 రిలీజ్.. అవెంజర్స్, తుంబాడ్ 2 సినిమాలతో ప్రభాస్ ఢీ! రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్
డిసెంబర్ 2027లో కల్కి 2 రిలీజ్.. అవెంజర్స్, తుంబాడ్ 2 సినిమాలతో ప్రభాస్ ఢీ! రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్

2027 డిసెంబర్‌లో

తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2ని 2027 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రముఖ సినీ వర్గాల నుంచి బలమైన లీకులు అందుతున్నాయి.

షూటింగ్ ఎప్పుడు?

దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సీక్వెల్ కోసం మొదటి భాగం కంటే రెట్టింపు శ్రమ పడుతున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హేమాహేమీలతో పాటు ఈసారి సాయి పల్లవి కూడా కీలక పాత్రలో మెరవనుంది. 2027 ఏప్రిల్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆ తర్వాత సుమారు ఎనిమిది నెలల పాటు కేవలం గ్రాఫిక్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనులకే కేటాయించనున్నారు. భవిష్యత్ ప్రపంచాన్ని మరింత సహజంగా చూపించేందుకు హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది.

కథ ఎలా ఉండనుంది?

మొదటి భాగం ముగిసిన చోటు నుంచే సీక్వెల్ కథ మొదలవుతుంది. సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) కు, భైరవ (ప్రభాస్) కు మధ్య జరిగే అసలైన యుద్ధం ఈ భాగంలోనే ఉండబోతోంది. పురాణ గాథలను ఆధునిక కాలానికి అన్వయిస్తూ నాగ్ అశ్విన్ రాసుకున్న స్క్రిప్ట్ మొదటి భాగం కంటే ఎంతో గ్రాండ్‌గా ఉంటుందని సమాచారం.

అయితే దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలు అభిమానులను కొంత ఆందోళనకు గురిచేసిన, కథలో మార్పులు చేర్పులు చేసి మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నట్లు వినికిడి.

బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలతో ఢీ!

అయితే, 2026 డిసెంబర్ బాక్సాఫీస్ ఇప్పటికే 'అవెంజర్స్: డూమ్స్ డే', 'డూన్: పార్ట్ 3' వంటి చిత్రాలతో నిండిపోగా, 2027 డిసెంబర్ కూడా అంతకంటే హీటెక్కేలా కనిపిస్తోంది. 'కల్కి 2' విడుదలయ్యే సమయంలోనే మార్వెల్ సినిమా 'అవెంజర్స్: సీక్రెట్ వార్స్' (Avengers: Secret Wars), 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది హంట్ ఫర్ గొల్లమ్' వంటి గ్లోబల్ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.

కల్కి 2 బాక్సాఫీస్ పోటీ

మన దేశం నుంచి సోహమ్ షా నటించిన 'తుంబాడ్ 2' కూడా అదే నెలలో రేసులో ఉంది. హాలీవుడ్ దిగ్గజ సినిమాలుతోపాటు సూపర్ క్రేజీ హారర్ థ్రిల్లర్ సీక్వెల్ తుంబాడ్ 2తో కూడా కల్కి 2 సినిమా ద్వారా ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాడు. మరి వీటి బాక్సాఫీస్ రిజల్ట్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More