Yash Ramayana Trailer: రామాయణం ట్రైలర్ రిలీజ్.. ఈవెంట్‌లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవిల నటనపై రావణుడు యశ్ కామెంట్స్
Yash On Ranbir Kapoor Sai Pallavi In Ramayana Trailer Launch: ఢిల్లీలో ఘనంగా జరిగిన రామాయణం: ప్రథమ సంకల్ప్ ట్రైలర్ లాంచ్ వేడుకకు కన్నడ స్టార్ యశ్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి నటనపై ప్రశంసలు కురిపించిన యశ్ ఈ పౌరాణిక గాథను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.
Yash On Ranbir Kapoor Sai Pallavi In Ramayana Trailer Launch: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా రూపుదిట్టుకుంటున్న 'రామాయణం: ప్రథమ సంకల్ప్' (Ramayana: Pratham Sankalp) మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక శనివారం (జూలై 18) రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది.

రామాయణ ట్రైలర్ లాంచ్‌లో యశ్, రణ్‌బీర్
ఈ వేడుకకు చిత్ర బృందం అంతా హాజరవడమే కాకుండా, కన్నడ స్టార్ హీరో యశ్ ఊహించని విధంగా స్టేజ్ పైకి రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ భారీ విజువల్ వండర్ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు అద్భుతమైన విజువల్స్, రాముడు-రావణుడి మధ్య హైప్ క్రియేట్ చేసే యాక్షన్ ఎలిమెంట్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ మెగా రామాయణ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీ, రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, సన్నీ డియోల్, అరుణ్ గోవిల్, రవి దూబే, శోభన, రకుల్ ప్రీత్ సింగ్, కునాల్ కపూర్, అజింక్య దేవ్, కుమార్ విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు.
గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై మన కథ.. రావణుడిగా యశ్ భావోద్వేగం
ఈ చిత్రంలో లంకాధిపతి రావణాసురుడి పాత్ర పోషించడమే కాకుండా, నమిత్ మల్హోత్రాతో కలిసి సహ నిర్మాతగానూ యశ్ వ్యవహరిస్తున్నారు. వేదికపై ఆయన మాట్లాడిన మాటలు ఈ ప్రాజెక్ట్ పై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేశాయి.
"ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. రావణుడి పాత్ర పోషించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత నమిత్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా వల్ల నాకు హిందీ నేర్చుకునే మంచి అవకాశం దొరికింది" అని యశ్ తెలిపారు.
"ఇది ప్రతి భారతీయుడి కలల ప్రాజెక్ట్. మన పురాణ గాథను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే ఒకే ఒక్క లక్ష్యంతో, ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా మేమంతా చేతులు కలిపాం. ప్రభు శ్రీరాముడి కథను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చూపించడమే మా సంకల్పం" అని యశ్ వ్యాఖ్యానించారు.
రణ్‌బీర్, సాయి పల్లవి నటనపై ప్రశంసల వర్షం
రాముడిగా నటించిన రణ్‌బీర్ కపూర్, సీతగా చేసిన సాయి పల్లవిల యాక్టింగ్‌ను యశ్ ఆకాశానికెత్తేశారు. రణ్‌బీర్ కపూర్ ఈ పాత్ర కోసం తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నాడని, స్క్రీన్‌పై ఆయన సృష్టించిన మ్యాజిక్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
"సాయి పల్లవి అద్భుతమైన నటి. సీత పాత్రలో ఆమె కళ్లే సగం కథ చెబుతాయి. థియేటర్లలో ఆమె పర్‌ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు ముగ్ధులవుతారు" అని యశ్ కొనియాడారు. దర్శకుడు నితీష్ తివారీ రావణుడి పాత్రలోని సూక్ష్మ నైపుణ్యాలను తనకు వివరించి, ఆ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.
శాన్ డియాగో కామిక్-కాన్‌కు ‘రామాయణం’..
ఢిల్లీలో మొదలైన రామాయణ సినిమా ప్రమోషన్లు ఇక అంతర్జాతీయ స్థాయికి చేరనున్నాయి. జూలై 23న అమెరికాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక 'శాన్ డియాగో కామిక్-కాన్' (San Diego Comic-Con) వేదికపై ఈ చిత్ర ప్రత్యేక ప్రెజెంటేషన్‌ను ప్రదర్శించనున్నారు.
టాలీవుడ్ రికార్డ్ బ్రేకింగ్ మూవీ 'కల్కి 2898 ఏడీ' తర్వాత ఈ అంతర్జాతీయ వేదికపై అడుగుపెడుతున్న రెండో భారతీయ చిత్రం రామాయణ పార్ట్ 1 కావడం విశేషం. ఈ ఈవెంట్‌లో రణ్‌బీర్ కపూర్, యశ్, నమిత్ మల్హోత్రా పాల్గొని హాలీవుడ్ వేదికపై సినిమాను ప్రమోట్ చేయనున్నారు.
రూ. 4,000 కోట్ల బడ్జెట్!
హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మర్, ఇండియన్ మ్యూజిక్ మోజార్ట్ ఏఆర్ రెహమాన్ సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తున్న రామాయణ చిత్రాన్ని ఏకంగా రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి (Diwali 2026) కానుకగా థియేటర్లలోకి రానుండగా, రెండో భాగాన్ని 2027లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


