Jana Nayagan: గుడ్ న్యూస్- దళపతి విజయ్ జన నాయగన్‌లో కొత్తగా 6 సీన్లు- డిలీట్ చేసిన వాటితో రీ కట్ వెర్షన్- అవేంటంటే?
Jana Nayagan 6 Deleted Scenes Adding: తమిళ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఎడిటింగ్‌లో తీసేసిన ఆరు ఆసక్తికర సన్నివేశాలను థియేటర్లలో కలిపి చూపించనున్నట్లుగా తాజాగా దర్శకుడు హెచ్. వినోద్ అధికారికంగా ప్రకటించారు.
Thalapathy Vijay Jana Nayagan 6 Deleted Scenes Adding: తమిళనాడు రాజకీయాల్లో బిజీ అవుతూ నటుడిగా దళపతి విజయ్ చేసిన చివరి చిత్రం 'జన నాయగన్' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రాజకీయ నాయకుడిగా అడుగుపెట్టిన విజయ్ తమిళనాడు సీఎంగా పదవి చేపట్టిన తర్వాత జన నాయకుడు సినిమా థియేటర్లలో విడుదల అయి విషయం తెలిసిందే. పలు అడ్డంకులు, వాయిదాల తర్వాత జులై 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.

అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
ఈ నేపథ్యంలో జన నాయగన్ చిత్ర బృందం అభిమానులకు ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. థియేటర్లలో నడుస్తున్న సినిమాకు అదనంగా మరో ఆరు తొలగించిన సన్నివేశాలను (Deleted Scenes) జోడించబోతున్నట్లు మేకర్స్ తాజాగా తెలిపారు. చెన్నైలో నిర్వహించిన 'జన నాయగన్' సక్సెస్ మీట్‌లో దర్శకుడు హెచ్. వినోద్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ఫ్యాన్స్ కోసం థియేటర్లలో స్పెషల్ కట్!
"సినిమా నిడివి కారణంగా ఎడిటింగ్ సమయంలో ఆరు కీలక సన్నివేశాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. అందులో విజయ్ సర్ మార్కు కనిపించే రెండు ఫన్నీ సీన్లు, రెండు పవర్ ఫుల్ యాక్షన్ ఘట్టాలు, మరొక రెండు ఎమోషనల్ సీన్లు ఉన్నాయి. వచ్చే వారం నుంచి ఈ కొత్త సన్నివేశాలను థియేటర్లలో ప్లే చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని వినోద్ వివరించారు.
'భగవంత్ కేసరి' రీమేక్‌గా భారీ వసూళ్లు
ప్రొడక్షన్ హౌస్ అనుమతి రాగానే ఈ సరికొత్త వర్షన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తెలుగులో నందమూరి బాలకృష్ణ, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చి ఘన విజయం సాధించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి ఇది అధికారిక తమిళ రీమేక్.
జన నాయగన్ నటీనటులు, కలెక్షన్స్
ఇందులో సీఎం విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా చేయగా మమితా బైజు కీలక పాత్ర పోషించింది. అలాగే, విలన్‌గా బాబీ డియోల్ ఆకట్టుకున్నారు. నాజర్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి వంటి భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.
అనిరుధ్ భావోద్వేగ నోట్
KVN ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
అపరితమైన నమ్మకానికి
"జన నాయకుడు, లియో, బీస్ట్, మాస్టర్, కత్తి.. ఇలా విజయ్ సార్‌తో సాగిన ప్రయాణం ఎప్పటికీ మరచిపోలేనిది. నాపై ఉంచిన అపరిమితమైన నమ్మకానికి, అందించిన మధుర జ్ఞాపకాలకు ధన్యవాదాలు. ఈ సంగీతం ఎప్పటికీ నిలిచే ఉంటుంది" అని అనిరుధ్ పేర్కొన్నారు.
దళపతి విజయ్‌తో అనిరుధ్ ఫొటో
దళపతి విజయ్‌తో కలిసి ఉన్న ఒక అరుదైన ఫొటోను కూడా అనిరుధ్ రవిచందర్ నెట్టింట పంచుకోవడంతో అభిమానులు దానికి విపరీతంగా లైకులు కొడుతున్నారు. మొత్తానికి మరో అదనపు 6 సీన్లతో విజయ్ అభిమానులకు మంచి గిఫ్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'జన నాయగన్' సినిమాకు అదనంగా ఎన్ని సీన్లు జోడిస్తున్నారు?
ఎడిటింగ్‌లో తీసేసిన ఆరు సీన్లను (2 కామెడీ, 2 యాక్షన్, 2 ఎమోషనల్) వచ్చే వారం నుంచి థియేటర్లలో జోడించనున్నారు.
2. 'జన నాయగన్' చిత్రం ఏ తెలుగు సినిమాకు రీమేక్?
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన హిట్ చిత్రం 'భగవంత్ కేసరి'కి ఇది తమిళ రీమేక్.
3. ఈ సినిమాకు దర్శకత్వం, సంగీతం అందించింది ఎవరు?
హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
4. 'జన నాయగన్' చిత్రంలో నటీనటులు ఎవరు?
విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


