Rohit Sharma TV Show: టీవీ షోతో రోహిత్ శర్మ ఎంట్రీ- సోనీ లివ్ ఓటీటీ భారీ లైనప్- సమంత వంటల పోగ్రామ్, అజయ్ క్రైమ్ సిరీస్!
Rohit Sharma Debut With TV Show: భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ టీవీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ దసరా, దివాళి పండగ సీజన్ కోసం రోహిత్ శర్మ టాక్ షోతోపాటు సమంత వంటల పోగ్రామ్, అజేయ్ దేవ్‌గన్ క్రైమ్ పెట్రోల్ సిరీస్ సహా పలు భారీ ప్రాజెక్టులను ప్రకటించింది.
Rohit Sharma Debut With TV Show On Sony Liv OTT: క్రికెట్ మైదానంలో తన అద్భుతమైన సిక్సర్లు, కెప్టెన్సీతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. పొట్టి ఫార్మాట్ టీ20లు, సుదీర్ఘ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అనంతరం ఆయన సరికొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుడుతున్నారు.

రోహిత్ శర్మ టీవీ షో టీజర్
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) త్వరలో తీసుకురానున్న ఓ ప్రత్యేక వినోదాత్మక టీవీ షో ద్వారా రోహిత్ శర్మ బుల్లితెరపైకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రోహిత్ శర్మ టీవీ షోకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
"గార్డెన్‌లో తిరగొద్దు".. నవ్వులు పూయిస్తున్న ప్రోమో!
నిమిషానికి పైగా ఉన్న ఈ వీడియోలో అభిమానులు రోహిత్‌ను చుట్టుముట్టి, మైదానంలో ఆయన వైరల్ చేసిన ఐకానిక్ డైలాగ్ "కోయీ భీ గార్డెన్ మే నహీ ఘూమేగా" (ఎవరూ గార్డెన్‌లో తిరగకూడదు) అని మళ్లీ చెప్పాలని కోరుతారు. ప్రతీ అభిమాని అదే మాట అడుగుతుండటంతో విసుగు చెందిన హిట్ మ్యాన్ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతున్నట్లు సరదాగా చిత్రీకరించారు.
సోనీ నెట్‌వర్క్ భారీ లైనప్
ఈ టాక్ షో ఎలా ఉండబోతోందో త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే, పండగ సీజన్‌ను పురస్కరించుకుని సోనీ నెట్‌వర్క్ హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ భారీ ఎంటర్‌టైన్‌మెంట్ లైనప్‌ను సిద్ధం చేసింది.
అజయ్ దేవ్‌గన్ క్రైమ్ పెట్రోల్ 2026..
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హోస్ట్‌గా 'క్రైమ్ పెట్రోల్ 2026' సరికొత్త రీతిలో ముందుకు రానుంది. నిజ జీవితంలో జరిగిన సంచలనాత్మక నేరాల నేపథ్యంతో ఈ సిరీస్ రూపుదిద్దుకుంది. మరోవైపు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 18 ఓటీటీ, టీవీ వేదికగా ప్రారంభమైంది.
స్కామ్ 2010 ఓటీటీ రిలీజ్
హన్సల్ మెహతా దర్శకత్వంలో భారీ ఆర్థిక కుంభకోణం ఆధారంగా వస్తున్న 'స్కామ్ 2010' వెబ్ సిరీస్ కూడా సోనీ లివ్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. "భారతీయ ప్రేక్షకులు భాషలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన వినోదాన్ని కోరుకుంటున్నారు. అందుకే అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా బుల్లితెర, ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ కోసం భారీ షోలను అందిస్తున్నాం" అని సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ఎండీ, సీఈఓ గౌరవ్ బెనర్జీ తెలిపారు.
సమంత మాస్టర్ చెఫ్!
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సైతం సోనీ లివ్ అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి తెస్తోంది. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు వ్యాఖ్యాతగా 'మాస్టర్ చెఫ్ తమిళ' రాబోతుండగా, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ నేతృత్వంలో 'తమిళ ఐడల్' సింగింగ్ షో ప్రారంభం కానుంది.
సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ హోస్ట్‌గా
మరాఠీ కేబీసీ 'కోన్ హోనార్ కరోడ్‌పతి'కి సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
బుల్లితెరపై ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో?
మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే రోహిత్ శర్మ, బుల్లితెరపై ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


