AR Rahman Son Accident: ఏఆర్ రెహమాన్ కుమారుడికి యాక్సిడెంట్- బలంగా ఢీకొట్టిన కారు- ఏఆర్ అమీన్ పరిస్థితి ఎలా ఉందంటే?
AR Rahman Son AR Ameen Accident: చెన్నైలోని కత్తిపారా ఫ్లైఓవర్ సమీపంలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ ప్రయాణిస్తున్న పోర్షే కారు ప్రమాదానికి గురైంది. ఇంకో కారు బలంగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. దీంతో అమీన్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఆర్ అమీన్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.
AR Rahman Son AR Ameen Accident: భారతీయ సంగీత దిగ్గజం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇంట్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏఆర్ రెహమాన్ కుమారుడు, యువ గాయకుడు ఏఆర్ అమీన్ చెన్నైలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణపాయం లేకుండా బయటపడ్డారు. ఆదివారం (ఆగస్ట్ 9) సాయంత్రం గువాండీలోని అత్యంత రద్దీగా ఉండే కత్తిపారా ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వేగంగా వచ్చి ఢీకొన్న కారు.. అసలేం జరిగింది?
కోయంబేడు నుంచి నగరం వైపు తన స్నేహితుడితో కలిసి ఖరీదైన పోర్షే కారులో అమీన్ ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో సైడ్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి ఆకస్మికంగా వచ్చిన వేగనర్ కారు.. అమీన్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి రెండు వాహనాలు భారీగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ముగ్గురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన అమీన్‌ను, ఆయన స్నేహితుడిని వెంటనే కావేరి ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు వారిని డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి చేరుకున్నారు. మరోవైపు వేగనర్ కారులో ఉన్న వ్యక్తికి కూడా గాయాలుకాగా, అతనిని కలైజ్ఞార్ శతాబ్ది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.
సొంత గుర్తింపు కోసం అమీన్ అడుగులు
రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే, తండ్రి ఏఆర్ రెహమాన్ భారతదేశంలోనే గొప్ప కంపోజర్‌గా పేరుగాంచినప్పటికీ, అమీన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓకే బంగారం సినిమాలో తొలిసారిగా
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓ కాదల్ కణ్మణి' (తెలుగులో ఓకే బంగారం) చిత్రంలో 'మౌలా సల్లి వసల్లిమ్' పాటతో ఏఆర్ అమీన్ గళం విప్పారు. ఆ తర్వాత అంతర్జాతీయంగా రెహమాన్ నిర్వహించే మ్యూజిక్ కచేరీల్లోనూ పాడుతూ అలరిస్తున్నారు.
చికిరి చికిరి తమిళ వెర్షన్ పాడిన అమీన్
ఇటీవల రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'లోని 'చికిరి చికిరి' తమిళ వెర్షన్‌కు అమీన్ స్వరం అందించారు. అలాగే జస్లీన్ రాయల్‌తో కలిసి ఆయన పాడిన 'భీగి భీగి' అనే ఇండిపెండెంట్ ఆల్బమ్ యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందింది. ఈ ప్రైవేట్ పాటలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించడం విశేషం.
బిజీ బిజీగా రెహమాన్ ప్రాజెక్టులు
మరోవైపు ఏఆర్ రెహమాన్ చేతినిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. భారతీయ చిత్రసీమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణ' (పార్ట్ 1, పార్ట్ 2) చిత్రాలకు ఆయనే సంగీతం అందిస్తున్నారు.
ధనుష్, మారి కాంబినేషన్ మూవీ కూడా
వీటితో పాటు 'బట్వారా 1947', 'మూన్ వాక్' వంటి పిరియాడిక్ డ్రామాలకు పనిచేస్తున్నారు ఏఆర్ రెహమాన్. కోలీవుడ్‌లో స్టార్ హీరో ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న కొత్త చిత్రానికి కూడా రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


