Ram Charan Upasana: రామ్ చరణ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పిన ఉపాసన కొణిదెల- అందరికి తెలిసిన వంటకమే- ఆ ఐడియాతోనే బిజినెస్!

Upasana About Ram Charan Favourite Food: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తిండి అలవాట్లకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఆయన సతిమణి ఉపాసన వెల్లడించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా సరే రామ్ చరణ్‌కి మన ఊరి ఇంటి వంట పడాల్సిందేనని చెప్పిన ఉపాసన.. భర్త చెర్రీకి అత్యంత ఇష్టమైన ఫుడ్ ఏంటో వెల్లడించారు.

Published on: Jul 31, 2026, 13:13:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Upasana About Ram Charan Favourite Food: ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విలాసవంతమైన హోటల్లో బస చేసినా, ఎలాంటి నోరూరించే విదేశీ వంటకాలు ఎదురుగా ఉన్నా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కి మాత్రం మన సౌత్ ఇండియన్ భోజనం పడాల్సిందేనట.

రామ్ చరణ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పిన ఉపాసన కొణిదెల- అందరికి తెలిసిన వంటకమే- ఆ ఐడియాతోనే బిజినెస్!
రామ్ చరణ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పిన ఉపాసన కొణిదెల- అందరికి తెలిసిన వంటకమే- ఆ ఐడియాతోనే బిజినెస్!

రామ్ చరణ్ ఆహారపు అలవాట్లు

'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, తన తిండి అలవాట్లలో మాత్రం ఇప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారని ఆయన సతిమణి ఉపాసన కొణిదెల స్పష్టం చేశారు. 'కర్లీ టేల్స్' టాక్ షోలో పాల్గొన్న ఉపాసన తన భర్త రామ్ చరణ్ ఆహారపు అలవాట్లకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.

వేడివేడి రసం అన్నం.. ఉల్లిపాయల ఆమ్లెట్!

విదేశీ పర్యటనల్లో ఎంతటి ఘనమైన విందు ఆరగించినా తర్వాత కూడా రామ్ చరణ్ కచ్చితంగా భారతీయ ఆహారాన్ని వెతుక్కుంటారని ఉపాసన కొణిదెల తెలిపారు.

"ఎంత పెద్ద డిన్నర్ చేసినా సరే.. కాసేపయ్యాక నాకిప్పుడు ఇండియన్ ఫుడ్ కావాలని చరణ్ అడుగుతారు" అని ఉపాసన కొణిదెల పేర్కొన్నారు.

రామ్ చరణ్‌కి అత్యంత ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్ వేడివేడి రసం అన్నం, దాని కాంబినేషన్‌గా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసిన ఆమ్లెట్ అని ఉపాసన వెల్లడించారు. రసంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, ఆమ్లెట్ ద్వారా ప్రోటీన్ లభిస్తుందని ఆమె వివరించారు. తండ్రి మెగాస్టార్ చిరంజీవి లాగే చరణ్‌కి కూడా సాంప్రదాయ వంటకాలంటే ప్రాణమని చెప్పారు.

అర్ధరాత్రి ఆకలి.. 'అత్తమ్మాస్ కిచెన్' పుట్టుక!

షూటింగ్స్ లేదా వెకేషన్స్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో కూడా రామ్ చరణ్‌కి అకస్మాత్తుగా సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలనిపిస్తుందని ఉపాసన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో నగరాల్లో తిరుగుతూ మన ఫుడ్ కోసం వెతికేవారమని, ఆ ఇబ్బందిని అధిగమించడానికే ఇంట్లో తయారుచేసిన ఇన్‌స్టంట్ డ్రై మిక్స్ పౌడర్లను తమ వెంట తీసుకెళ్లడం ప్రారంభించానని తెలిపారు.

ఈ చిన్న ఆలోచనే 2024లో 'అత్తమ్మాస్ కిచెన్' అనే పెద్ద వ్యాపార ఆలోచనగా మారింది. అత్తగారైన సురేఖ కొణిదెల చేతివంటల స్ఫూర్తితో ఈ బ్రాండ్‌ను ప్రారంభించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అవుట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆయన భార్య సురేఖ తయారుచేసి ఇచ్చిన ఈ రెడీ-టు-కుక్ మిక్స్‌లనే తీసుకెళ్లేవారని ఉపాసన గుర్తుచేసుకున్నారు.

ఉపాసన కామెంట్స్ వైరల్

గతేడాది కర్లీ టేల్స్‌లో పాల్గొన్న ఉపాసన కొణిదెల ఈ విషయాలను తెలిపారు. అయితే, అప్పటి వీడియోలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రామ్ చరణ్ ఫేవరెట్ ఫుడ్, అత్తమ్మాస్ కిచెన్ వచ్చిన ఐడియా ఇప్పుడు కూడా వైరల్ అవుతోంది.

పెద్దితో రామ్ చరణ్ విజయం

ఇదిలా ఉంటే, ఇటీవలే రామ్ చరణ్ పెద్ది సినిమాతో పాన్ ఇండియా ఆడియెన్స్ ముందుకు వచ్చారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలాగే, నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 9 నుంచి పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే, ఇప్పటివరకు ఓటీటీలో తెలుగు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో పెద్ది స్ట్రీమింగ్ అయ్యేది. ఇప్పుడు తాజాగా జూలై 30న నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ డబ్బింగ్‌తో పెద్ది ఓటీటీ రిలీజ్ అయింది. అంటే, ఇక నుంచి నార్త్ ఆడియెన్స్‌ను కూడా పెద్ది ఓటీటీలో అలరించేందుకు రెడీ అయింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More