T20 World Cup Closing Ceremony: వావ్ అనాల్సిందే.. అదిరిపోయిన టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీ.. గ్లోబల్ స్టార్ స్పెషల్

T20 World Cup Closing Ceremony: టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీ అదిరింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కు ముందు నరేంద్ర మోదీ స్టేడియంలో ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. గ్లోబల్ స్టార్ రికీ మార్టిన్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. 

Published on: Mar 8, 2026, 18:25:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెల రోజులుగా క్రికెట్ లవర్స్ కు అల్లిమేట్ ఎంటర్ టైన్మెంట్ అందించిన టీ20 ప్రపంచకప్ ఎండింగ్ కు వచ్చేసింది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించారు.

టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీ (AP)
టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీ (AP)

టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీ

టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని ఐసీసీ గ్రాండ్ గా నిర్వహించింది. టోర్నీ ముగింపు వేడుకలకు ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చింది. మరోవైపు ఇండియన్ సెలబ్రిటీల ప్రదర్శనలు హైలైట్ గా నిలిచాయి. ఇంటర్నేషనల్ స్టార్ రికీ మార్టిన్ షో తెగ వైరల్ గా మారింది. కలర్ ఫుల్ లైట్స్, బాణాసంచా వెలుగులతో స్టేడియం మెరిసిపోయింది.

దాండియా క్వీన్

టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీ దాండియా క్వీన్ గా పేరు తెచ్చుకున్న ఫాల్గుణి పాఠక్ పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ అయింది. 50 మంది డ్యాన్సర్లతో కలిసి ఆమె ప్రదర్శన కొనసాగింది. ఫాల్గుణి పాటలకు డ్యాన్సర్ల స్టెప్పులు స్టేడియాన్ని ఊపేశాయి. గుజరాతీ పాపులర్ దాండియా సాంగ్స్ తో ఆమె మైమరిపించింది.

సుఖ్బీర్ సింగ్

పంజాబీ సింగర్ సుఖ్బీర్ సింగ్ ఈ ఈవెంట్ కు మరింత జోష్ తెచ్చాడు. తనదైన స్టైల్లో పంజాబీ సాంగ్స్ తో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. అతని పాటలకు కూడా పెద్ద ఎత్తున డ్యాన్సర్లు డ్యాన్స్ చేశారు. పంజాబీ సాంగ్స్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉన్న ఆడియన్స్ పెదవి కలిపారు.

రాక్ స్టార్

చివరగా ఇంటర్నేషనల్ రాక్ స్టార్ రికీ మార్టిన్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్ గా నిలిచింది. రెండు సార్లు గ్రామీ అవార్డు సొంతం చేసుకున్న మార్టిన్ తన సాంగ్స్ తో గ్రౌండ్ లో ఫైర్ సెట్ చేశాడు. ప్రతి ఆడియన్ ను ఊగిపోయేలా చేశాడు. టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని మరింత సందడిగా మార్చాడు. ‘చికి బామ్ బామ్’ అంటూ తన సాంగ్స్ తో అదరగొట్టాడు. అయితే ఫస్ట్ టెలికాస్ట్ లో అతని వాయిస్ క్లియర్ గా రాలేదు.

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తలపడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన ఇండియాపై భారీ అంచనాలున్నాయి. సొంతగడ్డపై ఆడుతున్న భారత్ ఈ ఫైనల్లో గెలిచి, వరుసగా రెండో సారి పొట్టి కప్ దక్కించుకోవాలని కోట్లాది ఇండియన్స్ ఆశిస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైనా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఒక లక్షా 20 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని తెలిసింది. సంజు శాంసన్, బుమ్రా పై భారీ అంచనాలున్నాయి. ఈ ఇద్దరు ఫామ్ కొనసాగించాల్సిన అవసరం ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More