T20 World Cup Final: కాసేపట్లో టీ20 ప్రపంచకప్ ఫైనల్-ఆ ప్లేయర్లను టీమ్ నుంచి తప్పించాలన్న గవాస్కర్-సంచలన మార్పులుంటాయా?

T20 World Cup Final: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ కు టైమ్ ఆసన్నమవుతోంది. మరికొన్ని గంటల్లోనే ఈ మెగా పోరు స్టార్ట్ కానుంది. టైటిల్ కోసం న్యూజిలాండ్ తో ఇండియా తలపడుతోంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇండియా టీమ్ నుంచి ఇద్దరు ప్లేయర్లను తప్పించాలని దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. 

Published on: Mar 8, 2026, 16:42:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు మరికొన్ని గంటలే ఉంది. ఈ రోజు (మార్చి 8) రాత్రి 7 గంటలకు ఈ టైటిల్ పోరు స్టార్ట్ అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఈ మెగా ఫైట్ జరుగుతోంది. ఈ ఫైనల్ నేపథ్యంలో ఇండియా ఫైనల్ ఎలెవన్ పై దిగ్గజం సునీల్ గవాస్కర్ సంచలన కామెంట్లు చేశాడు.

టీ20 ప్రపంచకప్ ఫైనల్ (PTI)
టీ20 ప్రపంచకప్ ఫైనల్ (PTI)

అభిషేక్ పై వేటు

న్యూజిలాండ్ తో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ ను పక్కన పెట్టాలని సునీల్ గవాస్కర్ అన్నాడు. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఫైనల్ లో అభిషేక్ శర్మ ను జట్టు నుంచి తొలగించాలని గవాస్కర్ గట్టిగా సూచించాడు. గత తప్పిదాల నుంచి అతను ఇంకా నేర్చుకోలేదని, ఒకే విధంగా ఔట్ అవుతూనే ఉన్నాడని గవాస్కర్ ఫైర్ అయ్యాడు.

మూడు సార్లు డకౌట్

ఈ టీ20 ప్రపంచకప్ టోర్నీలో 25 ఏళ్ల అభిషేక్ శర్మ 12.71 సగటుతో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. సూపర్ 8 లో జింబాబ్వేపై అర్ధ శతకం సాధించకపోతే అతని గణాంకాలు మరింత దారుణంగా ఉండేవి. ఈ టోర్నీలో అతను మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్ లో స్పిన్నర్లకు నాలుగు సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్ లో కేవలం 9 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు.

బ్యాటింగ్ లో మార్పు లేదు

‘‘ఇది చాలా కఠినమైన కాల్. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ నంబర్ వన్ బ్యాటర్. కానీ అతను తన తప్పుల నుంచి నేర్చుకోవడం లేదు. ఒకే విధంగా ఔట్ అవుతున్నాడు. స్పిన్నర్లు అతణ్ని ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. అభిషేక్ ను ఫైనల్ మ్యాచ్ నుంచి తప్పించాలి’’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు.

ఇషాన్ కిషన్ ఓపెనర్

‘‘సంజు శాంసన్ తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయాలి. రింకు సింగ్ తిరిగి జట్టులోకి రావాలి. రింకుకు ఛాన్స్ ఇవ్వాలి."అని గవాస్కర్ తెలిపాడు. మరోవైపు రన్స్ భారీగా ఇచ్చేస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా ఫైనల్ మ్యాచ్ కు టీమ్ నుంచి తప్పించాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. వరుణ్ ప్లేస్ లో కుల్ దీప్ ను ఆడించాలని సన్నీ పేర్కొన్నాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More