Upasana Konidela Peddi Review: ఉపాసన కొణిదెల మాస్ యాంగిల్- థియేటర్‌లో అరుపులు, ఈలలు- భర్త పెద్ది మూవీపై వన్ వర్డ్ రివ్యూ
Upasana Konidela Peddi Review: రామ్ చరణ్ పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాగా జూన్ 3న వేసిన ప్రీమియర్ షోలో చెర్రీ సతీమణి ఉపాసన కొణిదెల సందడి చేశారు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూస్తూ, ఆమె పేపర్లు చల్లుతూ మాస్‌గా ఎంజాయ్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Upasana Konidela Peddi Review: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం 'పెద్ది' మేనియా నడుస్తోంది. 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూన్వీ కపూర్ జంటగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లలోకి వచ్చేసింది.

చీర్ లీడర్‌గా ఉపాసన
అయితే, ఒక రోజు ముందుగానే అంటే జూన్ 3న రాత్రి నిర్వహించిన పెద్ది ప్రీమియర్ షోలకు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే, రామ్ చరణ్ సతీమణి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదెల తన భర్త సినిమాకు అతిపెద్ద చీర్ లీడర్‌గా మారిపోయారు.
అభిమానులతో కలిసి థియేటర్లో సందడి
థియేటర్లో అభిమానుల మధ్య కూర్చుని ఉపాసన కొణిదెల చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉపాసన కొణిదెల కేవలం సినిమా చూడటమే కాదు, మెగా అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ థియేటర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పెద్ది సినిమాను వీక్షించారు.
వీడియోలు వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ఉపాసన అభిమానులతో మమేకమై సినిమాను ఆస్వాదించారు. రామ్ చరణ్ స్క్రీన్‌పై కనిపించిన కీలక సన్నివేశాలలో అభిమానులు ఈలలు, గోలలు చేస్తుంటే, ఉపాసన కూడా వారితో కలిసి కేరింతలు కొట్టారు. ఫ్యాన్స్‌తో కలిసి అరుపులతో గోల చేశారు.
ముఖ్యంగా, థియేటర్ నేలపై పడి ఉన్న పేపర్ ముక్కలను చేతిలోకి తీసుకుని, అభిమానుల తరహాలో గాల్లోకి చల్లుతూ ఉపాసన కొణిదెల సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంది. మెగా కోడలు ఇంత మాస్‌గా ఎంజాయ్ చేయడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
'అమేజింగ్'.. ఉపాసన వన్-వర్డ్ రివ్యూ
పెద్ది సినిమా ముగిసిన తర్వాత థియేటర్ బయటకు వస్తున్న ఉపాసనను మీడియా ప్రతినిధులు, అభిమానులు చుట్టుముట్టారు. భారీ భద్రత నడుమ ఆమె కారు వైపు వెళ్తుండగా, సినిమా ఎలా ఉందనే ప్రశ్న ఎదురైంది. దానికి ఉపాసన ఎక్కువ మాటలు చెప్పకుండా, కేవలం ఒకే ఒక్క మాటలో రివ్యూ ఇచ్చారు.
"అమేజింగ్," అని ఉపాసన కొణిదెల చిరునవ్వుతో పెద్ది మూవీపై వన్ వర్డ్ రివ్యూ ఇచ్చారు. రామ్ చరణ్ సతీమణి నోట ఈ మాట రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
'పెద్ది' గురించి కొన్ని విశేషాలు..
'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు సాన తెరకెక్కించిన రెండో చిత్రం ఇది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి వివిధ క్రీడలలో కనిపిస్తారు. ఒక వ్యక్తి తన మూలాలను, గుర్తింపును క్రీడల ద్వారా ఎలా వెతుక్కున్నాడనేది ఈ సినిమా కథాంశం.
ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
పెద్ది రివ్యూల ప్రకారం
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పించాయి. పెద్ది రివ్యూ ప్రకారం.. ఈ సినిమా గుర్తింపు గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తిందని, స్పోర్ట్స్ విభాగంలో క్రికెట్, కుస్తీ సీన్స్ చాలా బలంగా ఉన్నాయని సమాచారం.
అయితే, జాన్వీ కపూర్ పాత్ర కాస్త బలహీనంగా ఉందని, కొన్ని రొటీన్ మాస్ సీన్స్ ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా బుచ్చిబాబు, రామ్ చరణ్ ఖాతాలో ఇది మరో విజయంగా నిలుస్తుందని టాక్ వస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


