OTT Horror: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 550 కోట్ల సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్-బాడీలు మార్చే ఆత్మ- 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్
Evil Dead Burn OTT Release: ప్రపంచవ్యాప్తంగా హారర్ ప్రియులను భయపెట్టిన ఈవిల్ డెడ్ బర్న్ ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రూ. 550 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ భయానక థ్రిల్లర్ ఏకంగా 3 ఓటీటీల్లో మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ అవనుంది. ఈవిల్ డెడ్ బర్న్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Evil Dead Burn OTT Streaming On 3 Platforms: ఎప్పుడైనా సరే ఓటీటీల్లోకి వచ్చే హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా 'ఈవిల్ డెడ్' అనే పేరు వింటేనే హారర్ లవర్స్‌కు ఒళ్లు గగుర్పొడుస్తుంది. 1981లో సామ్ రైమి, రాబ్ టేపర్ట్, బ్రూస్ కాంప్‌బెల్ కాంబినేషన్‌లో మొదలైన ఈ ఐకానిక్ హారర్ ఫ్రాంచైజ్, గత 40 ఏళ్లుగా భయానక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.

ఫ్రాంచైజ్‌లో ఆరో సినిమా
ఈ ఫ్రాంచైజ్‌లో వచ్చిన ఆరో చిత్రం, రీబూట్ వెర్షన్‌లో మూడో భాగమైన 'ఈవిల్ డెడ్ బర్న్' (Evil Dead Burn) ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను భయపెట్టింది. సెబాస్టియన్ వానిసెక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ ఈవిల్ డెడ్ బర్న్ ఓటీటీ వేదికగా మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
డెవిల్ బుక్.. పాత బంగ్లా.. అసలు కథ ఇదే!
ఈ కథ అంతా ఆలిస్ (సుహైలా యాకూబ్) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. రోడ్డు ప్రమాదంలో భర్త విల్ ప్రైస్ (జార్జ్ పుల్లర్) చనిపోవడంతో, అతని అంత్యక్రియల తర్వాత ఆలిస్ తన భర్త కుటుంబ సభ్యులను కలవడానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక పాత బంగ్లాకు వెళ్తుంది. ఆ ఇంట్లో గతంలో విల్ తాత 'బుక్ ఆఫ్ ది డెడ్' (నెక్రోనామికన్) అనే ఒక భయానక శాతానా పుస్తకంపై పరిశోధనలు చేసి ఉంటాడు.
అయితే విల్ తమ్ముడు జోసెఫ్ (వెడ్నెస్ డే సిరీస్ ఫేమ్ హంటర్ దూహన్) ప్రమాదవశాత్తు ఆ పుస్తకానికి సంబంధించిన పరిశోధనలను కదపడంతో ఒక దెయ్యాల ఆత్మ బయటకు వస్తుంది. ఆ భయంకరమైన రాక్షస ఆత్మ ఇంట్లోని ప్రతీ ఒక్కరి శరీరంలోకి ప్రవేశించి వారిని 'డెడైట్స్' (డెవిల్స్)గా మార్చడానికి ప్రయత్నిస్తుంది.
రాక్షస ఆత్మల నుంచి
ఈ భయంకరమైన రాక్షస ఆత్మల నుంచి తప్పించుకోవాలన్నా, వాటిని చంపాలన్నా 'కాండారియన్ డాగర్' అనే ప్రత్యేక కత్తి మాత్రమే మార్గం. ఆ కత్తిని వెతికి పట్టుకుని ఆలిస్, జోసెఫ్ తమ ప్రాణాలను ఎలా కాపాడుకున్నారనేదే మిగతా కథ.
రూ.550 కోట్ల కలెక్షన్లు..
ప్రపంచవ్యాప్తంగా జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈవిల్ డెడ్ బర్న్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సుమారు 20 మిలియన్ల డాలర్ల (రూ. 165 కోట్లకు పైగా) బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 65.7 మిలియన్ డాలర్లు (రూ. 550 కోట్లకు పైగా) రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
2023లో వచ్చిన 'ఈవిల్ డెడ్ రైజ్' (147.2 మిలియన్లు డాలర్లు) అంత కాకపోయినా, ఈ చిత్రం హారర్ ప్రియులను బాగానే అలరించింది. అలాంటి హారర్ థ్రిల్లర్ ఈవిల్ డెడ్ బర్న్ ఓటీటీలోకి వచ్చేయనుంది.
ఆగస్ట్ 4 నుంచి
"హారర్ ప్రియుల కోసం ఈ చిత్రాన్ని డిజిటల్ వేదికపైకి తీసుకొస్తున్నాం. ఆగస్టు 4 నుంచి వార్నర్ బ్రదర్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పీవీఓడీ (PVOD) పద్ధతిలో అందుబాటులో ఉంటుంది" అని వార్నర్ బ్రదర్స్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధులు వెల్లడించారు.
ఆపిల్ టీవీ (Apple TV), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యూట్యూబ్ మూవీస్ ద్వారా ఈ సినిమాను చూసే వెసులుబాటు కల్పించారు. అంటే, 3 ఓటీటీల్లో ఈవిల్ డెడ్ బర్న్ మరికొన్ని గంటల్లో రిలీజ్ అవనుంది.
3 ఓటీటీల్లో ఈవిల్ డెడ్ బర్న్
అంతేకాకుండా సెప్టెంబర్ 22 నుంచి 4K అల్ట్రా హెచ్‌డీ, బ్లూ-రే డిస్క్‌లలో ఈవిల్ డెడ్ బర్న్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇంట్లోనే కూర్చుని వెన్నులో వణుకు పుట్టించే బాడీ హారర్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి ఆపిల్ ప్లస్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ ఓటీటీల్లోకి వస్తున్న ఈవిల్ డెడ్ బర్న్ ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


