Ramayana: వినాయక చవితి స్పెషల్.. రామాయణం ఫస్ట్ లుక్.. ఏకాంతంలో రామ్‌-సీతలా రణ్‌బీర్, సాయి పల్లవి విజువల్ వండర్!

Ramayana: భారతీయ మహాకావ్యం ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కుతున్న రామయణం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి కనిపిస్తున్న గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది వైరల్ గా మారింది.

Published on: Sep 14, 2026, 09:05:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ramayana: సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారతీయ వెండితెర దృశ్యకావ్యం 'రామాయణం' (Ramayana) నుంచి ఓ అప్డేట్ వచ్చింది. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర నిర్మాతలు నమిత్ మల్హోత్రా, నితేష్ తివారీలు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

వినాయక చవితి స్పెషల్.. రామాయణం ఫస్ట్ లుక్.. ఏకాంతంలో రామ్‌-సీతలా రణ్‌బీర్, సాయి పల్లవి విజువల్ వండర్! (x/WorldOfRamayana)
వినాయక చవితి స్పెషల్.. రామాయణం ఫస్ట్ లుక్.. ఏకాంతంలో రామ్‌-సీతలా రణ్‌బీర్, సాయి పల్లవి విజువల్ వండర్! (x/WorldOfRamayana)

రామాయణం ఫస్ట్ లుక్

వినాయక చవితి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి ఏకాంతంలో ఉన్న ప్రశాంతమైన దృశ్యాన్ని చూపించారు. దీనితో పాటు విడుదల చేసిన 30 సెకన్ల విజువల్ గ్లింప్స్ వీడియో విజువల్ గ్రాండియర్‌ను పరిచయం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.

సాంగ్ అప్డేట్

రామాయణం పోస్టర్ తో పాటు ఓ అదిరే అప్డేట్ ను కూడా మూవీ టీమ్ పంచుకుంది. త్వరలోనే ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman) స్వరపరిచిన తొలి పాట 'జై జై రామ్' (Jai Jai Ram) ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇప్పటికే రామాయణ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోస్టర్ తో అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

రావణుడిగా యశ్

బాలీవుడ్ అండ్ సౌత్ ఇండియా అగ్ర నటీనటులు కలిసి నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఒక కీలక పాత్ర ( రావణాసురుడు) పోషించడమే కాకుండా ఈ చిత్రానికి సహ నిర్మాతగా (Co-Producer) కూడా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, రవి దూబే, వివేక్ ఒబెరా వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది.

బిగ్ రిలీజ్

సంగీత ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తూ భారతీయ సంగీత దిగ్గజం ఎ.ఆర్. రెహమాన్ మరియు హాలీవుడ్ లెజెండరీ కాంపోజర్ హన్స్ జిమ్మర్ (Hans Zimmer) ఈ చిత్రానికి ఒరిజినల్ స్కోర్ అండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రపంచస్థాయి ఐమాక్స్ (IMAX 3D), వివిధ భారతీయ, అంతర్జాతీయ భాషల్లో 'రామాయణం - పార్ట్ 1' చిత్రం 2026 నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

విజువల్ వండర్

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో నిర్మితమవుతున్న అతిపెద్ద ప్రాజెక్ట్‌లలో 'రామాయణం' అగ్రస్థానంలో నిలుస్తుంది. విజువల్ వండర్ గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ మూవీపై ఉన్న అంచనాలు పెంచేసింది. విజువల్స్, రావణాసురుడుగా యశ్ నటన ఈ మూవీకి మరింత హైప్ తెచ్చింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More